»   » పరస్పర సహకారంతో...టీవీ 9 , పవన్ కళ్యాణ్

పరస్పర సహకారంతో...టీవీ 9 , పవన్ కళ్యాణ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు, కన్నడలో లీడింగ్ ఛానెల్ గా ఉన్న టీవీ నైన్ ఛానెల్ వారు పవన్ కళ్యాణ్ తాజా చిత్రం కొమురం పులి ఆడియో పంక్షన్ టెలీకాస్ట్ రైట్స్ తీసుకున్నారు. వాళ్ళు తప్ప మిగతా ఛానెల్ వాళ్ళు టెలీకాస్ట్ చేయటానికి వీలుండదు. ఆడియో పంక్షన్ జరిగిన రోజు సాయింత్రం ప్రత్యేకంగా కట్ చేసి న్యూస్ ఛానెల్స్ కి భైట్స్ గా ఇస్తారు. గతంలో జల్సా చిత్రం ఆడియో పంక్షన్ ఆడియో రైట్స్ ని కూడా అలాగే ఓ ప్రముఖ ఛానెల్ కు అమ్మేసారు. అప్పుడు అభిమానులు మొత్త ఆ గంటో రెండు గంటలో ఆ ఆడియో పంక్షన్ చూడటం కోసం ఆ ఛానెల్ కు స్టే ట్యూన్ అవుతారు. ఈ రైట్స్ నిమిత్తం నిర్మాతలు ఛానెల్ నుండి భారీగానే వసూలు చేస్తారు. ఇక ఈ నెల 11వ తేదిన హైదరాబాద్ నొవోటెల్ లో సినీ ప్రముఖుల సమక్షంలో ఈ చిత్రం ఆడియో వేడుక జరగనుంది. ఆస్కార్ విజేత ఎ.ఆర్.రహమాన్ ఈ చిత్రానికి ఆడియో రిలీజ్ చేయటంతో అంతటా మంచి క్రేజ్ నెలకొని ఉంది. అందుకు తగ్గట్లుగానే గీతా ఆర్ట్స్ వారు రోజుకో ఆడియో ప్రోమోను యు ట్యూబ్ లో ఉంచి మరింత క్రేజ్ ని క్రియోట్ చేస్తున్నారు. ఈ సందర్భంలో తమ చిత్రానికి క్రేజ్ తెచ్చిపెడుతున్న టీవీ నైన్ కి ధాంక్స్ చెప్పుకోవాలి అని కొందరంటున్నారు. అదేమీ లేదు పవన్ కళ్యాణ్ క్రేజ్ తో టీవీ నైన్ టీఆర్ పి లు పెంచుకోవాలి చూస్తోందని మరికొందరంటున్నారు. ఏదైమైనా పరస్పర లబ్ది పొందుతున్నట్లే.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu