»   » 'సేనాపతి' గా పవన్ ? : నమ్మితే ప్రాణమిస్తాడు..ఈ రచ్చ ఏంది?

'సేనాపతి' గా పవన్ ? : నమ్మితే ప్రాణమిస్తాడు..ఈ రచ్చ ఏంది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఫ్యాన్స్ కు తమ హీరో సినిమా ప్రారంభమైతే వెంటనే దానికి సంభందించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, ట్రైలర్ వంటివి చూడాలని కోరిక మొదలైపోతుంది. అయితే అందరూ వాటి రిలీజ్ కోసం వెయిట్ చేస్తే మరికొందరు ఉత్సాహవంతులు మాత్రం తామే ఓ టైటిల్ ఫిక్స్ చేసి, ట్యాగ్ లైన్ పెట్టి, పోస్టర్, ఇంకా సత్తా ఉంటే టీజర్ కూడా వదిలేస్తున్నాయి.

టెక్నాలిజీ పెరిగిపోయిన రోజుల్లో ఇది చాలా చాలా కామన్ ధింగ్ గా మారిపోయింది. అలాగే ఇప్పుడు పవన్ తాజా చిత్రానికి సైతం ఓ ఫస్ట్ లుక్ పోస్టర్ అంటా వదిలేసారు ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్-ఎస్ జె సూర్య కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమా మొదలై ఎన్నో రోజులు కాలేదు. ఇంకా చెప్పాలంటే షూటింగ్ కూడా మొదలు కాలేదు. అయితే ఈ చిత్రానికి టైటిల్ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ రేంజిలో సందడి మొదలైంది.

ఫుల్ వైట్ అండ్ వైట్ లో, బర్నింగ్ బ్రాక్ ట్రాప్ లో నిలబడి ఉన్న పవన్ ముందు 'సేనాపతి' అనే టైటిల్ ఉంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. నమ్మింతే ప్రాణాలిస్తాడు అనే ట్యాగ్ లైన్. అయితే, ఫస్ట్ లుక్ పై అధికారిక ప్రకటన ఏమీ వెలువడలేదు.

Pawan Kalyan Fan Made Senapathi Poster

మరో ప్రక్క ఈ కథ తమిళంలో వచ్చి హిట్టైన అజిత్ చిత్రం వీరం కు అనఫీషియల్ రీమేక్ అనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే వీరం సినిమాను ఆల్రెడీ డబ్ చేసి వీరుడొక్కడే పేరుతో విడుదల చేసారు. దాంతో మళ్లీ ఇక్కడ అదే సినిమాను అధికారికంగా అయినా అనధికారికంగా అయినా ఎందుకు రీమేక్ చేస్తారనేదే ప్రశ్న.

నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ సమర్పిస్తున్న ఈ సినిమాను గబ్బర్ సింగ్ నిర్మాత శరత్ మరార్ నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం. ఆకుల శివ డైలాగ్స్. ప్లాప్ బస్టర్ గా నిలిచిన 'సర్దార్ గబ్బర్ సింగ్' నష్టాలను పూరించేందుకు తన నెక్ట్స్ సినిమా శరత్ మరార్ కే ఇచ్చాడు పవన్ కళ్యాణ్. ఈ సినిమాతో డిస్టిబ్యూటర్లకు.. ఆడియన్స్ కు న్యాయం చేయాలన్నది పవన్ ప్లాన్ గా చెప్పుకుంటున్నారు. సర్దార్ గబ్బర్ సింగ్ బయ్యర్లకు చెల్లించాల్సిన మొత్తాన్ని కూడా దీనిద్వారా చెల్లిస్తారన్న ఆలోచన కూడా ఉందట.

English summary
What you see above is a Fan made fake poster mentioning the movie title as ‘Senapathi’ Below is the tagline of ‘Nammithe Pranam Isthadu’ elucidating Pawan’s off screen character.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu