»   » త్రిష లిప్ ను లాక్ చేసే వయసు నాదికాదంటున్న పవర్ స్టార్..!

త్రిష లిప్ ను లాక్ చేసే వయసు నాదికాదంటున్న పవర్ స్టార్..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హిందీలో సూపర్ డూపర్ హిట్ అయినటువంటి సినిమా లవ్ ఆజ్ కల్ సినిమాని తెలుగులో పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై గణేష్ బాబు నిర్మిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. మొట్టమొదటగా ఇలియానాని హిరోయిన్ గా అనుకోని కోన్నికారణాల వల్ల త్రిషను ఎంపిక చేసిన విషయం అందరికి తెలిసందే. ఈ సినిమాకి ఖుషీగా అనే టైటిల్ ను పెట్టడం జరిగిందన్నారు. ఓరిజినల్ లవ్ ఆజ్ కల్ సినిమాలో సైప్ ఆలీఖాన్, దీపికా పదుకోనే నటించారు. అంతేకాకుండా ఈ సినిమాలో వీరిద్దరి మధ్య రెండు మూడు లిప్ లాక్ సీన్లు ఉన్నాయి.

ఐతే ఈ లిప్ లాక్ సీన్లకు త్రిష అంగీకరించినా పవన్ కళ్యాణ్ అంగీకరించలేదని సమాచారం. దానికి చాలా కారణాలు ఉన్నాయని ఈ చిత్ర దర్శకుడు జయంత్ సి పరాన్జీ తెలిపారు. పవన్ కళ్యాణ్ స్యయంగా జయంత్ సి పరాన్జీ తో ఇలాంటి సీన్లు మన సినిమాలో తీసేయండని, దానికి తోడు మా అన్నయ్య చిరంజీవి ఇమేజ్ కూడా ఇలాంటి సీన్లు వల్ల నాశనం అవుతుందని, ఐనా ప్రస్తుతం నేను అలాంటి సీన్లలో నటించే వయసు కూడా కాదని అన్నారని జయంత్ సి పరాన్జి వివరించారు. ఈ విషయం తెలిసిన త్రిష మాత్రం తెగ బాధ పడిపోతుందంట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu