»   »  త్రివిక్రమ్ తో కలిసే పవన్ కళ్యాణ్ నిర్మాణం

త్రివిక్రమ్ తో కలిసే పవన్ కళ్యాణ్ నిర్మాణం

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  హైదరాబాద్: పవన్ కళ్యాణ్ కి త్రివిక్రమ్ కి మంచి స్నేహం ఉన్న సంగతి తెలిసిందే. దాంతో వీరిద్దరూ కలిసి ఓ క్రియేటివ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు సమాచారం. సొంతంగా నిర్మాణ సంస్ధను పెట్టి... చిన్న,మీడియం బడ్జెట్ సినిమాలు తీయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలు ద్వారా అవకాశాలు రాక తిరుగుతున్న ఎంతో మంది కొత్త ట్యాలెంట్ ని ఎంకరేజ్ చేయాలని నిర్ణయంచుకున్నట్లు తెలుస్తోంది.

  మొదట పవన్ కళ్యాణ్ ఒక్కడే ఈ పని చేద్దామనుకున్నారు. కానీ ఇప్పుడు త్రివిక్రమ్ కూడా కలిసారు. ఇందుకోసం ఓ ఆఫీస్ ని జూబ్లీహిల్స్ లో నెలకొల్పాలని,ఆ పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఫస్ట్ ప్రొడక్షన్ కి సంభంధించిన ప్రకటన రానుందని తెలుస్తోంది. త్రివిక్రమ్..పవన్ చేస్తున్న ఈ పనికి పూర్తి స్ధాయి తోర్పాటు ఇస్తారని మాట ఇచ్చినట్లు చెప్తున్నారు.

  ఇక వీరి కాంబినేషన్ లో రూపొందిన 'అత్తారింటికి దారేది' చిత్రం విడుదల అంశం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. సీమాంధ్ర ప్రాంతంలో సమ్మె జరుగుతున్న నేపథ్యంలో విడుదల చేయడానికి నిర్మాతలు ఇష్టపడటం లేదు. డిస్ట్రిబ్యూటర్స్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సీమాంధ్ర ప్రాంతంలో సమ్మె ముగిసే వరకు సినిమా విడుదల అయ్యే అవకాశం లేదని, ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు సమ్మె ముగించి రోడ్డెక్కితే తప్ప సినిమా విడుదల కాదని అంటున్నారు.

  సెప్టెంబర్ 21న ఆర్టీసీ బస్సులు సమ్మె బాట వదలి రోడ్డెక్కుతాయని సమాచారం. అదే జరిగితే సినిమాను సెప్టెంబర్ 26న విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. అప్పుడు వీలు కాకపోతే అక్టోబర్ నెలలో సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. త్వరలోనే విడుదల విషయమై ఓ క్లారిటీ రానుంది.

  'అత్తారింటికి దారేది' చిత్రం సెన్సార్ బోర్డు సభ్యుల నుంచి ఈ చిత్రం క్లీన్ 'U' సర్టిఫికెట్ పొందింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బివిఎస్ఎన్ ప్రసాద్ రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్‌తో కలిసి సంయుక్తంగా నిర్మించారు. పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ ఈచిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా వినోదాత్మకంగా తెరకెక్కించారు. కామెడీ, యాక్షన్, రొమాన్స్ ఇలా అన్ని కమర్షియల్ అంశాలు ఇందులో ఉంటాయి.

  ఈచిత్రంలో నదియా పవన్ కళ్యాణ్ అత్త పాత్రలో నటించింది. కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

  English summary
  Pawan Kalyan and Trivikram have almost hogged the limelight this year. While AD waits in the can, the actor-director duo is planning to produce films together. Pawan contemplating to produce films on Pawan Kalyan Creations is old news, but the latest we hear is that he will collaborate with his good friend and director Trivikram. They also plan to introduce many newbie directors through their small and medium budget films. Very soon their first production will go on floor. Presently Pawan Kalyan is looking for good office locale in Jubilee Hills in Hyderabad. 
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more