»   » జూ.ఎన్టీఆర్‌: లీగల్ నోటీసులేంటి..ఆర్దిక ఇబ్బందులేంటి

జూ.ఎన్టీఆర్‌: లీగల్ నోటీసులేంటి..ఆర్దిక ఇబ్బందులేంటి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: సినిమాలకు ఆర్దిక ఇబ్బందులు ఎదురవ్వటం, ఫైనాన్సియర్స్ నుంచి ఒత్తిడి రావటం,చివరి నిముషాల్లో సెటిల్ మెంట్స్ ఇవన్నీ సినిమావారికి అతి కామన్. అయితే సాధారణంగా పెద్ద సినిమాలకు ఈ సమస్యలు ఎప్పుడో కానీ ఎదురుకావు. ఎందుకంటే పెద్ద హీరోల సినిమాలకు అండర్ ప్రొడక్షన్ లోనే బిజినెస్ అయిపోతూంటుంది. అయితే ఎన్టీఆర్ 'రభస' కు ఆర్దిక ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ మీడియాలో వినిపిస్తోంది. ముంబై కు చెందిన ఓ ఫైనాన్స్ కంపెనీ నిర్మాత బెల్లంకొండకు లీగల్ నోటీస్ పంపిందని చెప్తున్నారు. దీనికి కారణం సినిమా షూటింగ్ లో డిలే అవటమే అంటున్నారు. అయితే ఇది రూమరా నిజంగానే ఈ సమస్య ఎదురయ్యిందా అనేది తెలియాల్సి ఉంది.

జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజాచిత్రం 'రభస'. సమంత, ప్రణీత ఎన్టీఆర్‌కు జోడీగా నటిస్తున్నారు. శ్రీ లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్‌ పతాకంపై బెల్లంకొండ సురేష్‌, బెల్లంకొండ గణేష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్‌తో 'కందిరీగ' తీసి తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్న సంతోష్‌ శ్రీనివాస్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

చిత్ర సమర్పకుడు బెల్లంకొండ సురేష్‌ మాట్లాడుతూ ''ఆది' తరవాత ఎన్టీఆర్‌తో తెరకెక్కిస్తున్న చిత్రమిది. దర్శకుడు ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్న విధానం బాగుంది. ఎన్టీఆర్‌ డ్యాన్సులు, పోరాటాలు అభిమానులకు థ్రిల్‌ కలిగిస్తాయి'' అన్నారు.

NTR's Rabhasa In deep Financial Troubles?

దర్శకుడు చెబుతూ ''ఎన్టీఆర్‌ అభిమానులకు ఈ సినిమా పండగలా ఉంటుంది. ఆయనతో పనిచేయడం సంతోషంగా ఉంది. తమన్‌ చక్కటి పాటలిచ్చారు''అన్నారు. సంతోష్‌ శ్రీన్‌వాస్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'రభస'. ఈ చిత్రాన్ని ఆగస్టు 14న విడుదల చేయబోతున్నారు.

ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రంలో షాయాజీ షిండే, జయసుధ, బ్రహ్మానందం, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, నాజర్, అజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్లో ఒక మంచి వినోదాత్మక చిత్రంగా తీర్చదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : తమన్‌ , ఫోటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ : ఎ.ఎస్.ప్రకాష్, సమర్పణ : బెల్లంకొండ సురేష్, నిర్మాత : బెల్లంకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్.

English summary
Jr NTR's latest movie 'Rabhasa' which is now rumoured to be getting stuck in financial troubles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu