»   »  ప్రిన్స్ తో పార్వతి

ప్రిన్స్ తో పార్వతి

Posted By:
Subscribe to Filmibeat Telugu
Parvathi Melton
'వెన్నెల' సినిమాతో పరిచయమైన పార్వతీ మిల్టన్ కి గోల్డన్ డేస్ ప్రారంభమయినట్లున్నాయి.ఈ మథ్యనే రిలీజయిన 'జల్సా' బాగా కలిసి వచ్చింది. అందులో పవన్ కల్యాణ్ సరసన నటించిన మెయిన్ హీరోయిన్ ఇలియానా కన్నా ఆమే ఎక్కువ మార్కులు కొట్టేసింది. అంతే గాక పవన్ దృష్టిలో పడి పులి సినిమా లో అవకాశం సంపాదించబోతోందని వార్తలు వస్తున్నాయి. అలాగే 'జల్సా' దర్శకుడు త్రివిక్రమ్ తాజాగా మహేష్ హీరోగా ప్రారంభించిన భారీ ప్రాజెక్ట్ 'వరుడు' లో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది.

ఏప్రిల్ 30న పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ నుంచి జరుగనున్నది. ఇక బయట 'జల్సా' షూటింగ్ సమయంలో పార్వతి త్రివిక్రమ్‌ను బాగా ఇంప్రెస్ చేసినట్లు చెప్పుకుంటున్నారు. అందులో ఆమె 'సెక్సీ'గా కనిపించింది. అదే సంగతి హీరోయిన్ ఇలియానాతో కూడా ఆ సినిమాలో ఆయన చెప్పించారు. పార్వతిని ఉద్దేశించి ఇలియానా 'అది నాకంటే సెక్సీగా వుంటుంది' అంటుంది. అదే వర్కవుట్ అయ్యి ఇప్పుడు 'వరుడు'లోనూ ఆమెకు సెకండ్ హీరోయిన్ ఛాన్స్ వచ్చిందంటున్నారు. విశేషమేమిటంటే పులి,వరుడు రెండు చిత్రాలకు శింగనమల రమేషే నిర్మాత.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X