For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పవన్,బాలయ్యని ఇద్దరినీ భలే కలిపేసారే

  By Srikanya
  |

  హైదరాబాద్ : కొన్ని కాంబినేషన్లు వింటానికి కూడా ఆశ్చర్యంగా ఉంటాయి. అందులో ఒకటి..బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ కలిసి నటించటం అనేది. ఇద్దరికీ ఒకరిమీద ఒకరికి ఎంత అభిమానం ఉన్నా అది జరిగే పని కాదనిపిస్తుంది. అయితే తాజాగా ఓ రూమర్ మాత్రం వీరిద్దరిని కలిసి ఓ సినిమా ప్లాన్ చేసేస్తోంది. బాలకృష్ణ వందో చిత్రంలో వీరిద్దరూ కలిసి నటిస్తారని అంటున్నారు. పివిపి వారు దాన్ని ప్రొడ్యూస్ చేస్తారని అంటున్నారు. బోయపాటి శ్రీను డైరక్టర్ చేయనున్నారని, ఈ మేరకు వీరిద్దరు పాత్రలు కోసం స్క్రిప్టు రెడీ చేయిస్తున్నారని చెప్పుకుంటున్నారు. పీవిపి వారి మీద అభిమానంతో పవన్ ఈ చిత్రం చేస్తాండున్నారు. లాజిక్ కరెక్టుగానే అనిపిస్తున్నా...వీరిద్దరి కాంబినేషన్ మాత్రం కేవలం కలల దాకానే సాధ్యం అంటున్నారు తెలుగు సినీ జనం.

  ఇక బాలయ్య 100 వ చిత్రం విషయానికి వస్తే...

  లెజండ్ హిట్ తో ఉత్సాహంగా ఉన్న బాలకృష్ణ తన వందో చిత్రానికి సంభందించిన దర్శక,నిర్మాతలను ఖరారు చేసాడని వినికిడి. సింహా తర్వాత వరస ఫ్లాపులతో ఉన్న బాలయ్య ..వందో చిత్రం పై డైలమాలో ఉన్నారు. అయితే లెజండ్ హిట్ తో బోయపాటి శ్రీను కే వందో చిత్రం దర్శకత్వం అప్పచెప్పాలని నిర్ణయించుకున్నాడని సమాచారం. అలాగే నిర్మాతగా 14 రీల్స్ వారికే ఆ భారీ ప్రాజెక్టుని అప్పగించాలని ఆయన వారితో మాట్లాడారని తెలుస్తోంది. ఈ కాంబినేషన్ తో ఖచ్చితంగా ఎక్సపెక్టేషన్స్ పెరుగుతాయని భావిస్తున్నారు. ఈలోగా బాలకృష్ణ మరో రెండు చిత్రాలు పూర్తి చేస్తారు.

  పలువురు దర్శకులు బాలయ్యతో సినిమాలు రూపొందించినప్పటికీ బాలకృష్ణ అభిమానులు ఆశించినంత హిట్ ను ఇవ్వలేక పోయారు. వైవియస్ చౌదరి లాంటి నందమూరి కుటుంబ అభిమానులు తీసిన సినిమాలు కూడా బాలయ్య అభిమానులను రంజింప చేయలేక పోయాయి. అయితే కొంత కాలం విజయాలకు దూరంగా ఉన్న సమయంలో బోయపాటి "సింహా' సినిమాతో బాలయ్య అభిమానులకు పలావు పెట్టాడు. అంతటితో ఆగకుండా "లెజెండ్'' చిత్రంతో విందుభోజనం పెట్టాడు.

  దాంతో బాలయ్య అభిమానులు బోయపాటిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. గతంలో బాలయ్యతో బ్లాక్ బస్లర్స్ తీసిన దర్శకులు కోడి, బి.గోపాల్ ల తరహాలోనే బోయపాటి కూడా బాలయ్య సినిమా కెరియర్ లో రికార్డులు సృష్టించిన దర్శకుడిగా మిగిలి పోవడం ఖాయమని బాలయ్య అభిమానులు చెప్పుకుంటున్నారు.

  Pawan Kalyan In Balyya's 100th Movie

  తాజా చిత్రం విషయానికి వస్తే...

  ధర్మం ఎప్పుడూ ఒంటరికాదు. దానిని కాపాడ్డానికి ఎవరో ఒకరు శ్రమిస్తూనే ఉంటారు. ధర్మాన్ని నిలబెట్టి, న్యాయాన్ని రక్షించి, అవినీతిపై యుద్ధం చేసిన పౌరుడి కథే మా సినిమా అంటున్నారు సత్యదేవా. ఆయన దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. నందమూరి బాలకృష్ణ కథానాయకుడు. త్రిష, రాధికా ఆప్టే కథానాయికలు.

  రుద్రపాటి రమణారావు నిర్మాత. అరకులో చిత్రీకరణ జరుగుతోంది. రామ్‌ లక్ష్మణ్‌ నేతృత్వంలో పోరాట సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. మరో వారం రోజుల పాటు అరకులోనే చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.

  ''లెజెండ్‌'తో బాలకృష్ణ ఇమేజ్‌ మరింత పెరిగింది. ఈ సినిమాలో ఆయన పాత్ర అందుకు ఏమాత్రం తగ్గదు. మణిశర్మ స్వరపరిచిన గీతాలు అందరినీ అలరిస్తాయ''న్నారు. ఈ చిత్రం కోసం 'వారియర్‌', 'లయన్‌' అనే పేర్లు పరిశీలనలో ఉన్నాయి.

  ఇక బాలకృష్ణ 99 వ చిత్రం విషయానికి వస్తే...

  నందమూరి బాలకృష్ణ తదుపరి చిత్రం(99 వ) నికి రంగం సిద్దమవుతున్నాడు. ఆ చిత్రానికి దర్శకుడుని ఎంపిక అయ్యారని ఫిల్మ్ నగర్ సమాచారం. ఆ దర్శకుడు మరెవరో కాదు లౌక్యంతో హిట్ కొట్టిన శ్రీవాసు అని తెలుస్తోంది. ఆ మధ్యన బాలకృష్ణ కోసం కోన వెంకట్, గోపీ మోహన్ ఓ కథ చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడదే కథని డైరక్ట్ చేయబోతున్నట్లు చెప్పుకుంటున్నారు. బాలకృష్ణతో చేస్తూండటంతో అతను పెద్ద డైరక్టర్ల లీగ్ లోకి వెళ్లినట్లే.

  రీసెంట్ గా బాలకృష్ణ తన కుటుంబంతో కలిసి లౌక్యం చిత్రాన్ని స్పెషల్ షో చూడటం జరిగింది. ఇంప్రెస్ అయిన బాలకృష్ణ ఓ వినోదాత్మకమైన చిత్రం చేయటానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే తన అభిమానులను నిరాశపరచకుండా యాక్షన్ సన్నివేశాలకు కూడా సరైన స్దానం స్క్రిప్టులు ఇవ్వమని కోరినట్లు సమాచారం. ఈ మేరకు స్క్రిప్టులో మార్పులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆ స్క్రిప్టు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.

  మరో ప్రక్క అందరూ రామ్ చరణ్ తో శ్రీవాస్ ముందుకు వెళ్తారని భావించారు. అయితే ఈ లోగా బాలకృష్ణ ఈ ఆఫర్ ఇవ్వటంతో ఇటు జంప్ అయినట్లు చెప్పుకుంటున్నారు. పాండవులు పాండవులు తుమ్మెద,లౌక్యం విజయాలతో మినిమం గ్యారెంటీ దర్శకుడుగా అతను టాలీవుడ్ లో సెటిల్ అయినట్లే. బాలకృష్ణతో కూడా అదే మాదిరిగా హిట్ కొడితే అతనికి తిరుగు ఉండదని సినీ వర్గాలు అంటున్నాయి.

  English summary
  Balakrishna is already planning for his milestone 100th film. Inside talk is Pawan Kalyan will play important role in Balakrishna's film.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X