»   » మనోళ్లు తట్టుకోగలరా? :అజిత్ లాగే ..పవన్ 'సాల్ట్ అండ్ పెప్పర్' లుక్

మనోళ్లు తట్టుకోగలరా? :అజిత్ లాగే ..పవన్ 'సాల్ట్ అండ్ పెప్పర్' లుక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తమిళంలో అజిత్ ...తన ఒరిజల్ లుక్ తో సినిమాల్లో కనిపించి అలరిస్తున్నారు. తెలుగులో ఆ ధైర్యం ఎవరూ చేయలేకపోతున్నారు. గంటలు తరబడి మేకప్ చేసుకుని తెరపై కనిపిస్తున్నారు. దానికి కారణం తాము చేసే పాత్ర అని చెప్తున్నారు. అయితే మన హీరోలు ఏ పాత్ర చేసినా అందులో మన హీరోనే కనపడతారనేది అందరికీ తెలిసిన విషయమే.

అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్...అజిత్ రూట్ లోకి వెళ్లి తన రియల్ లుక్ తో కనిపించబోతున్నట్లున్నారని సమాచారం. ఆయన బయట కనిపించినట్లే తెరపై కూడా అలాగే కనిపించి అదరకొట్టనున్నారట. ఈ లుక్ ఏ సినిమాలో మనకు కనిపించబోతుంది అంటే.. పవన్ కల్యాణ్, ఎస్.జే.సూర్య కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మూడో చిత్రంలో అని తెలుస్తోంది.

దాంతో పవన్ లుక్‌ విషయం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్‌టాపిక్ అయ్యింది. సగం తెల్ల జుట్టుతో మేకప్ లేకుండా నటించడానికి పవన్ రెడీ అయినట్లు తెలుస్తోంది.

ఎస్.జే.సూర్య దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో పవన్ పెప్పర్ లుక్‌లో కనిపిస్తాడని తెలుస్తోంది. రెండేళ్ల క్రితం అజిత్ నటించిన 'వీరం' (తెలుగులో 'వీరుడొక్కడే') సినిమాను స్ఫూర్తిగా తీసుకుని హీరో క్యారెక్టర్‌ ఉండేలా స్టోరీ సిద్ధం చేశాడట ఆకుల శివ. అందుకోసమే ఈ లుక్ లో కనిపిస్తాడని చెప్పుకుంటున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఖుషి దర్శకుడు ఎస్.జె.సూర్య దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగింది. ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ స్నేహితుడు, సర్దార్ గబ్బర్ సింగ్ చిత్ర నిర్మాత శరత్ మారార్ నిర్మిస్తున్నారు.

Pawan Kalyan to Sport 'Salt n Pepper' Look

ఈ చిత్రాన్ని ఈ నెల 29న ప్రారంభిస్తారనే ప్రచారం జరిగింది. అయితే పవన్-ఎస్.జె.సూర్య కాంబినేషన్లో వచ్చిన 'ఖుషి' చిత్రం రిలీజై నేటికి సరిగ్గా 15 ఏళ్లు పూర్తి కావడం, ముహూర్తం కూడా కలిసి రావడంతో ఈరోజే ప్రారంభించారట.

ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. ఓ ఫ్యాక్షన్ లీడర్ లవ్ స్టోరీ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్, ఎస్.జె.సూర్య గతంలో రెండు సినిమాలకు కలిసి పని చేసారు. అందులో ఒకటి 'ఖుషి' భారీ బ్లాక్ బస్టర్ కాగా, కొమురంపులి భారీ ప్లాపుగా నిలిచింది. చాలా కాలం తర్వాత మళ్లీ ఈ ఇద్దరూ కలిసి మూడో సినిమా మొదలు పెట్టారు.

ఈ సినిమా కోసం గత కొంతకాలంగా దర్శకుడు ఎస్.జె.సూర్య గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. రచయిత ఆకుల శివతో కలిసి దాదాపు 4 నెలలు సిటింగ్స్ వేసి స్టోరీ డెవలప్ చేసారు. చివరకు పవన్ కళ్యాణ్ మెచ్చే విధంగా, ఆయనకు సూటయ్యే స్టోరీని రెడీ చేసారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

గోపాల గోపాల సినిమా సమయంలో అనూప్ రూబెన్స్ కు మరో అవకాశం ఇస్తానని మాటిచ్చాడు పవన్. ఈ మేరకు ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ ను పవన్ కళ్యాణ్ సంగీత దర్శకుడిగా ఎంపిక చేసారు. బిల్లా, బెంగాల్ టైగర్ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన సౌందర్ రాజన్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు.

English summary
Pawan Kalyan is reportedly ready to shed these inhibitions and he will not be hiding his age for his upcoming film with SJ Suryah. Touted to be the love story of a faction leader, the story requires its protagonist to look a bit aged. So, Pawan will be appearing in white and white dresses with salt and pepper look just like Ajith did in 'Veeram'.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu