Just In
- 7 min ago
వాడి కోసం ఏడేళ్ల జీవితాన్ని నాశనం చేసుకున్నావ్.. రష్మీపై బుల్లెట్ భాస్కర్ కామెంట్స్
- 1 hr ago
ఇంకా చావలేదా? అని అడిగారట.. ట్రోలింగ్‌పై నటి కామెంట్స్
- 1 hr ago
అభిమాని చర్యకు షాక్.. గుండెపై పచ్చబొట్టు.. సింగర్ యశస్వి క్రేజ్‌కు నిదర్శనం
- 2 hrs ago
యాంకర్స్‌కి ఉండాల్సిన ప్రధాన లక్షణమిదే.. గుట్టువిప్పిన సుమ!!
Don't Miss!
- Sports
రోహిత్.. ఎందుకింత నిర్లక్ష్యం! అప్పనంగా వికెట్ సమర్పించుకున్నావ్! గవాస్కర్ ఫైర్!
- News
అయోధ్య రామ మందిరానికి రఘురామకృష్ణ రాజు విరాళం.. ఎంత మొత్తం అంటే..
- Finance
లవర్స్ డే గిఫ్ట్: ఐపీఓ మార్కెట్లోకి డేటింగ్ యాప్: పబ్లిక్ ఇష్యూ: కళ్లు చెదిరే ఆదాయం
- Automobiles
అప్పుడే అయిపోయాయ్.. సోల్డ్ అవుట్ బోర్డ్ పెట్టేశారు..
- Lifestyle
ఈ ప్రాబ్లమ్స్ మీ మ్యారేజ్ లైఫ్ ని నాశనం చేస్తాయని తెలుసా...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఎన్టీఆర్ 'రామయ్యా వస్తావయ్యా' లీకెడ్ డైలాగులు
హైదరాబాద్: ఎన్టీఆర్ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న సినిమా 'రామయ్యా వస్తావయ్యా'. సమంత, శ్రుతిహాసన్ ప్రధాన పాత్రధారులు. హరీష్ శంకర్ దర్శకుడు. దిల్‌రాజు నిర్మాత. ఈ చిత్రంలో డైలాగులు లీక్ అయ్యాయంటూ కొన్ని నెట్ లో ప్రచారం అవుతున్నాయి. ఈ డైలాగులు సినిమాలో ఉన్నాయో లేవో కానీ అభిమానులను అలరిస్తున్నాయి.
ఆ డైలాగులు..
ఎన్టీఆర్ ..సమంతతో
"ఫిమేల్ లో మేల్ ఉన్నాడు...వుమెన్ లో మేన్ ఉంటాడు...షి లో హి ఉంటాడు. సో దీన్ని బట్టి నీకు ఏమి అర్దం అయ్యింది...గర్ల్ కి బోయ్స్ పక్కగా కావాలమ్మా ఇది ఫాక్ట్..."
ఎన్టీఆర్...శృతి హాసన్ తో...
"మనం కలలో కూడా ఒకరిని మర్చిపోలేక పోతున్నాము అంటే వాల్లంటే మనకి చంపేంత కోపం అయిన ఉండాలి..లేదా చచ్చిపోయేటంత ప్రేమైనా ఉండాలి...ఏముంది మనిద్దరి మధ్య..."
చిత్రం గురించి దిల్‌రాజు మాట్లాడుతూ "వచ్చే వారంలో పాటల్ని విడుదల చేస్తాం. యూనిట్ విదేశాల్లో ఉంది. త్వరలో షూటింగ్ పూర్తవుతుంది. హరీష్‌కి హ్యాట్రిక్ సినిమా అవుతుంది. టీజర్లో ఎన్టీఆర్ లుక్స్, వాయిస్ మోడ్యులేషన్ చాలా కొత్తగా ఉంది. తమన్ చక్కటి సంగీతాన్నిచ్చారు. ఎన్టీఆర్ కెరీర్‌లోనే పెద్ద హిట్ సినిమా అవుతుంది'' అని అన్నారు.
తమన్ మాట్లాడుతూ...."ఎన్టీఆర్‌తో బృందావనం, బాద్షా తర్వాత నేను చేస్తున్న మూడో సినిమా ఇది. హరీష్ ఎంత మంచి సంగీతాన్ని రాబట్టుకుంటారో అందరికీ తెలిసిందే. చక్కటి పాటలు కుదిరాయి'' అని అన్నారు. జాబిల్లి నువ్వే చెప్పమ్మా అనే సానుకూల దృక్పథం ఉన్న పాటను రాసినట్టు అనంతశ్రీరామ్ అన్నారు. సినిమాను పెద్ద హిట్ చేయాలనే తపనతో కృషి చేసినట్టు రమేష్ రెడ్డి తెలిపారు.
దర్శకుడు మాట్లాడుతూ ''ఈ సినిమాలో ఎన్టీఆర్‌లో కొత్త లుక్, నూతన సంభాషణ శైలి చూస్తారు. యువతరానికి నచ్చే కుటుంబ కథాచిత్రంగా నిలుస్తుంది. రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. త్వరలో పాటల్ని విడుదల చేస్తాము'' అన్నారు.
'రామయ్యా వస్తావయ్యా' లో ఎన్టీఆర్, సమంత జంటగా నటిస్తున్నారు. కోట శ్రీనివాసరావు, ముఖేష్ రుషి, తనికెళ్ల భరణి, ప్రగతి, రవిశంకర్, రావు రమేష్, అజయ్, భరత్, భరణి శంకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు పాటలు: సాహితి, భాస్కరభట్ల, అనంత్‌శ్రీరామ్, శ్రీమణి, సంగీతం: థమన్.యస్.యస్., కెమెరా: ఛోటా.కె.నాయుడు, ఎడిటింగ్; గౌతమ్‌రాజు, ఆర్ట్; బ్రహ్మకడలి, స్క్రీన్‌ప్లే: రమేష్ రెడ్డి, సతీష్ వేగేశ్న, తోట ప్రసాద్, ఫైట్ మాస్టర్స్: రామ్-లక్ష్మణ్, కణల్ కణ్ణన్, వెంకట్, నృత్యాలు: దినేష్, గణేష్, శేఖర్ భాను, కథ, మాటలు, దర్శకత్వం: హరీష్ శంకర్.యస్., నిర్మాత: రాజు, సహ నిర్మాతలు; శిరీష్ లక్ష్మణ్.