»   » పవన్ హెల్ప్...అన్నయ్య కంటే రెండు ఎక్కువే?

పవన్ హెల్ప్...అన్నయ్య కంటే రెండు ఎక్కువే?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బెంగులూరు నుంచి హైదరాబాద్ వస్తున్న జబ్బర్ ట్రావెల్స్‌ అనే ప్రైవేటు సంస్థకు చెందిన బస్సు అక్టోబర్ 30న అగ్ని ప్రమాదానికి గురైన సంఘటనలో కర్నాటక మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కొట్టె వెంకటేష్ యాదవ్‌తో పాటు ఆయన సోదరి మృత్యువాత పడిన సంగతి తెలిసిందే.

ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఆయన కుటుంబానికి రూ. 5 లక్షల సహాయం అందించారు. మెగా బ్రదర్ నాగబాబు స్వయంగా వారి ఇంటికి చేరుకుని రూ. 5 లక్షల చెక్కు అందించారు. తాజాగా పవన్ కళ్యాణ్ కూడా వెంకటేష్ యాదవ్ కుటుంబానికి రూ. 7 లక్షల సాయం అందించినట్లు సమాచారం. ఇటీవల కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఓ అమ్మాయికి పవన్ కళ్యాణ్ రూ. 2 లక్షలు సహాయం అందించినట్లు వార్తలు వార్తలు వినిపించాయి.

కాగా...వెంకటేష్ యాదవ్ కుటుంబానికి సహాయం చేసిన పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి కంటే 2 లక్షలు ఎక్కువే అందించడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. దాన గుణంలో పవన్ అనయ్యను మించిపోతున్నారని చర్చించుకుంటున్నారు. దాన గుణంలోనే కాదు ఇతర మంచి గుణాల్లోనూ పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవిని మించిపోయారని కొందరు భిన్నవాదనలు చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ సినిమాల వివరాల్లోకి వెళ్లితే...ఆయన నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం పెద్ద విజయం సాధించి తెలుగు సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే రూ. 85 కోట్లకు పైగా వసూలు చేసిన ఈచిత్రం త్వరలోనే రూ. 100 కోట్ల మార్కును అందుకోబోతోంది.

ప్రస్తుతం పవన్ కళ్యాన్ 'గబ్బర్ సింగ్-2' చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నారు. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని పవన్ కళ్యాన్ స్నేహితుడు శరత్ మరార్ నిర్మిస్తున్నారు. డిసెంబర్ చివర్లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కాబోతోంది. 2012లో వచ్చిన 'గబ్బర్ సింగ్' చిత్రం విడుదలైన తేదీనే అంటే...మే 11, 2014న విడుదల చేసేందుకు ప్లాన్ చేసారు.

English summary
The buzz is that, Pawan Kalyan donated Rs 7 Lakhs to the Kannada MegaFans President Kotte Venkatesh Yadav Family.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu