»   » ఆ రోజే...పవన్ , చిరంజీవి ఒకే స్టేజీపై ...ఇది మెగా కానుక

ఆ రోజే...పవన్ , చిరంజీవి ఒకే స్టేజీపై ...ఇది మెగా కానుక

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఆ మధ్యన మెగా బ్రదర్శ్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల మధ్య విభేధాలు వచ్చాయంటూ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. తర్వాత రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ తో సహా అందరూ తమలో తమకు విభేధాలు లేవని తేల్చి మీడియా వద్ద చెప్పుకొచ్చారు. అదే విషయం ప్రూవ్ చేయటానికి అన్నట్లు బ్రూస్ లీ రిలీజ్ టైమ్ లో రామ్ చరణ్, పవన్ కలిసారు, ఆ తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ కు ముందు జరిగిన ఓ మీట్ లో పవన్, చిరంజీవి కలిసారు. దాంతో అందరూ వీళ్లద్దరి మధ్యా విభేదాలు లేవని నమ్మారు.

అయితే ఇద్దరు అన్నదమ్ములూ ఏ మెగా ఈవెంట్ లోనూ ఒకే స్టేజీపై కనపడటం మాత్రం జరగటం లేదు. ఈ సారి మాత్రం మెగాబిమానులకు ఆ అవకాసం కలగనున్నట్లు సమాచారం. చిరంజీవి 150 వ చిత్రం ఖైదీ నెంబర్ 150 కు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ ని స్వయంగా చిరంజీవి ఆహ్వానించారని సమాచారం. విజయవాడలో జనవరి 4న జరిగే ఈ ఈవెంట్ ని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. పవన్ వస్తారా రాదా అనేది మాత్రం ఇంకా అఫిషియల్ గా కన్ఫర్మ్ కాలేదు. కానీ వస్తే మాత్రం మెగాస్టార్ ని, పవన్ స్టార్ ని ఒకే స్టేజిపై చూడటం మెగా ఫ్యాన్స్ కు ఆనందం కలిగిస్తుందని చెప్తున్నారు.

Pawan Kalyan gets invite from Chiranjeevi

మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా వి.వి. వినాయక్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఖైదీ నంబర్‌ 150'. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. సినిమాకు సంబంధించిన పాటలు ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలై సాంగులకు యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. తాజాగా 'రత్తాలు రత్తాలు.. ఓసోసీ రత్తాలు' అనే సాంగ్ రిలీజ్ చేసారు. సినిమాలో ఇది స్పెషల్ సాంగ్. ఇందులో సౌత్ హాట్ అండ్ సెక్సీ బ్యూటీ రాయ్ లక్ష్మి చిరుతో కలిసి చిందేసింది.

నిర్మాత‌, మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ మాట్లాడుతూ-మెగాస్టార్ కెరీర్‌లోనే వెరీ స్పెష‌ల్ మూవీ ఇది. ఓ చ‌క్క‌ని క‌థాంశంతో, విజువ‌ల్ గ్రాండియారిటీతో ద‌ర్శ‌కుడు వి.వి.వినాయ‌క్ గారు అద్భుతంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. యూత్‌ స‌హా కుటుంబ స‌మేతంగా అంతా క‌లిసి చూడ‌ద‌గ్గ చిత్రంగా మ‌లిచారు. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రిలో సినిమా రిలీజ్ చేస్తున్నాం అని తెలిపారు.

English summary
Mega camp is trying to bring pawan and chiranjeevi together for the upcoming pre release event of Chiranjeevi’s comeback film Khaidi No 150, which is to be held in Vijayawada on January 4th.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X