»   » పవన్‌తో ఎమ్మల్యేల భేటీ...చివరకు అలా

పవన్‌తో ఎమ్మల్యేల భేటీ...చివరకు అలా

Posted By:
Subscribe to Filmibeat Telugu
Pawan calls to ex-PRP’ians rises new speculations
హైదరాబాద్ : పవన్‌తో త్రిమూర్తులు భేటీ అంటూ మీడియాలో హడావుడి ఓ రేంజిలో జరిగింది. రాజకీయాలపై తనకున్న అభిప్రాయాల్ని ఈనెల రెండో వారంలో స్వయంగా వెల్లడిస్తానని పవన్‌కళ్యాణ్‌ ప్రకటించిన నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఆయనతో భేటీ అయ్యారనే ప్రచారం సాగింది. ఎందుకు కలవాలనుకుంటున్నారు...దీనికి వెనక వ్యూహం ఏమిటంటూ వార్తలు వరసగా వెలువడ్డాయి.చివరికి వారెవరూ ఆయనను కలవలేదు. అయితే మీడియా మాత్రం ఈ విషయానికి అథిక ప్రాధాన్యత ఇచ్చింది.

గతంలో ప్రరాపాలో ఉన్న రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు తాజాగా తెదేపాలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. పాత పరిచయాలతో పవన్‌కళ్యాణ్‌తో భేటీ కావాలని భావించిన తోట త్రిమూర్తులు సమయం కోరారు. ఈ విషయం మీడియాలో విస్తృతంగా రావటంతో తరువాత కలుస్తానని ఎమ్మెల్యే తిరిగి సమాచారమిచ్చారు. మరో ఎమ్మెల్యే వంగా గీత కూడా పవన్‌తో భేటీ అయ్యారని ప్రచారం సాగినా వాస్తవం కాదని సమాచారం.


పవన్‌కల్యాణ్‌ రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారా..! రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నారా..! లేదా ఇప్పటికే ఉన్న పార్టీలో చేరబోతున్నారా!! ...ఇలాంటి ప్రచారం ఆదివారం ఉదయం నుంచి సోషల్‌ మీడియాలో విస్తృతంగా సాగింది. పవన్‌ కల్యాణ్‌ పార్టీ పేరు, లోగో వివరాలు త్వరలోనే వెల్లడవుతాయని, ఆయన ఎంపీగా పోటీచేస్తారని సామాజిక మాధ్యమం హోరెత్తింది.

పవన్‌కల్యాణ్‌ ఓ పార్టీ తరఫున పోటీ చేయబోతున్నారని, లేదంటే ఆయనే స్వయంగా ఓ పార్టీని స్థాపించే ఆలోచన చేస్తున్నారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ వూహాగానాల నేపథ్యంలో.. రాజకీయాలపై తనకున్న అభిప్రాయాల్ని వెల్లడించేందుకు పవన్‌కల్యాణ్‌ సన్నద్ధమవుతున్నారు. పవన్‌కల్యాణ్‌ తన రాజకీయ ఆలోచనల గురించి ఈ నెల రెండో వారంలో స్వయంగా వెల్లడిస్తారని ఆ ప్రకటనలో తెలియజేశారు.

ఇదిలా ఉంటే ఆయన పార్టీ పేరు, ఏ పార్టీలో చేరుతారు... తదితర అంశాలపై జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పవన్ పార్టీ పేరు పవన్ రిపబ్లికన్ పార్టీగా ఉండే అవకాశాలున్నాయని కూడా ప్రచారం సాగుతోంది. పవన్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరుతారని, లోక్‌సత్తాలో చేరుతారని ఓసారి, కొత్త పార్టీ పెడతారని మరోసారి ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పవన్ కొత్త పార్టీ పేరు పవన్ రిపబ్లికన్ పార్టీ లేదా యువరాజ్యంగా ఉండవచ్చునని చెబుతున్నారు. ఈ పేర్లను పరిశీలిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. పవన్ రిపబ్లికన్ పార్టీ (పిఆర్పీ)... నాడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం (పిఆర్పీ)ను పోలి ఉంటుంది.

పవన్ కళ్యాణ్ రాజకీయ ఆరంగ్రేటం చేయబోతున్నారు అదీ...ఆమ్ ఆద్మీ పార్టీ తో కలిసి అని. ఆయన మల్కాజ్ గిరి(సికింద్రాబాద్) నియోజకవర్గం నుంచి ఎంపీ గా పోటీ చేయబోతున్నారు. తెలంగాణాని ఆయన తన స్వంత ప్రాంతంగా భావించి ఇలా పోటీ చేయాలనుకుంటున్నట్లు చెప్పుకుంటున్నారు. మరో ప్రక్క లోక్ సత్తాలో ఆయన చేరే అవకాసమున్నట్లు పవన్ ..లోక్ సత్తా పార్టీ కండువా భుజాన వేసుకున్నట్లు ఫేస్ బుక్ లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయమై అఫీషియల్ గా ఏ సమాచారమూ బయిటకు రాలేదు.

English summary
Thota Trimurthulu and Vanga Geeta have revealed that Pawan Kalyan has contacted them and discussed about the political atmosphere is the state today. They have not disclosed the extent or actual intent of the talk but have only revealed about the talk.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu