For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Prabhas: రూ. 21 కోట్లు అప్పు తీసుకున్న ప్రభాస్.. షాక్ లో ఫ్యాన్స్.. కబ్జా నుంచి కాపాడుకునేందుకా?

  |

  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఉన్న క్రేజ్ గురించి స్పెషల్ గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. జక్కన్న చెక్కిన బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు డార్లింగ్. రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా ఈశ్వర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రభాస్ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. సినిమా హిట్ అయిన ఫ్లాప్ అయిన ఆయనపై అభిమానులకు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గడంలేదు. ప్రభాస్ నుంచి ఎప్పుడెప్పుడు కొత్త సినిమా వస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అభిమానులకు ఓ షాకింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అదేంటనే వివరాల్లోకి వెళితే..

  భారీ చిత్రాలు చేస్తూ..

  భారీ చిత్రాలు చేస్తూ..

  పెద్ద ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్‌తోనే సినిమాల్లోకి వచ్చినా అతి తక్కువ సమయంలో టాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఎదిగాడు ప్రభాస్. అలా సుదీర్ఘ కాలం పాటు తెలుగులో సత్తా చాటిన ప్రభాస్.. దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. దీంతో అప్పటి నుంచి భారీ చిత్రాలనే చేస్తూ సత్తా చాటుతున్నాడు. ఇలా ఇప్పటికే రెబెల్ స్టార్ ప్రభాస్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్', బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తోన్న 'ఆదిపురుష్', నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్టు K', సందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్' అనే భారీ చిత్రాల్లో నటిస్తున్నాడు.

  కీలకమైన సన్నివేశాలతో..

  కీలకమైన సన్నివేశాలతో..

  ఇప్పటికే నాలుగు క్రేజీ ప్రాజెక్టులను ప్రకటించిన ప్రభాస్.. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో 'రాజా డీలక్స్' (పరిశీలనలో ఉన్న పేరు) అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఈ మూవీ హర్రర్ కామెడీతో రాబోతుందని ప్రచారం జరుగుతోంది. ఇక, ఈ సినిమా పూజా కార్యక్రమాలు అక్టోబర్ 17వ తేదీన జరిగాయి. ఆ వెంటనే ఓ భారీ బంగ్లా సెట్‌ను రూపొందించిన చిత్ర యూనిట్ మొదటి షెడ్యూల్‌ను ప్రారంభించి కొన్ని కీలకమైన సన్నివేశాలను కూడా చిత్రీకరించింది. ఇప్పుడు కూడా పేరున్న నటీనటులతో ప్రభాస్ లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

  సరైనా హిట్ లేక..

  సరైనా హిట్ లేక..

  ఇక తాజాగా ఈ సినిమా సెట్ లోని ప్రభాస్ ఫొటో లీక్ అయింది. ఇందులో ప్రభాస్ కొత్త లుక్ లో దర్శనమివ్వగా ఈ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అభిమానులందరూ వింటేజ్ ప్రభాస్ అంటూ కొనియాడుతున్నారు. ఈ సినిమాతో డార్లింగ్ అభిమానులకు డైరెక్టర్ మారుతి మంచి ట్రీట్ ఇవ్వనున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే బాహుబలి తర్వాత ప్రభాస్ కు సరైన హిట్ దక్కలేదు. సాహో, రాధ్యేశ్యామ్ వరుసగా డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో తర్వాత ఎలాగైన హిట్ కొట్టాలని ప్రభాస్.. అలాగే అతని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

   రూ. 21 కోట్ల రుణం తీసుకున్నట్లు..

  రూ. 21 కోట్ల రుణం తీసుకున్నట్లు..


  ఇక తాజాగా డార్లింగ్ ప్రభాస్ గురించి ఓ క్రేజీ రూమర్ షికార్లు చేస్తోంది. ప్రభాస్ తనకున్న హైదరాబాద్ ప్రాపర్టీలోని ఒకదానిపై ఓ బ్యాంకులో సుమారు రూ. 21 కోట్ల రుణం తీసుకున్నాడని సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు వస్తున్నాయి. ఆ అమౌంట్ కు సంబంధించిన చెక్ కూడా తాజాగా ప్రభాస్ కు అందిందని ఇండస్ట్రీ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. దీంతో ప్రభాస్ వంటి స్టార్ బ్యాంకులో రుణం తీసుకోవాల్సిన అవసరం ఏంటీ అనే తదితర విషయాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

  బ్యాంకులో ఎందుకు..

  బ్యాంకులో ఎందుకు..

  పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ నిజానికి ఇప్పుడు గ్లోబల్ స్టార్. ప్రభాస్ సినిమా ఒప్పుకుంటే ఆయనకు సుమారు రూ. 100 కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చే నిర్మాతలు ఉన్నారు. అలాంటి ప్రభాస్ బ్యాంకులో రుణం తీసుకోవడం ఏంటని తల బాదుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే డబ్బు కోసం ప్రాపర్టీని బ్యాంకులో పెట్టాల్సిన అవసరం ఏంటీ అని.. డబ్బులు అవసరమై కాదని.. ప్రాపర్టీ కబ్జా కాకుండా ఉండేందుకే ప్రభాస్ ఇలా చేసి ఉండొచ్చని మరికొందరు అనేక రకాలుగా చెప్పుకుంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజం ఎంతుందో.. అది ఎప్పుడు తెలియాలో వేచి చూడాలి.

  English summary
  Young Rebel Star Prabhas Taking Rs 21 Crore Money As Bank Loan On His Hyderabad Property Rumours Goes Viral.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X