»   »  ఎన్టీఆర్..వినాయక్ సినిమాకు మళ్ళీ బ్రేక్?

ఎన్టీఆర్..వినాయక్ సినిమాకు మళ్ళీ బ్రేక్?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Jr Ntr
ఎన్టీఆర్ ...'కంత్రి' పరాజయానికి కారణాలు విశ్లేషించుకుని ఈసారి ఎలాంటి పొరపాట్లకూ తావివ్వరాదనే పట్టుదలతో వున్నాడు. 'యమదొంగ'తో మళ్లీ గాడిలో పడిందనుకున్న కెరీర్ మళ్లీ ఇరుకున పడినట్లు భావించాడు .దాంతో కథ విషయంలో పట్టుదలగా ఉన్నాడు. దానికి నిదర్శనం 'ఆది' వంటి బ్లాక్ బస్టర్ తో తన కెరీర్ కి పునాదులు వేసిన వి.వి.వినాయక్ నే మరో సారి సరిగా కథ తయారు చేయమని అన్నట్లు తెలుస్తోంది. నిజానికి ఏప్రిల్‌లోనే ఎన్టీఆర్, వినాయక్ కాంబినేషన్‌లో మూడో సినిమా లాంఛనంగా మొదలైంది. అయితే ఇంతదాకా అది సెట్స్ మీదకు వెళ్లలేదు. కారణం కథ ఫైనల్ కాకపోవడమే అని తెలుస్తోంది. ఇదివరకు ఓసారి వినాయక్ వినిపించిన కథ నచ్చలేదని చెప్పాడు. దాంతో జూన్ నాటికి మరో స్క్రిప్టును తయారుచేసి, ఎన్టీఆర్‌ను ఒప్పించాలని అనుకున్నాడు వినాయక్. అలాగే జూలై 10 నుంచి షూటింగ్ మొదలు పెట్టాలని కూడా భావించారు.

వినాయక్ సొంతంగా ఒక కథనీ, దర్శక రచయిత దశరథ్ ఒక కథనీ రాసుకుని, ఆ రెండింటినీ మేళవించి మరో కథని తయారు చేశారు. దాన్ని ఇటీవల ఎన్టీఆర్‌కు వినిపించారు. విన్న వెంటనే 'అబ్బే ఏమీ బాగోలేదు వినయ్' అని చెప్పేశాడుట ఎన్టీఆర్. 'ఇలాంటి పాత కథలు వద్దు. నాకు కొత్తగా వుండాలి. ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తాను' అని స్పష్టం చేశాడని తెలుస్తోంది. దాంతో మళ్లీ కథల వంటకం మొదలుపెట్టారుట. కాబట్టి జూలై 10న ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు లేవు. బహుశా ఈ నెలాఖరులోనో, ఆగస్టు తొలి వారంలోనో షూటింగ్ మొదలుకావచ్చు, అదీ కథ ఫైనలైజ్ అయితేనే! యేదైమైనా ఎన్టీఆర్ మంచి నిర్ణయం తీసుకున్నాడు...కథా,కథనాలే పెద్ద హీరోలుగా చేస్తాయనే విషయాన్ని గ్రహించాడని శ్రేయాబిలాషులు,అభిమానులు అంటున్నారు. గాబట్టి ఆ వచ్చే ప్రొడక్టు పెద్ద హిట్టయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X