»   » నిజమా?: పాలిటిక్స్ విషయమై పవన్ వెనకడుగు

నిజమా?: పాలిటిక్స్ విషయమై పవన్ వెనకడుగు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశంపై గత రెండు రోజులుగా ఓ రేంజిలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో అందరికీ షాక్ ఇస్తూ పవన్ కళ్యాణ్ పెట్టదలిచిన ప్రెస్ కాన్ఫిరెన్స్ కాన్సిల్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పవన్ మీడియా మేనేజర్..." పాలిటిక్స్ కి చెందిన పవన్ కళ్య్యాణ్ ప్రెస్ మీట్ ప్రస్తుతం లేదు" అంటూ టెక్ట్స్ మెసేజ్ లు మీడియా సంస్ధలకు పంపినట్లు వెబ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే తర్వాత ప్రెస్ కాన్ఫిరెన్స్ ఏర్పాటు చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. దేశవ్యాప్తంగా మొత్తం తొమ్మిది దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ వి.ఎస్. సంపత్ బుధవారం ఉదయం ప్రకటించారు. ఈ ప్రకటన వచ్చిన కాస్సేపటికి ఈ మెసేజ్ వచ్చినట్లు చెప్తున్నారు.

'రాజకీయాలపై నా స్పందన మార్చి రెండో వారంలో తెలియచేస్తాను' అని ఇటీవలే పవన్ కల్యాణ్ ఓ సంక్షిప్త ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో... అప్పటి నుంచే సస్పెన్స్ మొదలైంది. తాజా రాజకీయాలను నిశితంగా గమనిస్తున్న పవన్ కల్యాణ్.. నిజాయితీతో కూడిన రాజకీయాల పట్ల ఓటర్లు ఆకర్షితులవుతున్నారని, తమ సమస్యలను అర్థం చేసుకోగల నేత కోసం వెతుకుతున్నారని భావిస్తున్నట్లుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇందుకు ఢిల్లీలో 'ఆప్' సాధించిన విజయాలే ప్రత్యక్ష నిదర్శనమని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.

ప్రస్తుతం పార్టీ స్థాపన ఆలోచన ప్రాథమిక దశలోనే ఉందని పవన్ సన్నిహితులు చెబుతున్నారు. అయితే... పవన్‌తో నేరుగా మాట్లాడితే తప్ప ఆయన భావనలపై అంచనాకు రాలేమని రాజకీయ నాయకులు పేర్కొంటున్నారు. నిజానికి... పవన్‌ను ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు స్వాగతించాయి. ఆయన వస్తే తమ పార్టీ రాష్ట్ర పగ్గాలు అప్పగించేందుకు సిద్ధమేనని తిరుపతిలో లోక్‌సత్తా జాతీయాధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ ఆహ్వానించారు. మరోవైపు... పవన్ తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారన్న ప్రచారం జరిగింది.

English summary
Pawan Kalyan's media manager send a text message saying, "There is no pressmeet of PAWAN KALYAN's political views as of now".
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu