»   » ఎన్టీఆర్, సుకుమార్ చిత్రం టైటిల్ ఏంటంటే...

ఎన్టీఆర్, సుకుమార్ చిత్రం టైటిల్ ఏంటంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రీసెంట్ గా...'టెంపర్‌'తో తడాఖా చూపించాడు ఎన్టీఆర్‌. ఆయన విజృంభిస్తే బాక్సాఫీసు దగ్గర కాసుల పంటే అని 'టెంపర్‌' మరోసారి నిరూపించింది. ఆ ఉత్సాహంతోనే ఇప్పుడు మరో సినిమా మొదలెడుతున్నారు. ఎన్టీఆర్‌ హీరోగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. సుకుమార్‌ దర్శకుడు. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్. బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మాత.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
ఇటీవల ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ వారంలోనే చిత్రీకరణ మొదలెడతారు. ఈ చిత్రానికి దండయాత్ర అనే టైటిల్ ని పెట్టే అవకాసం ఉందని తెలుస్తోంది. ఇది దండయాత్ర...దయాగాడి దండయాత్ర అనేది పాపులర్ కావటంతో దండయాత్ర అనేదే ఫిక్స్ చేసే అవకాసం ఉందని చెప్పుకుంటున్నారు.

తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో సాగే చిత్రమిది. ఎన్టీఆర్‌ తండ్రిగా జగపతిబాబు నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. సుకుమార్‌ తరహాలో వైవిధ్యంగా సాగే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో ఎన్టీఆర్‌ గెటప్‌ సరికొత్తగా ఉంటుందని తెలుస్తోంది.

NTR and Sukumar on a Dandayatra?

ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్ లో 25 వ చిత్రం. ఈ చిత్రాన్ని సుకుమార్ డైరక్ట్ చేస్తున్నారు. మార్చి 5న చిత్రం ప్లోర్ మీదకు వెళ్ళనుంది. అలాగే...జనవరి 8,2016న సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. నవంబర్ దాకా రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీతి సింగ్ హీరోయిన్ గా చేయనుంది. జగపతిబాబు కీలకమైన పాత్రలోనూ, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తారు. ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్ ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తారు. ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిపోనుంది.

ఎన్టీఆర్, సుకుమార్ తొలి కాంబినేషన్ లో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా పతాకంపై భారీ నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ భారీ చిత్రం పూజా కార్యక్రమాలు డిసెంబర్ 18 ఉదయం 11.39 గంటలకు సంస్ధ కార్యాలయం చెన్నైలో జరిగాయి. ఈ పూజా కార్యక్రమంలో దర్శకుడు సుకుమార్, నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్, బోగవల్లి బాపినీడు పాల్గొన్నారు.

దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ... ఎన్టీఆర్ తో ఫస్ట్ టైమ్ వర్క్ చేయటం చాలా ఎక్సైటింగ్ గా ఉంది. తారక్ లో ఎంతో ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీని ఎలివేట్ చేసే స్కోప్ ఉన్న సబ్జెక్ట్ ఇది. ఇది ఓ రివేంజ్ డ్రామా. డిఫెరెంట్ స్టైల్ లో ఉంటుంది అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ... ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్తరం అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఎన్టీఆర్ కు డిఫెరెంట్ మూవి అవుతుంది. సబ్జెక్టు చాలా ఎక్సట్రార్డనరీగా ఉంది. ఈ రోజు ముహూర్తం బాగుండటంతో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభిస్తున్నాం అన్నారు.

English summary
Sukumar has been contemplating on the film's title for a long time and finally zeroed in on Dandayatra and NTR also seemed to have liked it.
Please Wait while comments are loading...