»   » పవన్‌ కల్యాణ్‌కు దిమ్మతిరిగే రెమ్యునరేషన్.. 40 రోజులకు ఎంతో తెలుసా?

పవన్‌ కల్యాణ్‌కు దిమ్మతిరిగే రెమ్యునరేషన్.. 40 రోజులకు ఎంతో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ అంటే టాలీవుడ్‌కు బాక్పాఫీస్ ఖజానా. పవన్ కల్యాణ్ డేట్స్ దొరకడం అంటే నిర్మాతలకు కలెక్షన్ల పంటపండినట్టే. పవర్ స్టార్ సినిమా ఒప్పుకుంటే దిశ, దశ తిరిగిపోతుందనుకునే నిర్మాతలు కోకొల్లలు. ప్రస్తుతం నిర్మాత రాధాకృష్ణ నిర్మాణ సారథ్యంలో త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇటీవల ఓ నిర్మాత తన చిత్రంలో నటించాలని కోరి భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేయడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

  ఎన్నికల ముందు పవన్ మరో సినిమా

  ఎన్నికల ముందు పవన్ మరో సినిమా

  రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన పార్టీని పవన్ కల్యాణ్ సన్నద్ధం చేస్తున్నాడు. ఈ లోపు మూడు నాలుగు సినిమాలు చేసి రాజకీయాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టడానికి సిద్ధం అవుతున్నాడు. వచ్చే ఎన్నికల నాటికి సినిమాలు పూర్తి చేసి ఎన్నికల కోసం ప్రచారం చేయడానికి పవన్ కల్యాణ్ ప్రణాళికను రూపొందిస్తున్నారు. జిల్లాల వారీగా జనసేన సిపాయిలను రెడీ చేస్తున్నారు.

  Pawan Kalyan and Trivikram Film Satellite Rights Got Record Price
  సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవర్ స్టార్ చిత్రం

  సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవర్ స్టార్ చిత్రం

  రాజకీయంగా ఇలా ముందుకెళ్తునే త్రివిక్రమ్ సినిమా షూటింగ్‌లో నిమగ్నమయ్యాడు. త్వరగా త్రివిక్రమ్ సినిమాను పూర్తి చేసి మరో సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారు పవర్‌స్టార్. ఈ క్రమంలో సంతోష్ శ్రీనివాస్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మూడు నెలల్లోనే సినిమాను ఖచ్చితంగా పూర్తి చేయాలని ముందే హెచ్చరించినట్టు తెలుస్తున్నది.

  జోరందుకున్న ప్రీ ప్రొడక్షన్ పనులు

  జోరందుకున్న ప్రీ ప్రొడక్షన్ పనులు

  ఓ వైపు త్రివిక్రమ్ సినిమా షూటింగ్ జరుగుతుంటే.. దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తన సినిమాపై కసరత్తు చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జోరందుకున్నాయి. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించనున్నారనే వార్తలు మీడియాలో వస్తున్నాయి.

  భారీగా రెమ్యునరేషన్ ఆఫర్..

  భారీగా రెమ్యునరేషన్ ఆఫర్..

  త్రివిక్రమ్ సినిమా తర్వాత పవన్ నటించే చిత్రం కోసం భారీగా రెమ్యునరేషన్ నిర్మాత ఆఫర్ చేసినట్టు సమాచారం. ఈ సినిమా షూటింగ్ కోసం పవన్ 40 రోజుల కాల్షీట్స్ కేటాయించినట్టు తెలుస్తున్నది. ఒక్కో రోజుకు పవన్‌కు రూ. కోటి రూపాయల రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాత సిద్ధపడినట్టు తెలుస్తున్నది. అంటే 40 రోజుల కోసం పవన్ 40 కోట్ల రూపాయలు ఈ సినిమాకు పవర్ స్టార్ తీసుకొంటున్నారనే వార్త సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతున్నది.

  మళ్లీ పోలీసు పాత్రలోనే పవన్ కల్యాణ్

  మళ్లీ పోలీసు పాత్రలోనే పవన్ కల్యాణ్

  తమిళంలో సూపర్‌స్టార్ విజయ్ నటించిన పోలీస్ సినిమా రీమేక్‌గా ఈ చిత్రం రూపొందుతున్నట్టు తెలుస్తున్నది. పోలీస్ కథను తెలుగు నేటివిటికి అనుగుణంగా మార్చి సరికొత్తగా స్టోరీని తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ మరోసారి పోలీస్ పాత్రలో కనిపించనున్నారు.

  English summary
  Mythri Movie Makers banner is bankrolling this project. Pawan is playing a police officer role in this film and there is a talk that this is the remake of Vijay's film 'Police'. But there are some reports that Santosh Srinivas has taken the basic line from Vijay film and developed into a new verison. Reports suggest that Pawan has been paid a record Rs 40 crore remuneration, and he has to allot just 40 days of call sheets.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more