మరోసారి దెయ్యం కథపై ఫోకస్ పెట్టిన ఓంకార్.. ఈసారి మరింత భయపెట్టాలని..
టాలీవుడ్ సీనియర్ మోస్ట్ యాంకర్ ఓంకార్ అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. బుల్లితెరపై సింగింగ్, డ్యాన్సింగ్, గేమ్ షోస్ అంటూ ఎన్నో రకాల ప్రయోగాలు చేసిన ఓంకార్ బిగ్ స్క్రీన్ పై మాత్రం అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ కాలేదు. మొదట జీనియాస్ అనే సినిమాతో ఓంకార్ డైరెక్టర్ గా కెరీర్ ను స్టార్ట్ చేశాడు. ఆ సినిమా కోసం అప్పట్లో భారిగానే ఖర్చు చేశారు. కానీ సినిమా మాత్రం ఊహించని రేంజ్ లో డిజాస్టర్ అవ్వడంతో కొంత గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది.
ఇక మొత్తానికి రాజుగారి గది సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. హారర్ కామెడీ జానర్ లో వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి లాభాలను అందించడంతో ఓంకార్ కు బడా నిర్మాతల నుంచి ఆఫర్స్ చాలానే వచ్చాయి. ఇక అదే తరహాలో రాజుగారి గది సిరీస్ ను కొనసాగిస్తూ మరో రెండు సినిమాలు చేశాడు. కానీ ఆ సినిమాలు అంతగా సక్సెస్ అవ్వలేదు.

ఇక మధ్యలో మళ్ళీ బుల్లితెరపై అడుగులు వేసిన ఓంకార్ డిఫరెంట్ షోలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే రాజుగారి గది 4 స్క్రిప్ట్ కూడా రెడీ చేస్తున్నాడట. కరోనా హడావుడి తగ్గిన తరువాత ఆ సినిమా సెట్స్ పైకి రావచ్చని తెలుస్తోంది. ఈసారి నవ్వుతో పాటు మరింత భయాన్ని కలిగిస్తాడట. ఇక ప్రతిసారి కూడా ఈ సిరీస్ లో ఓంకార్ తన తమ్ముడు అశ్విన్ బాబును ముఖ్యమైన పాత్రలో చూపిస్తూ వస్తున్నాడు. ఇక నాలుగవ సారి కూడా అదే తరహాలో చూపించవచ్చని తెలుస్తోంది. మరి రాజుగారి గది 4తో ఓంకార్ ఏ స్థాయిలో సక్సెస్ అందుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











