»   » పవన్ కళ్యాణ్‌ కోసం...దాసరి తంత్రం, త్రివిక్రమ్ మంత్రం!

పవన్ కళ్యాణ్‌ కోసం...దాసరి తంత్రం, త్రివిక్రమ్ మంత్రం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... ఆల్రెడీ అభిమానులు ఆయన్ను తమ గుండెల్లో ఎవరికీ అందనంత ఎత్తులో కూర్చో బెట్టారు. అయితే జనాలకు ఏదో చేయాలని ఉవ్విల్లూరుతున్న పవన్ కళ్యాణ్ ఇక్కడే ఉంటే ఎలా? అందుకే ఆయన రాజకీయాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. జనసేన పార్టీని కూడా స్థాపించారు. పార్టీని అయితే స్థాపించారు కానీ...ఈ పార్టీ కేవలం అభిమానుల వరకు మాత్రమే వెళ్లింది కానీ ప్రజల్లోకి వెళ్లలేదు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. 2019 ఎన్నికలు దగ్గర పడే సమయానికి వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేసి పార్టీని నడిపించడానికి నిధులు సమకూర్చుకోవాలనేది పవన్ కళ్యాణ్ ఆలోచన అని టాక్.

అయితే రాజకీయాల్లో రాణించాలంటే కేవలం డబ్బు, తనకున్న స్టార్ ఇమేజ్ సరిపోదు. అంతకంటే బలమైన ప్రజల మద్దతు కావాలి. ఈ వ్యవస్థను మార్చాలనుకుంటున్న మనసులోని ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సినిమా ఒక్కటే మార్గమని భావించిన పవన్ కళ్యాణ్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారట.

Pawan Kalyan, Dasari movie political strategy

ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం దాసరి నారాయణరావు నిర్మాణంలో పవన్ కళ్యాణ్ చేయబోయేది రాజకీయ సినిమా అనే అంటున్నారు. ఇప్పటి వరకు దాసరి తన సినీ, పొలిటికల్ అనుభవంతో రాజకీయ తంత్రాన్ని సిద్ధం చేసారని.... ఆయన సూచనల మేరకు మాటల మాంత్రికుడిగా పేరున్న త్రివిక్రమ్ ప్రజలను సమ్మోహితులను చేసేలా కథను, డైలాగులను సిద్ధం చేస్తున్నారని....ప్రజల్లోకి దూసుకెళ్లాలే ఉండేలా ఆయన పదునైన డైలాగులు ఈ సినిమా కోసం సిద్దం చేస్తున్నారని టాక్.

పవన్ కళ్యాణ్ రాజకీయంగా నిలదొక్కుకోవడానికి ఈ సినిమా ఉపయోగ పడేలా ఉంటుందని... 2017లో ఈ సినిమా ప్రారంభం అవుతుందని, ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ తన రాజకీయ పార్టీని బలోపేతం చేసే చర్యలు చేపడతారని, ఈ సినిమాలోని పాటలు, డైలాగులే తన పార్టీని బలోపేతం చేయడానికి వాడుకుంటారని....పార్టీని గ్రామ స్థాయి నుండి బలోపేతం చేయడానికి కనీసం సంవత్సరానికి పైగా సమయం పడుతుంది. 2018 ముగింపు వరకు ఆ పని పూర్తయినా...2019 ఎన్నికలకు సిద్ధంగా ఉండొచ్చని భావిస్తున్నారట.

English summary
Film Nagar source said that, Power star Pawan Kalyan movie under Dasari Narayana rao production with political strategy.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu