»   » పవన్ ని ఒప్పించే ప్రయత్నం... ఏమౌతుందో?

పవన్ ని ఒప్పించే ప్రయత్నం... ఏమౌతుందో?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'సర్దార్ గబ్బర్ సింగ్' ఏప్రియల్ 8 భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. తెలుగు వెర్షన్ తో పాటు హిందీ వెర్షన్ కూడా ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు. పవన్ కెరీర్ లో తొలిసారిగా ఇలా రెండు భాషల్లో ఒకే సారి విడుదల అవుతున్న ఈ చిత్రానికి ప్రమోషన్ విషయమై ఎలా చేయాలనే చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.

ముఖ్యంగా హిందీ ఆడియన్స్ కోసం పవన్ ప్రమోషన్స్ వస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఆయన కేవలం మీడియాకు ఇంటర్వూలు ఇవ్వటంతోనే సరిపెడతారా లేక స్వయంగా వచ్చి హిందీ ఆడియన్స్ కోసం ప్రమోట్ చేస్తారా అనేది తెలటం లేదు. ఈ విషయమై నిర్మాతలు ...ఆయన్ని ఒప్పించటానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.


 Pawan Kalyan attend Hindi promotional event?

అక్కడ చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఒక్క ఈవెంట్ కు అయినా రమ్మనమని అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఈరోస్ వారు ఈ విషయమై పవన్ తో దఫదఫాలుగా చర్చలు జరిపారని చెప్తున్నారు. నార్త్ సిటీల్లో ఈ చిత్రానికి సంభందించి భారీగా ప్రమోషన్ మొదలెట్టారు నిర్మాతలు.


ఇప్పటివరకూ అందిన సమచారం ప్రకారం పవన్ ఇప్పవరకూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదంటున్నారు. ఆయన గతంలో ఎప్పుడూ కూడా ఇలా ప్రమోషన్ చేయలేదని, కంటెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆడుతుందని, లేనప్పుడు ఎంత ప్రమోట్ చేసినా ఫలితం ఉండదని వారితో చెప్తున్నట్లు చెప్పుకుంటున్నారు.


 Pawan Kalyan attend Hindi promotional event?

అయితే పవన్ ఇక్కడ ప్రేక్షకులకు తెలుసు..నార్త్ ఇండియన్ ప్రేక్షకులకు ఎంత శాతం వరకూ తెలుసు అనేది క్వచ్చిన్ ఉంటుంది కాబట్టి, ప్రమోషన్ కు వస్తే ఓపినింగ్స్ బాగుంటాయని ఈరోస్ వారు వాదిస్తున్నారట. ఏం జరగనుందో చూడాలి.

English summary
‘Sardaar Gabbar Singh’ Hindi producers are trying to convince Pawan Kalyan to attend at least one event in North India.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu