»   » సుకుమార్ చిత్రం కోసం:ఎన్టీఆర్ టెర్రిఫిక్ లుక్ (ఫొటో)

సుకుమార్ చిత్రం కోసం:ఎన్టీఆర్ టెర్రిఫిక్ లుక్ (ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఎన్టీఆర్,సుకుమార్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘నాన్నకు ప్రేమతో' అనే వర్కింగ్ టైటిల్ తో రాబోయే ఈ చిత్రంలో ఎన్టీఆర్ లుక్ టెర్రిఫిక్ గా ఉండబోతోందని తెలిసిందే. ఈ మేరకు ఎన్టీఆర్ ఈ క్రింద ఫొటోల మాదిరి రెడీ అయినట్లు సమాచారం. మొదట ఈ లుక్ ని బయిట ప్రపంచానికి చూపాలని లేకపోయినా దానవీరశూరకర్ణ ఆడియో కోసం బయిటకు రాక తప్పలేదు. ఈ నేపధ్యంలో ఈ లుక్ బయిటకు వచ్చింది. సినిమాలో కథ రెండు షేడ్స్ తో జరుగుతుందని, ఒక షేడ్ లో ఎన్టీఆర్..ఇలా గెడ్డంతో కనిపిస్తాడని చెప్పుకుంటున్నారు. ఇక్కడ ఫొటోలలో ఎన్టీఆర్ కొత్త లుక్ ని చూడండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇక చిత్రం మరిన్ని విశేషాల్లోకి వెళితే...

NTR sports terrific look for Sukumar film

మే 14,15 లలో ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ లండన్ లో మొదలు కానుంది. ఈ టైటిల్ మార్చే ఆలోచనలో దర్శక,నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది. న్యూమరాలిజీ ప్రకారం...నా అక్షరంతో ప్రారంభమైన నా అల్లుడు, నాగ చిత్రాలు భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావటంతో ..మొదట నా వద్దని సెంటిమెంట్ గా అది వర్కవుట్ కాదని ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. దాంతో ‘మా నాన్నకు ప్రేమతో' అనే టైటిల్ పెట్టే అవకాసం ఉందని తెలుస్తోంది.

తారక్‌... కొత్త కోణం

తొలి అడుగుల్లోనే ఆకాశమే హద్దుగా ఇమేజ్‌ని సంపాదించుకొన్న హీరో ... ఎన్టీఆర్‌. ఆయన తెరపై తొడగొట్టాడు. మీసాలు మెలేశాడు. అభిమానులకు కావాల్సింది అదే కదా! అందుకే అనతికాలంలోనే మాస్‌ హీరో అనిపించుకొన్నాడు. అయితే మాస్‌ కథల్లో తప్ప ఆయన్ని ఇతరత్రా చిత్రాల్లో చూడలేమేమో అన్న విమర్శలు కూడా వచ్చాయి. వెంటనే నటుడిగా తనని తాను నిరూపించుకొనే ప్రయత్నం చేశారు తారక్‌.

సోషియో ఫాంటసీ మొదలుకొని సెంటిమెంట్‌ వరకు రకరకాల కథల్లో నటించి మెప్పించారు. ఇటీవల 'టెంపర్‌'తో తనలోని స్త్టెల్‌ కూడా చూపించాడు. ఆ చిత్రం అందించిన విజయంతో మరింత ఉత్సాహంగా ఉన్న ఉన్న ఎన్టీఆర్‌ ఇప్పుడు సుకుమార్‌ చిత్రం కోసం రంగంలోకి దిగుతున్నాడు. 'నాన్నకు ప్రేమతో' అనే పేరు ప్రచారంలో ఉన్న ఆ చిత్రం మే 1 నుంచి లండన్‌లో మొదలవ్వబోతోంది. దీంతోపాటు తారక్‌కోసం మరిన్ని కథలు సిద్ధమవుతున్నాయి.

NTR sports terrific look for Sukumar film

తన చిత్రాల్లో హీరోలని సరికొత్తగా చూపిస్తుంటారు సుకుమార్‌. ఇప్పుడు ఎన్టీఆర్‌ని కూడా తెరపై ఓ కొత్త పాత్రలో చూపించేందుకు ఆయన నడుం బిగించారు. అందుకోసం తారక్‌ స్త్టెల్‌ని కూడా పూర్తిగా మార్చేస్తున్నాడు. 'టెంపర్‌'లో కొత్త ఎన్టీఆర్‌ని చూసిన అభిమానులు సుక్కు చిత్రంపై మరిన్ని అంచనాలు పెంచుకొంటున్నారు. నాన్న ఆశయాన్ని నెరవేర్చే కొడుకు కథగా ప్రచారంలో ఉన్నప్పటికీ సుకుమార్‌ ఈ చిత్రాన్ని కొత్త తరహాలో తీర్చిదిద్దుతున్నట్టు సమాచారం. కథతో పాటు, కథనం కూడా వైవిధ్యంగా ఉంటుందని చిత్రవర్గాలు చెబుతున్నాయి. ఇందులో తారక్‌ సరసన రకుల్‌ప్రీత్‌సింగ్‌ నటిస్తోంది.

మరో ప్రక్క కథలు సిద్ధం..

'టెంపర్‌'తో ఫామ్‌లోకొచ్చిన ఎన్టీఆర్‌ కోసం పరిశ్రమలో బోలెడన్ని కథలు సిద్ధమవుతున్నాయి. స్టార్‌ దర్శకులు మొదలుకొని... కొత్తగా మెగాఫోన్‌ పట్టేందుకు సిద్ధమవుతున్న యంగ్‌ కెప్టెన్ల వరకు అందరూ ఎన్టీఆర్‌ని దృష్టిలో పెట్టుకొని కథలు సిద్ధం చేసుకొంటున్నారు. ఎన్టీఆర్‌తో 'అదుర్స్‌2' చిత్రాన్ని చేసేందుకు సిద్ధంగా ఉన్నారు వీవీ వినాయక్‌. హరీష్‌శంకర్‌ కూడా ఎలాగైనా ఎన్టీఆర్‌తో హిట్టు కొట్టాల్సిందే అంటున్నాడు.

మరోపక్క రచయిత వక్కంతం వంశీ ఎన్టీఆర్‌ కోసం ఎప్పుడో కథలు సిద్ధం చేసి పెట్టుకొన్నారు. వీటితో పాటు తమిళ చిత్రం 'కత్తి'ని కూడా ఎన్టీఆర్‌పై రీమేక్‌ చేయాలనే సన్నాహాలు జరుగుతున్నాయి. చూస్తుంటే ఎన్టీఆర్‌ రానున్న రోజుల్లో మరింత బిజీగా గడిపే అవకాశాలున్నాయి.

English summary
Straightened new hairdo, rugged beard and chiseled physique - That’s how NTR is, as he graced the event. This looks like his new look for the upcoming movie of Sukumar, that is tentatively titled “Naannaku Prematho”.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu