»   » పవన్ కళ్యాణ్ ... ‘స్టేట్ కు ఒక్కడే’!

పవన్ కళ్యాణ్ ... ‘స్టేట్ కు ఒక్కడే’!

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : "నీ లాంటోటు స్టేట్ కి ఒక్కడుంటాడు....నాలాంటోడు స్టేట్ కు ఒక్కడే ఉంటాడు" అంటున్నారు పవన్ కళ్యాణ్. అయితే ఇది రియల్ లైఫ్ లో కాదు...పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రంలో డైలాగు ఇది. ఈ డైలాగు రీసెంట్ గా లీకై అందరి ప్రశంసలు పొందుతోంది. ఈ డైలాగుకి థియోటర్ లో విజిల్స్ పడతాయంటున్నారు.

ఇక త్వరలో యూరప్ ..పవన్ కళ్యాణ్ హంగామా చేయనున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న విషయం తెలిసిందే. 20 రోజుల భారీ షెడ్యూల్ నిమిత్తం ప్రస్తుతం ఈ చిత్రం యూనిట్ యూరప్ బయలుదేరింది.

అక్కడ పవన్ కల్యాణ్, హీరోయిన్స్ సమంత, ప్రణీతలపై రెండు పాటలను, ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు. దేవిశ్రీప్రసాద్ స్వరాలందిస్తున్న ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.


ఆ సినిమాపై అంచనాలు ఇప్పటికే ఆకాశంలో ఉన్నాయి. బిజినెస్ కూడా అదే స్థాయిలో జరుగుతోందని సమాచారం. ఇక ఈ చిత్రానికి 'అత్తారింటికి దారేది' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అయితే... అధికారికంగా మాత్రం ఆ టైటిల్‌ని ఖరారు చేయలేదు.

మొత్తం 40 మంది ప్రముఖ తారాగణం మిగతా పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఆర్ట్ : రవీందర్, కో-ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.'

English summary
New leaked dialogue of pawan kalyan’s new movie(Aththarintiki Daaredi-working title). However, this title perfectly suits to pawan kalyan’s stature. The dialogue is as follows. ” NEELANTODU STREET KI OKKADUNTADU….NAALAANTODU STATE KI OKKADE VUNTADU”.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu