»   » పవన్ ఫ్యాన్స్ భయపడుతున్నారా?

పవన్ ఫ్యాన్స్ భయపడుతున్నారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవన్‌కల్యాణ్‌ హీరోగా బాబీ(కె.ఎస్‌. రవీంద్ర) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'. పవన్ కెరీల్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ చిత్రానికి సీక్వెల్ (కాదని నిర్మాతుల అంటున్నారు) గా రెడీ అవుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. అయితే రీసెంట్ గా జరుగుతున్న పరిణామాలతో పవన్ ఫ్యాన్స్ లో భయం పట్టుకుందని మీడియాలో వినిపిస్తోంది. ఈ విషయమై సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలోనూ చర్చలు జోరుగా జరుగుతున్నాయి. ఇంతకీ ఏమిటా భయం అంటే...

‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' ఎనౌన్స్ చేయగానే ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ స్వయంగా కథ అందిస్తున్నారు అన్నారు. మొదట సంపత్ నంది తర్వాత సీన్ లోకి వచ్చిన బాబి ఇద్దరూ కూడా ఆ కథని విస్తరణ మాత్రమే చేసి డైలాగులు రాసుకుని తెరకు ఎక్కిస్తున్నారన్నారు. అయితే ఇప్పుడు పరిశ్రమలో వినపడుతున్న గుసగుసలను బట్టి..పవన్ కళ్యాణ్ ..ఈ చిత్రం విషయంలో పవన్ కళ్యాణ్ ప్రతీదాంట్లోనూ పూర్తి స్ధాయిలో ఇన్వాల్వ్ అవుతున్నారని. ఆయనే కథ,స్క్రీన్ ప్లే, దాదాపు డైలాగులు కూడా రాసేస్తున్నారని చెప్పుకుంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కు ఆ మల్టి టాలెంట్ ఉందన్న విషయం తెలిసిందే.


Pawan Fan's fear to Sardaar Gabbar Singh

ఇక గతంలో పవన్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన జాని విషయంలోనూ ఆయన 24 క్రాప్ట్ లు దగ్గరుండి చూసుకుని మరీ తెరకెక్కించారు. అయితే అప్పుడు దర్సకుడుగా ఆయన అలా చేసారు. కాకపోతే అవేమి ప్రేక్షకులకు ఎక్కక డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు కూడా బాబీ వంటి టాలెంట్ ఉన్న దర్శకుడుని ఎంచుకుని మరీ ఇలా ఇంటర్ ఫియిర్ అయితే రిజల్ట్ ఎలా ఉండబోతోంది అంటున్నారు. దానికి తగినట్లు ..రీసెంట్ గా విడుదలైన సంక్రాంతి టీజర్, పోస్టర్ ఈ సినిమా క్రేజ్ కు తగ్గ స్ధాయిలో లేదని వినిపించింది. దాంతో అలా గతంలో జరిగినట్లు కాకుండా గబ్బర్ సింగ్ ని దాటే హిట్ కొట్టాలని కోరుకుంటున్నారు.


ఇక సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను దర్శకుడు బాబీ సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేశారు. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. పవన్‌ కల్యాణ్‌ సరసన కాజల్‌ నటిస్తోంది.ఈ చిత్రంలో గబ్బర్ సింగ్ చిత్రంలో సూపర్ హిట్టైన గబ్బర్ సింగ్ టైటిల్ సాంగ్ ని రీమిక్స్ చేసి కలపనున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఈ పాట పాడనున్నారు. దేవిశ్రీప్రసాద్ ఈ మేరకు ఓ ట్రాక్ ని రెడీ చేసి పవన్ కి వినిపించి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నట్లు చెప్తున్నారు. ఆయన త్వరలో ఈ పాటను రికార్డ్ చేస్తారు.


ప్రస్తుతం రూ.5 కోట్ల వ్యయంతో హైదరాబాద్‌లో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్‌లో పవన్‌కల్యాణ్‌, అలీ, బ్రహ్మాజీ, రఘుబాబు, నర్రా శ్రీను తదితర నటులపై కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా కోసం ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకడలి నేతృత్వంలో వేసిన ఈ సెట్ ఒక ఏరియాలా ఉంటుందని టాక్.


20 రోజులపాటు ఇక్కడ కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. తెలుగు సినిమా చరిత్రలో భాగా ఖర్చు పెట్టిన సెట్లలో ఇదీ ఒకటిగా పేర్కొంటున్నారు.
వేసవికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

English summary
Grapevine is that Pawan Kalyan has involved in every aspect of the making of 'Sardaar Gabbar Singh'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu