twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కళ్యాణ్ మ్యాటర్.. ఇది నిజమా..రూమరా??

    By Srikanya
    |

    హైదరాబాద్ : స్వతహాగా మార్షిల్ ఆర్ట్స్ లో ప్రవేశం ఉన్న పవన్ కళ్యాణ్...తన చిత్రాల్లో గతంలో ఫైట్స్ ని తనే కంపోజ్ చేసుకునే వారు. ముఖ్యంగా ఖుషీ చిత్రంలో ఆయన ఫైట్స్ ఆయనే డిఫెరెంట్ గా కంపోజ్ చేసుకుని హిట్ చేసుకున్నారు. తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలోనూ అదే ఫీట్ రిపీట్ చేయబోతున్నారని తెలుస్తోంది. అయితే ఇది నిజమా....లేక క్రియేట్ చేసిన రూమరా అనేది తేలాలి.

    ఈ చిత్రంలో ఇంట్రడక్షన్ ఫైట్ ని పవన్ స్వయంగా కంపోజ్ చేసుకుని షూటింగ్ చేస్తున్నారని ఫిల్మ్ నగర్ సమాచారం. స్పెయిన్ లో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. అక్కడ హీరో ఇంట్రడక్షన్ సీన్ ని భారిగా ప్లాన్ చేసి తీస్తున్నారు. మొదట ఆ ఫైట్ ని త్రివిక్రమ్ ప్లాన్ చెయ్యకపోయినా..పవన్ ఐడియాతో దాన్ని కలిపారని, ఫన్ తో ఆ ఫైట్ ఉంటుందని, ఖచ్చితంగా ఫ్యాన్స్ ని అలరిస్తుందని చెప్తున్నారు.

    ఈ సీన్ ..స్పెయిన్ లో షూట్ చేసారు. హీరో హెలికాప్టర్ మీద నుంచి లాండ్ అయ్యి...అక్కడ గూండాలతో స్టైలిష్ ఫైట్ తో ముగుస్తుందని తెలిసింది. ఈ సీన్ కోసం అంత ఖర్చు పెట్టారని చెప్తున్నారు.

    స్పెయిన్, జర్మనీ, ఆస్ట్రియా, ఇతర యూరోపియన్ కంట్రీలలో షూటింగ్ జరుపనున్నారు. రొటీన్ లొకేషన్లు కాకుండా సరికొత్త లొకోషన్లపై దృష్టి సారించారు. ఇక్కడ కొన్ని సీన్లను చాలా స్టైలిష్‌గా, గ్రాండ్‌గా పిక్చరైజ్ చేసేందుకు దర్శకుడు త్రివిక్రమ్ ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

    ఈ షెడ్యూల్ లో మొత్తం 3 పాటలు చిత్రీకరించనున్నారు. అందులో ఒకటి పవన్ సోలో సాంగ్ కాగా...హీరోయిన్లు సమంత, ప్రణీతలతో కలిసి డ్యూయెట్ సాంగ్ చిత్రీకరించనున్నారు. అదే విధంగా టాకీ పార్టుకు సంబంధించిన కొన్ని యాక్షన్ సన్నివేశాలు కూడా ఇక్కడ షూట్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

    ఆగస్టు 7వ తేదీన సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. మొత్తం 40 మంది ప్రముఖ తారాగణం మిగతా పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఆర్ట్ : రవీందర్, కో-ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

    English summary
    Pawan Kalyan has composed the introduction fight in Attarintiki Daredi Telugu movie. Looks like Pawan Kalyan is back to very best in terms of handling action sequences and romantic scenes and Pawan has rediscovered his form with Attarintiki Daredi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X