»   » 'ప్రేమమ్‌' తెలుగు రీమేక్‌: పరిణీతీ చోప్రా ని అడుగుతున్నాం

'ప్రేమమ్‌' తెలుగు రీమేక్‌: పరిణీతీ చోప్రా ని అడుగుతున్నాం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: మళయాళీ బ్లాక్‌బస్టర్‌ చిత్రం ప్రేమమ్‌ రీమేక్‌లో బాలీవుడ్‌ నటి పరిణీతీ చోప్రా నటించనున్నట్లు ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న టాక్. ఈ చిత్రాన్ని తెరకెక్కించబోయే దర్శకుడు చందూ మొండేటి.ఇందులో నాగచైతన్య ముఖ్య పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ఎస్‌.రాధాకృష్ణ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ ఏడాది ఆఖరున చిత్ర షూటింగ్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి.

దర్శకుడు చందు మెండేటి స్పందిస్తూ.. పరిణీతీతో చర్చలు జరుపుతున్నామని, ఆమె ఫరా ఖాన్‌ సినిమాతో బిజీగా ఉండడంతో డేట్లు కుదరట్లేదని, ఇప్పటికైతే ఏ విషయమూ కచ్చితంగా నిర్ధారించలేదని పేర్కొన్నారు. ఈ సినిమా కోసం దిషా పతానీ అనే మరో నటితో కూడా సంప్రదింపులు జరుగుతున్నట్లు సమాచారం.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ మధ్యకాలం చిన్న బడ్జెట్ లో వచ్చి మళయాళంలో సూపర్ హిట్టైన చిత్రం 'ప్రేమమ్‌'. ఇదో ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీ. చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం అక్కడ భారీ వసూళ్లు కొల్లగొట్టింది. ఇప్పుడీ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Parineeti Chopra may star in Telugu remake of 'Premam'

ఇందులో నాగచైతన్య హీరోగా నటిస్తారని తెలిసింది. కె.రాధాకృష్ణ నిర్మిస్తారు. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తారు‌. ఇటీవల చైతూ కూడా ఈ సినిమాని చూశాడట. తనకు బాగా నచ్చి రీమేక్‌కి పచ్చజెండా ఊపేశాడని చెప్పుకొంటున్నారు. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.

జార్జ్ అనే కుర్రాడు టీనేజ్ లో, కాలేజ్ లో , సెటిలేజ్ లో ముగ్గురు అమ్మాయిలను ప్రేమిస్తాడు. వారి ప్రేమను సాధించుకోవటం లో ఊహించని అడ్డంకులు ఎదురై ,కలలు కరిగిపోయి ప్రేమించిన వారు మరొకరితో సెటిల్ అవ్వతుంటే తట్టుకోలేక గుండె పగిలేలా.. ఇలా కథ సాగుతుంది.
ఇక నివిన్ పౌలీ ఈ చిత్రంతో హీరో గా పరిచయమయ్యారు. ఆల్ఫోన్సే పూతరేన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అతి తక్కువ బడ్జెట్ లో తెరకెక్కింది. మే 29న విడుదలయిన ఈ చిత్రం పెద్ద హిట్టయ్యింది.

జూన్ నెలలో విడుదలైన ఈ 'ప్రేమమ్' చిత్రం టాక్ బాగుండటంతో ... విదేశాలలోనూ విడుదల చేశారు. ఇక ఇప్పటికే ఈ సినిమా వసూళ్ళు యాభై కోట్లకు చేరుకున్నాయి. మళయాళ పరిశ్రమలో ఇలా లో బడ్జెట్ చిత్రం ఈ రేంజిలో హిట్ అయ్యి..ఇంత వసూలు చేయటం పెద్ద రికార్డు.
ఈ చిత్రం రీమేక్ రైట్స్ కోసం తమిళ, కన్నడ భాషల నుండే కాకుండా హిందీ పరిశ్రమనుండీ మంచి డిమాండ్ ఉందని ట్రేడ్ వర్గాల సమాచారం.

English summary
Bollywood actress Parineeti Chopra is in talks to star in the Telugu remake of Malayalam blockbuster 'Premam'. "We are in talks with Parineeti. Since she has a project with Farah Khan, she's finding it difficult to allocate dates. Nothing is yet to be confirmed," film's director Chandoo Mondeti
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu