Just In
Don't Miss!
- News
రిపబ్లిక్ డే: ట్రాక్టర్ ర్యాలీకి రూట్ మ్యాప్.. పరేడ్ నేపథ్యంలో ఆంక్షలు.. పబ్లిక్కు కూడా..
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Lifestyle
Republic Day 2021 : పరేడ్ లో పురుషుల కవాతుకు నాయకత్వం వహించిన ఫస్ట్ లేడో ఎవరంటే...
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పవన్ కళ్యాణ్- క్రిష్ మూవీ క్రేజీ అప్‌డేట్.. సినిమా బడ్జెట్, రేంజ్ ఏంటో తెలుసా?
ఇన్నాళ్లు రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ తిరిగి కెమెరా ముందుకు రావడం మెగా అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది. అడపాదడపా ఎవరో ఒక్కరు తప్పితే మిగిలిన వారంతా పవన్ రీ ఎంట్రీని స్వాగతిస్తున్నారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్‌పై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్- క్రిష్ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ అప్‌డేట్ బయటకు రావడం అందరిలో ఆసక్తి రేపుతోంది. ఇంతకీ ఆ అప్‌డేట్ ఏంటి? వివరాల్లోకి పోతే..

అలా వస్తున్నాడో లేదో..! ఇలా రెండు సినిమాలు
పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాలతో బిజీ కాబోతున్నారు. అలా రీ ఎంట్రీ ఇవ్వడంతోనే ఏకంగా రెండు సినిమాలను లైన్‌లో పెట్టేశాడు పవర్ స్టార్. వేణు శ్రీరామ్, క్రిష్ లాంటి దర్శకులతో సినిమాలు కన్ఫర్మ్ చేసి సెట్స్ పైకి కూడా వచ్చేశాడు. దీంతో మరోసారి వెండితెరపై పవన్‌ని చూసేయొచ్చని ఆయన అభిమానుల్లో ఆనందం రెట్టింపయింది.

కేవలం వారం రోజుల గ్యాప్.. పవన్ స్టెప్
ఓ వైపు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పింక్' రీమేక్ సినిమాలో నటిస్తూనే.. క్రిష్ తో మూవీ ప్రారంభించేశాడు పవన్. కేవలం వారం రోజుల గ్యాప్‌లోనే ఈ రెండు సినిమాలను సెట్స్ మీదకు రావడం విశేషం. అయితే 'పింక్' రీమేక్ సంగతేమో గానీ క్రిష్ దర్శకత్వంలో రూపొందే సినిమాకు మాత్రం భారీ బడ్జెట్ కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది.

ఖర్చుకు ఎక్కడా రాజీ లేదంటున్న ఏఎం రత్నం
పవన్ కళ్యాణ్- క్రిష్ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రానికి ఏఎం రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే ఖర్చుకు ఎక్కడా రాజీ పడకుండా ఆయన ఏకంగా 100 కోట్ల బడ్జెట్ ఈ సినిమా కోసం కేటాయించారని తెలుస్తోంది. చార్మినార్, తాజ్ మహల్ లాంటి భారీ సెట్స్ వేసి చిత్రాన్ని రూపొందించేలా సన్నాహాలు జరుగుతున్నాయట. ఈ మేరకు కొన్ని సెట్స్ కోసమే 25 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్లు టాక్.

జానపద నేపథ్యంలో సాగే పీరియాడిక్ డ్రామా
జనవరి 29వ తేదీన పవన్‌తో ఈ సినిమా మొదలుపెట్టేశాడు క్రిష్. హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలు నిర్వహించి షూటింగ్ ప్రారంభించారు. పవన్ కెరీర్‌లో 27వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా జానపద నేపథ్యంలో సాగే ఒక పీరియాడిక్ డ్రామా అని తెలుస్తోంది.

పవన్ లేకుండానే తొలి షెడ్యూల్
ఇక ఈ చిత్రంలో పవన్ బందిపోటుగా నటిస్తున్నాడని సమాచారం. ఇప్పటి వరకు తన కెరీర్లో ఒక్కసారి కూడా పీరియాడికల్ సినిమా చేయని పవన్ కళ్యాణ్.. తొలిసారి క్రిష్ కాంబినేషన్‌లో ఈ సినిమా చేయబోతున్నాడు. దీంతో ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 4 నుంచి మొదలు కానుంది. తొలి షెడ్యూల్ పవన్ లేకుండానే పూర్తి కానుందట.

పవన్ సరసన యంగ్ హీరోయిన్
ఇంకా టైటిల్ డిసైడ్ చేయబడని ఈ సినిమాలో పవన్ సరసన ప్రగ్యా జైస్వాల్ నటించనుందని తెలుస్తోంది. ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు జరిపిన క్రిష్.. ఆమె కాల్ షీట్స్ కూడా తీసుకున్నారని ఇన్‌సైడ్ టాక్. అలాగే ప్యాన్ ఇండియా లెవెల్‌లో భారీ స్థాయిలో ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడట క్రిష్.