»   » పవన్-దాసరి ప్రాజెక్టు డిటేల్స్

పవన్-దాసరి ప్రాజెక్టు డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : దాసరి నారాయణ రావు నిర్మాతగా పవన్ కళ్యాణ్ హీరోగా ఓ చిత్రం రూపొందనుందంటూ ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. సిరి మీడియా పతాకంపై ఈ చిత్రం రూపొందుతుందని దాసరి గారు స్వయంగా స్పష్టం చేసారు. ఈ నేపధ్యంలో ఇంతకీ ఆ చిత్రం దర్శకుడు ఎవరు అనేది సస్పెన్స్ గా మారింది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఆ దర్శకుడు మరెవరో కాదు... గోపాల గోపాల చిత్రం డైరక్ట్ చేసిన కిషోర్ పార్దసారధి(డాలి) అని తెలుస్తోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ మేరకు డాలి స్క్రిప్టు వర్క్ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. సాయి మాధవ్ బుర్రా(గోపాల గోపాల మాటల రచయిత) ఈ స్క్రిప్టు వర్క్ లో పాల్గొని డైలాగులు రాస్తున్నారు. అయితే గబ్బర్ సింగ్ 2 కు ముందు ఇది పట్టాలు ఎక్కుతుందా లేదా ముందే పట్టాలు ఎక్కనుందా అనేది మాత్రం తెలియరాలేదు.

Pawan Kalyan-Dasari Project Details

ప్రముఖ దర్శకరత్న దాసరి నారాయణరావు, పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ కాంబినేషన్‌లో కొత్త సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. తారక ప్రభు ఫిలిమ్స్‌ పతాకంపై దాసరి నిర్మిస్తున్న 37వ సినిమాలో పవన్‌ నటించనున్నారు. ఇటీవల ఇద్దరూ కలిసిన సమయంలో తమ కాంబినేషన్‌లో సినిమా చేయాలని పవన్‌, దాసరి నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే దాసరి నిర్మించనున్న సినిమాలో పవన్‌ నటిస్తున్నట్లు ఒక ప్రకటన వెలువడింది.

పవన్‌ కల్యాణ్‌ హీరోగా తెరకెక్కబోయే కొత్త చిత్రానికి దాసరి నారాయణరావు నిర్మాతగా వ్యవహరించనున్నారు. తారకప్రభు ఫిలింస్‌ బ్యానర్‌పై దాసరి ఈ సినిమా తీస్తున్నట్లు అధికారికంగా ధ్రువీకరించారు. తారక ప్రభు ఫిలింస్‌ బ్యానర్‌పై 37వ చిత్రంగా పవన్‌కల్యాణ్‌ సినిమా రానుంది. అయితే దర్శకుడు ఎవరనేది ఇంకా నిర్ణయించలేదు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్ 2′ పనుల్లో బిజీగా ఉన్నారు. శరత్ మరార్ ఈ సినిమాకు నిర్మాత. ‘గబ్బర్ సింగ్ 2′ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఇటివలే ‘గోపాల గోపాల' దర్శకుడు డాలీ(కిషోర్) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తానని మాటిచ్చారు. దాసరి సినిమా ఎవరి దర్శకత్వంలో ఉంటుందో.. అని చర్చ నడుస్తోంది.

English summary
Pawan Kalyan has given his nod for a subject to be directed by Kishore Pardasani and this flick will be produced by Dasari. Sai Madhav Burra (Malli Malli Idi Rani Roju fame) is penning the dialogues.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu