twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కళ్యాణ్ దర్శకుడుగా అవతారం ఎత్తనున్నారా?

    By Srikanya
    |

    గతంలో 'జానీ' చిత్రంతో దర్శకుడుగా మారిన పవన్ కళ్యాణ్ ఆ సినిమా ఫెయిల్యూర్ తో ఆ తరువాత డైరక్షన్ జోలికి పోలేదు. అయితే ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వంలో రూపొందుతున్న జీసస్ క్రైస్ట్ చిత్రంలో పవన్ కళ్యాణ్ దర్శకుడుగా కనిపించనున్నారని తెలుస్తోంది. ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడేదాని ప్రకారం ఈ కథలో పవన్ కళ్యాణ్..పిల్లలను పెట్టి జీసస్ క్రైస్ట్ పై సినిమా చేయటానికి వెళ్ళతారని, సినిమా తీసే క్రమంలో ఆయన జీసస్ గురించి, ఆయన త్యాగం, కరుణ వంటి వాటి గురించి తెలుసుకుని ఆయన ఫాలోవర్ గా మారతారని తెలుస్తోంది. ఆ డైరక్టర్ పాత్రలో పవన్ కనిపిస్తారని చెప్తున్నారు. అయితే పవన్ ఈ చిత్రంలో జీసస్ క్రైస్ట్ పాత్రను పోషించినట్లు ఇంతకు ముందు వినిపించిన సంగతి తెలిసిందే.

    జీసస్‌ క్రైస్ట్‌ జీవితం ఆధారంగా ఇంగ్లిష్‌, హిందీ, తెలుగు, మలయాళ భాషల్లో రామదాసు చిత్ర నిర్మాత కొండా కృష్ణంరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఆయన పవన్ పాత్ర గురించి చెబుతూ..చారిత్రక పురుషుల గాధల్ని ఎవరూ ఇంగ్లిష్‌లో బాలల చిత్రాలుగా తీయలేదు. తొలిసారి మేము ఆ ప్రయోగం చేస్తున్నాం. 12 నుంచి 14 సంవత్సరాల మధ్య వయసున్న బాలలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఈ కథలో అత్యంత కీలకమైన పాత్రల్ని ఇంగ్లిష్‌, హిందీ, తెలుగు, మలయాళ భాషల్లోని అగ్రస్థాయి హీరో, హీరోయిన్స్ పోషిస్తారు. తెలుగులో ప్రముఖ హీరో పవన్‌కళ్యాణ్‌ ఈ చిత్రంలో అతి ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. పవన్‌ పాత్ర ఏమిటన్నది సినిమా విడుదల వరకు సస్పెన్స్‌గానే వుంటుంది అన్నారు. ఈ చిత్రానికి రచన: జె.కె.భారవి, కెమెరా: శేఖర్‌ వి.జోసెఫ్‌, ఆర్ట్‌: రవీందర్‌, మేకప్‌: క్రిస్టియానా టిన్స్‌ లే, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: శేషు

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X