Just In
- 23 min ago
మళ్లీ ప్రేమలో పడ్డ శృతి హాసన్: అతడితో అయిపోయిందంటూ.. పుసుక్కున నోరు జారి బుక్కైంది
- 1 hr ago
RRR నుంచి అదిరిపోయే అప్డేట్: గుడ్ న్యూస్ చెప్పిన ఎన్టీఆర్, చరణ్.. వాళ్లిచ్చే సర్ప్రైజ్ అదే!
- 3 hrs ago
హాలీవుడ్ చిత్రం గాడ్జిల్లా vs కాంగ్ ట్రైలర్ విడుదల: తెలుగుతో పాటు ఆ భాషల్లో కూడా వదిలారు
- 3 hrs ago
మహేశ్ బాబు పేరిట ప్రపంచ రికార్డు: సినిమాకు ముందే సంచలనం.. చలనచిత్ర చరిత్రలోనే తొలిసారి ఇలా!
Don't Miss!
- News
జగన్ తన గొయ్యి తానే తీసుకుంటున్నాడు, ఉద్యోగుల తీరు ఇలా దేశ చరిత్రలోనే లేదు : యనమల ఫైర్
- Sports
ఓ బౌన్సర్ తగిలితే భయం పోతుంది: శుభ్‌మన్ గిల్
- Lifestyle
జనన నియంత్రణ ఉన్నప్పటికీ గర్భం వచ్చే ప్రమాదం
- Automobiles
ఇదుగిదిగో.. కొత్త 2021 ఫోర్స్ గుర్ఖా; త్వరలో విడుదల, కొత్త వివరాలు వెల్లడి
- Finance
Gold prices today: రూ.49,000 స్థాయికి బంగారం ధరలు, వెండి స్వల్పంగా అప్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
షాకింగ్: దొంగగా మారుతున్న పవన్ కల్యాణ్.. ఆయన డైరెక్షన్‌లోనే ఇలాంటి పనులు.!
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన 'అజ్ఞాతవాసి' తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలకు దూరం అయిపోయాడు. ఆ తర్వాత తాను స్థాపించిన జనసేన పార్టీని ఎన్నికల్లో గెలిపించుకునేందుకు చాలా ప్రయత్నాలే చేశాడు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ప్రాతినిథ్యం వహించిన పార్టీ ఓటమి పాలవడంతో నిరాశకు గురయ్యారు. అయినా, ప్రజా సమస్యలపై పోరాటం సాగిస్తూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో పవన్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళితే..

ఎంతో మంది పేర్లు.. ఇది మాత్రం ఊహించలేదు
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిసినప్పటి నుంచి పవన్ కల్యాణ్ రీఎంట్రీ గురించి ఎన్నో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి. పవర్ స్టార్ త్రివిక్రమ్ సినిమా ద్వారా రీఎంట్రీ ఇస్తారని మొదట్లో ప్రచారం జరిగింది. ఆ తర్వాత క్రిష్ జాగర్లమూడి, హరీశ్ శంకర్ పేర్లు అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ఆయన వేణు శ్రీరామ్‌తో మూవీ చేస్తున్నారు.

దిల్ రాజుకు ఫిక్స్.. మిగతావి కూడా లైన్‌లోనే
బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన ‘పింక్' అనే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. దిల్ రాజు నిర్మాణంలో రాబోతున్న ఈ మూవీలో పవన్.. లాయర్‌గా నటించబోతున్నారు. త్వరలోనే ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాతో పాటే పవన్ మరికొన్ని చిత్రాల్లోనూ నటించేందుకు సిద్ధం అవుతున్నారట. ఈ క్రమంలోనే కొన్ని కథలను కూడా విన్నారని టాక్.

తర్వాతి సినిమా మాత్రం క్రియేటివ్ డైరెక్టర్‌తో
పవన్ కల్యాణ్ ‘పింక్' రీమేక్‌లో నటించబోతున్నారని కొద్ది రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. దీనికి అనుగుణంగానే దిల్ రాజు కూడా ఈ విషయాన్ని ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో దిల్ రాజు సినిమా తర్వాత పవన్ కల్యాణ్ నటించబోయే మూవీ గురించి ఓ ఆసక్తికరమై వార్త బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఆయన క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారట.

ఇందులో లాయర్‌గా.. అందులో దొంగగా
ప్రస్తుతం పవన్ చేయబోతున్న సినిమాలో లాయర్‌గా నటించబోతున్నాడు. హిందీలో అమితాబ్ పోషించిన పాత్రను ఆయన చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే క్రిష్ జాగర్లమూడి సినిమాను కూడా ప్రారంభించేస్తారని అంటున్నారు. ఇందులో పవర్ స్టార్ దొంగగా కనిపించబోతున్నారని ఇండస్ట్రీలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

చిరంజీవి తర్వాత.. అలాంటి మూవీతో
ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ‘సైరా: నరసింహారెడ్డి' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇది చారిత్రక నేపథ్యమున్న చిత్రం. ఇప్పుడు పవన్ కూడా అదే తరహా మూవీలో నటిస్తున్నాడట. క్రిష్ తెరకెక్కించే సినిమా మొఘల్ చక్రవర్తుల కాలం నాటికి చెందిన కథాంశంతో రాబోతుందని అంటున్నారు. ఇది భారీ బడ్జెట్‌తో రూపొందిస్తారని సమాచారం.

పింక్ అయ్యేలోపు పూర్తి చేస్తాడట
భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా పూర్తయిందని తెలుస్తోంది. అయితే, ఈ సినిమా లొకేషన్స్, నటీ నటులు.. టెక్నీషియన్ల ఎంపిక, టైటిల్ రిజిస్ట్రేషన్, మ్యూజిక్ సిట్టింగ్స్ తదితర పనులను ‘పింక్' రీమేక్ పూర్తయ్యేలోపు కంప్లీట్ చేస్తాడట క్రిష్. అంటే 2021లో ఈ మూవీ స్టార్ట్ అయ్యే అవకాశాలున్నాయని వినికిడి.