»   » పవన్ తాజా చిత్రం 'షాడో'విడుదల ఆ పండుగ రోజునే అంటున్నారు

పవన్ తాజా చిత్రం 'షాడో'విడుదల ఆ పండుగ రోజునే అంటున్నారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవన్‌కళ్యాణ్‌ హీరోగా గా తమిళ దర్శకుడు విష్ణువర్ధన్‌ డైరక్షన్ లో రూపొందుతోన్న చిత్రం 'షాడో '.ఈ చిత్రం దశరాకు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సంఘమిత్ర ఆర్ట్స్‌, ఆర్కా మీడియా వర్క్స్‌ ప్రై.లిమిటెడ్‌ ఆధ్వర్యంలో తిరుమలశెట్టి నీలిమ, శోభు యార్లగడ్డ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పవన్‌ సరసన సారా జేన్‌ డయాస్‌, అంజలీ లావానియా నటిస్తున్నారు. ఈ నెల 6 నుంచి ఈ చిత్రం షూటింగ్ కోల్‌కతాలో ప్రారంభమయింది.దాదాపు నలభై పర్శంట్ షూటింగ్ జూలై 26 నాటికి పూర్తవుతుంది.అందుకని నిర్మాతలు ఈ చిత్రం దశరాకు విడుదల చేయవచ్చని నమ్మకంగా ఉన్నారు.

ఈ చిత్రం గురించి దర్శకుడు విష్ణువర్ధన్‌ మాట్లాడుతూ...'ఆద్యంతం ఆసక్తికరంగా నడిచే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. పవన్‌ అభిమానులను ఆకట్టుకునే అంశాలతో సినిమా చాలా స్టెయిలిష్‌గా ఉంటుంది' అన్నారు. జాకీష్రాఫ్, అడవి శేష్, అతుల్ కులకర్ణి, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, అలీ, సుబ్బరాజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే రాహుల్ కోడా, కెమెరా .ఎస్.వినోద్, కూర్పు ఎ.శ్రీకర్‌ప్రసాద్, ఫైట్స్ శ్యామ్ కౌశల్, కళ సునీల్‌బాబు.

English summary
Pawan Kalyan’s current film, The Shadow , is fast finishing up its shoot in Kolkota. Directed by Vishnu Vardhan, the movie has already finished 40 percent and producers are confident of its release for Dussera festival.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu