Pawan Kalyan‌తో పూరీ మూవీ.. టాప్ ప్రొడ్యూసర్ రంగంలోకి.. ఇతర హీరోలకు షాకిచ్చేలా పవర్‌స్టార్

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ సెకండ్ ఇన్సింగ్స్‌లో మంచి జోరు మీద కనిపిస్తున్నారు. వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఇతర హీరోలకు షాకిస్తున్నారు. ఇప్పటికే ఐదుకుపైగా సినిమాలకు ఓకే చెప్పిన పవన్ కల్యాణ్ మరో టాప్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో ఓ సెన్సేషనల్ ప్రాజెక్టుకు సిద్ధమవుతున్నారు. ఆ సినిమా వివరాల్లోకి వెళితే..

 పవన్, పూరీ కాంబినేషన్‌లో

పవన్, పూరీ కాంబినేషన్‌లో

టాలీవుడ్‌లో పవన్ కల్యాణ్, పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్‌కు మంచి క్రేజ్ ఉంది. బద్రి, కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రాలు వారి స్టామినాకు అద్దం పట్టాయి. ఈ రెండు చిత్రాలకు మధ్య పలు కథలు, సూపర్ హిట్లుగా నిలిచిన సినిమాలను పూరీ ముందుకు తీసుకెళ్లినప్పటికీ పవన్ కల్యాణ్ చేయడానికి నిరాకరించారనే విషయం తెలిసిందే. అయితే వారిద్దరూ మరో ప్రాజెక్టుకు సిద్ధమవుతున్నారు.

 టాప్ నిర్మాత కసరత్తు

టాప్ నిర్మాత కసరత్తు

పవన్ కల్యాణ్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్‌కు చెందిన టాప్ నిర్మాత ఒకరు పూరీ, పవన్ ప్రాజెక్టును సెట్ చేశారనే విషయం మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నది. ఈ వార్తను కూడా సదరు నిర్మాత ధృవీకరించారు.

కథపరంగా చర్చలు

కథపరంగా చర్చలు


ఇటీవల పవన్, పూరీ జగన్నాథ్ మధ్య కథపరంగా చర్చలు జరిగాయి. పూరీ చెప్పిన ఇంట్రెస్టింగ్ లైన్‌ పవన్ కల్యాణ్‌కు కూడా నచ్చింది. దాంతో వారిద్దరూ సినిమాను చేయడానికి సిద్దమవుతున్నారు. డేట్స్, షెడ్యూల్‌కు సంబంధించిన అంశాలపై కసరత్తు చేస్తున్నారు. దీనిపై ఓ సానుకూల అవగాహన తొందర్లోనే వచ్చే అవకాశం ఉంది అని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

టాగోర్ మధు నిర్మాతగా

టాగోర్ మధు నిర్మాతగా

ఇక పవన్ కల్యాణ్, పూరీ మధ్య ప్రాజెక్ట్ సెట్ చేసేందుకు ప్రముఖ నిర్మాత టాగోర్ మధు రంగంలోకి దిగారు. ఈ క్రేజీ కాంబినేషన్‌తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రకటన తొందర్లోనే బయటకు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ టాగోర్ మధు క్లారిటీ ఇస్తే ఇది అధికారికంగా సంచలన వార్త అవ్వడం, అభిమానుల్లో జోష్ పెంచడం గ్యారంటీ అనే మాట వినిపిస్తున్నది.

Recommended Video

'Aranya' Movie Motion Poster Released
 భారీ ప్రాజెక్టులతో పవన్ కల్యాణ్

భారీ ప్రాజెక్టులతో పవన్ కల్యాణ్

ఇదిలా ఉండగా, వకీల్ సాబ్ చిత్రంతో పవన్ కల్యాణ్ మరోసారి వెండితెరపై మ్యాజిక్ సృష్టించగా, ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, సాగర్ దర్వకత్వంలో అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాతోపాటు మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో హరీష్ శంకర్‌తో ఒక సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇక మరో రెండు, మూడు ప్రాజెక్టులకు కూడా పవన్ ఒకే చెప్పారు. జూలై 13 నుంచి సాగర్ దర్శకత్వంలో అయప్పనుమ్ కోషియం సినిమా షూటింగ్ మళ్లీ ప్రారంభం కానున్నది. ఈ షెడ్యూల్‌లో పవన్, నిత్యామీనన్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X