»   »  ఇక ఇప్పుడు కాటమరాయుడట... పవన్ కొత్త సినిమా ఇంకా సంధిగ్దం లోనే

ఇక ఇప్పుడు కాటమరాయుడట... పవన్ కొత్త సినిమా ఇంకా సంధిగ్దం లోనే

Posted By:
Subscribe to Filmibeat Telugu

సర్థార్ గబ్బర్ సింగ్ సినిమాతో తన అభిమానులని తీవ్రంగా నిరాశపరిచిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో ఓ మాస్ యాక్షన్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడన్న సంగతి మనకు తెలిసిందే. ముందుగా ఈ సినిమాను తమిళ దర్శకుడు ఎస్ జె సూర్య దర్శకత్వంలో తెరకెక్కించాలని భావించినా. మధ్యలోనే నటనలో అవకాశాలు వస్తూండటం తో సూర్య పవన్ కి హ్యాడిచ్చి ఈ సినిమానుంచి తప్పుకున్నాడు.

సూర్య నటుడిగా బిజీ కావటంతో డాలీని దర్శకుడిగా తీసుకున్నారు. డాలీ వచ్చీరాగానే కథలో కొన్ని మార్పులు చేయించడట. కడప కింగ్ అనే టైటిల్ నీ సెలక్ట్ చేసినట్టు వార్తలొచ్చాయి... అయితే ఇంకా ఈ సినిమా మీద సధిగ్దం వీడలేదు. అటు పవణ్ ఏమో సభలూ, రాజకీయాలూ అంటూ బిజీ బిజీగా ఉన్నాడు. ఇటు కథ మీద పూర్తి క్లారిటీ రాలేదనీ ఇంకా కొన్ని మార్పులు చేయాల్సి ఉందీ అంటూ వార్త్లొస్తున్నాయి. డాలీ ఇంకొన్ని మార్పులని తనే స్వయంగ చేయిస్తున్నాడట. ఇప్పుడేమో ఈ సినిమా టైటిల్ "కడప కింగ్" కాదూ "కాటమరాయుడు" అంటూ ఇంకోవార్త... అసలు ఏం జరుగుతోందీ? సినిమా ఎప్పుడు మొదలవుతుందీ అనే విషయాలపై చిన్న కథనం...

డిజాస్టర్ తర్వాత

డిజాస్టర్ తర్వాత

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో ఓ మాస్ యాక్షన్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడన్న సంగతి మనకు తెలిసిందే. సర్దార్ లాంటి డిజాస్టర్ తర్వాత ఒక మంచి హిట్ కొట్టాలనే తపన తో ఉన్నాడు పవన్.

త్వరలోనే సెట్స్ మీదకు

త్వరలోనే సెట్స్ మీదకు

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.
త్వరలోనే సెట్స్ మీదకు: ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.

వీరంకు రీమేక్?

వీరంకు రీమేక్?

పవన్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా తమిళ సూపర్ హిట్ వీరంకు రీమేక్ గా రూపొందనుందన్న టాక్ వినిపిస్తుంది.

నేటివిటికీ తగ్గట్టు మార్పులు

నేటివిటికీ తగ్గట్టు మార్పులు

అయితే కేవలం మూల కథను తీసుకొని పవన్ ఇమేజ్ కు, తెలుగు నేటివిటికీ తగ్గట్టు మార్పులు చేశారట.

టైటిలో మార్పు

టైటిలో మార్పు

ఇన్నాళ్లు ఈ సినిమాకు కడప కింగ్ అనే టైటిల్ ను పరిశీలించిన చిత్రయూనిట్. తాజాగా కాటమరాయుడు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట.

పాట నుంచి

పాట నుంచి

పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమా అత్తారింటికి దారేదిలో పవన్ స్వయంగా పాటిన కాటమ రాయుడా పాట నుంచి తీసుకున్న ఈ టైటిల్ ఆడియన్స్ కు త్వరగా చేరువయ్యే ఛాన్స్ ఉందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. త్వరలోనే ఈసినిమాకు సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రానుంది.

చంద్ర సిద్ధార్థ్

చంద్ర సిద్ధార్థ్

అయితే ఇక్కడొక చిక్కు ఉంది గతంలో 'ఆ నలుగురు' వంటి ఉత్తమ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు చంద్ర సిద్ధార్థ్ "కాటమరాయుడు" అనే టైటిల్ తో సినిమా చేయబోతున్నట్టు వార్తలు వచ్చాయి. కమేడియన్ సప్తగిరి హీరో అని కూడా అన్నారు. మరి ఇప్పుడు ఆ సినిమా ఆగిపోయిందా? లేక ఆ టైటిల్ ని తీసుకుంటారా అన్నది తెలియాల్సి ఉంది.

ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్

ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్

గబ్బర్ సింగ్ తర్వాత పవన్, శృతిహాసన్ చేస్తున్న ఈ సినిమా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సాగే ప్రేమకథా చిత్రం అని సమాచారం.

అంతా గందరగోళం

అంతా గందరగోళం

ఇన్ని కాంట్రవర్సీలతో వచ్చే ఈ సినిమా ఎప్పటికి పూర్తవుతుందో... 2019 లోపు పవర్స్టార్ ఎన్ని సినిమాల్లో నటిస్తాడో అంతా గందరగోళం గా ఉంది అనుకుంటున్నారు అభిమానులు కూడా....

English summary
Latest buzz has that the film is likely to be named as "Katama Rayudu" as that will sync well with fans and sounds like a super heroic title.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu