Just In
- 15 min ago
బాలయ్య సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో: ఆ రికార్డులపై కన్నేసిన నటసింహం.. భారీ ప్లానే వేశాడుగా!
- 1 hr ago
అదిరింది షో గుట్టురట్టు చేసిన యాంకర్: అందుకే ఆపేశారంటూ అసలు విషయం లీక్ చేసింది
- 2 hrs ago
విజయ్ దేవరకొండ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్: అందరూ అనుకున్న టైటిల్‌నే ఫిక్స్ చేశారు
- 3 hrs ago
టాలీవుడ్లో విషాదం: ప్రముఖ నిర్మాత కన్నుమూత.. సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ వరకు!
Don't Miss!
- News
రజనీకాంత్ సేన వలసల బాట .. డీఎంకేలో చేరిన మక్కల్ మండ్రం నేతలపై తలైవా టీమ్ చెప్పిందిదే !!
- Automobiles
ఈ ఏడాది భారత్‌లో లాంచ్ కానున్న టాప్ 5 కార్లు : వివరాలు
- Lifestyle
ఆరోగ్య సమస్యలకు మన పూర్వీకులు ఉపయోగించే కొన్ని విచిత్రమైన నివారణలు!
- Finance
పెట్రోల్, డీజిల్ ధరలు జంప్: హైదరాబాద్‌లో ఎంత ఉందంటే
- Sports
Brisbane Test: తొలిసారి ఐదేసిన సిరాజ్.. ఆసీస్ ఆలౌట్! టీమిండియా టార్గెట్ 328!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పవన్ కళ్యాణ్-క్రిష్ స్టోరీ అదేనా.. అతని పాత్రలో పవర్ స్టార్ నటిస్తున్నాడా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి ఫుల్ స్పీడ్‌లో ప్రాజెక్ట్స్ ఓకే చేస్తూ.. చకచకా షూటింగ్స్ కూడా కానిచ్చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో రాబోతోన్న పింక్ రీమేక్.. ఏఎమ్ రత్నం నిర్మిస్తున్న క్రిష్ సినిమా, మైత్రీ సంస్థలో రాబోతోన్న హరీష్ సినిమాలను ప్రకటించిన పవర్ స్టార్.. ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా.. పవన్ సినిమాలకు సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి. తాజాగా పవన్ కొత్త లుక్‌కూడా తెగ వైరల్ కాసాగింది.

పవన్ కొత్త లుక్..
ఇన్నాళ్లు గడ్డం లుక్‌లో ఉన్న పవన్ కళ్యాణ్.. నీట్‌గా తయారయ్యాడు. అదే లుక్‌లో పింక్ రీమేక్ షూటింగ్‌లోనూ పాల్గొన్నాడు. అయితే తాజాగా ఆయన తన లుక్‌ను మార్చేశాడు. గడ్డాన్ని తీసేసి ఉన్న పవన్‌ను చూసిన ఫ్యాన్స్ షాక్ అయ్యారు. అయితే కాస్త లావుగా అయ్యారని కామెంట్స్ వినిపిస్తున్నా.. కొత్తగా ఉండేసరికి పవన్ ఫ్యాన్స్ తెగ సంబరపడుతున్నారు.

క్రిష్ మూవీ కోసమే..
అయితే ఈ కొత్త లుక్ క్రిష్ తెరకెక్కించే సినిమా కోసమేనని టాక్ వినిపిస్తోంది. చారిత్రతక నేపథ్యంలో ఈ మూవీ రూపొందనుందని, పండగ సాయన్న పాత్రను పవన్ పోషించనున్నట్లు తెలుస్తోంది. అయితే పవన్ ఆ క్యారెక్టర్‌ను చేస్తున్నాడని టాక్ రాగానే.. ఆ వీరుడెవరా? అంటూ వెతకడం ప్రారంభించారు నెటిజన్లు.

భూస్వాముల ఆగడాలకు వ్యతిరేకంగా..
పందొమ్మిదో శతాబ్దానికి చెందిన పండగ సాయన్న.. మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేట ప్రాంతానికి చెందినవాడుగా చరిత్ర చెబుతోంది. నవాబ్ పేటలోని మెరగోని గ్రామంలోని పెత్తందార్లకు వ్యతిరేకంగా పోరాడి.. ప్రజల తరపున నిలబడేవాడు. దొరల దగ్గరి నుంచి సొమ్మును దొంగిలించి.. పేద వారికి పంచేవాడు. సాయన్నకు పెరుగుతున్న పరపతిని చూసి ఓర్వలేని కొందరు నిజాం ప్రభువుకు ఫిర్యాదు చేస్తారు.

కథలో ట్విస్టులు..
సాయన్నపై తప్పుడు కేసులు పెట్టి ఆయన్ను జైలుకు పంపించడం, అక్కడ సాయన్నను చంపాలనుకోవడం.. దీనికి వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలు చేయడం.. ఇలా కథలో చాలా ట్విస్ట్‌లుంటాయని తెలుస్తోంది. అయితే చివరకు సాయన్నను ఎలా పట్టుకున్నారు? ఎలా ఉరి తీశారన్న అంశాలు ఆసక్తికరంగా ఉంటాయని వినికిడి. వింటుంటే.. ఇదేదో సైరా కథలా ఉందన్న అనుమానం వస్తుంది కదా. అసలు పవన్ చేస్తున్న పాత్ర ఇదేనా? అనే దానిపై క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.