పవన్ కల్యాణ్ 'అజ్ఞాతవాసి' రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నా.. ఇంతరవరకు సినిమా ట్రైలర్ రిలీజ్‌పై క్లారిటీ లేదు. డిసెంబర్ 25న ట్రైలర్ రిలీజ్ ఉంటుందని తొలుత ప్రకటించినప్పటికీ.. అదేమి జరగలేదు. దీంతో పవన్ అభిమానులు ట్రైలర్ ఎప్పుడొస్తుందా? అన్న ఊగిసలాటలో ఉన్నారు. ట్రైలర్ రిలీజ్‌కు సంబంధించి తాజాగా మరో ఊహాగానం తెర పైకి వచ్చింది.
అజ్ఞాతవాసిలో మరో అజ్ఞాతవాసి.. ఊహించని గెటప్‌లో టాప్ హీరో !
తాజా ఊహాగానాల ప్రకారం జనవరి 4 లేదా 5న అజ్ఞాతవాసి ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. న్యూ ఇయర్ సందర్భంగా విడుదల చేయాలని భావించినప్పటికీ.. అదే రోజు బన్నీ సినిమా 'నా పేరు సూర్య' టీజర్ వస్తుండటంతో అజ్ఞాతవాసి ట్రైలర్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
పాటతోనే సరిపెట్టుకోవాల్సి..:
ట్రైలర్ రిలీజ్ వాయిదా పడటంతో పవన్ అభిమానులు ఇక ఆయన పాటతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే పాటపై ఉన్న అంచనాల రీత్యా.. ట్రైలర్ వాయిదా పడ్డ లోటును అది తీరుస్తుందని భావిస్తున్నారు.
దీంతో డిసెంబర్ 31వ తేదీ రాత్రి 'కొడుకా.. కోటేశ్వరరావు..' పాట పవన్ అభిమానులను ఊపేయడం ఖాయంగానే కనిపిస్తోంది.
29న సెన్సార్ ముందుకు?:
డిసెంబర్ 29న అజ్ఞాతవాసి సెన్సార్ బోర్డు ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా సెన్సార్ పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం సినిమా ఫస్ట్ కాపీ సిద్దం చేసి.. క్యూబ్ వారిక అప్ లోడ్ చేసే పనిలో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఆ రిపోర్టును బట్టి!:
సెన్సార్ రిపోర్టును బట్టి అజ్ఞాతవాసిపై మరిన్ని అంచనాలు ఏర్పడే అవకాశముంది. సెన్సార్ రిపోర్ట్ పాజిటివ్ గా వస్తే పవన్ సినిమా మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటడం ఖాయం. త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో.. ఆయన డైలాగ్స్ పై అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఆ డైలాగ్స్ తెరపై చూడాలంటే జనవరి 10వరకు ఆగాల్సిందే.
Agnyaathavaasi team planning to release the theatrical trailer either on the 4th or 5th of January 2018. Apparently, the censor report of Agnyaathavaasi would be out on the 29th of December 2017.
Story first published: Tuesday, December 26, 2017, 16:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more