For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్ సెట్: మహేశ్ బాబు సినిమాలో పవన్ కల్యాణ్!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోల మధ్య స్నేహ సంబంధాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతంలో పోలిస్తే ప్రస్తుత పరిస్థితుల్లో ఒకరి సినిమాలకు ఒకరు సాయం చేస్తున్నారు. అలాగే, సినిమా నచ్చితే ఇగోలను పక్కన పెట్టి ప్రశంసిస్తున్నారు. అన్నింటి కంటే ముఖ్యంగా మరో హీరోతో కలిసి నటించడానికి ముందుకు వస్తున్నారు. అందుకే ఈ మధ్య కాలంలో తెలుగు తెరపై ఎన్నో మల్టీస్టారర్ మూవీలు రూపొందాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్‌లో మరో క్రేజ్ కాంబో సెట్ అయినట్లు తెలుస్తోంది. అది కూడా మహేశ్ బాబు, పవన్ కల్యాణ్ కలయికలో అని సమాచారం. ఆ వివరాలు మీకోసం!

  రీఎంట్రీలో దూకుడు.. ఏకంగా అన్ని సినిమాలు

  రీఎంట్రీలో దూకుడు.. ఏకంగా అన్ని సినిమాలు

  రాజకీయాల కోసం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన పవన్ కల్యాణ్.. సుదీర్ఘ విరామం తర్వాత ‘వకీల్ సాబ్'తో రీఎంట్రీ ఇస్తున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. దీని తర్వాత క్రిష్ జాగర్లమూడి, సాగర్ కే చంద్ర, హరీశ్ శంకర్ తదితర దర్శకులతో సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు పవర్ స్టార్.

   హ్యాట్రిక్‌తో సత్తా చాటి... లైన్‌లో పెడుతున్నాడు

  హ్యాట్రిక్‌తో సత్తా చాటి... లైన్‌లో పెడుతున్నాడు

  మహేశ్ బాబు విషయానికి వస్తే.. ‘భరత్ అనే నేను', ‘మహర్షి' వంటి భారీ విజయాలను అందుకున్న అతడు.. గత సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరు'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు, కలెక్షన్ల పరంగానూ సత్తా చాటింది. దీని తర్వాత మహేశ్ వరుసగా ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నాడు.

  ‘సర్కారు వారి పాట'తో సరికొత్త ప్రయోగాలు రెడీ

  ‘సర్కారు వారి పాట'తో సరికొత్త ప్రయోగాలు రెడీ

  ప్రస్తుతం మహేశ్ బాబు.. పరశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట' అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేస్తోంది. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ జనవరి నుంచి ప్రారంభం అవుతుందని చిత్ర యూనిట్ తెలిపింది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌‌తో కలిసి మహేశ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

  టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్ సెట్టైయింది

  టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్ సెట్టైయింది

  కొద్ది రోజులుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ మూవీలు తరచూగా వస్తున్నాయి. చిన్న హీరోలే కాకుండా.. బడా స్టార్లు చేసిన సినిమాలూ రూపొందాయి. వీటిలో చాలా వరకు సూపర్ హిట్ అవడంతో, హీరోలంతా అదే తరహా చిత్రాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్‌లో సినిమా రాబోతుందని తాజాగా ఓ న్యూస్ లీకైంది.

  మహేశ్ బాబు సినిమాలో పవన్ కల్యాణ్ కీ రోల్

  మహేశ్ బాబు సినిమాలో పవన్ కల్యాణ్ కీ రోల్

  మహేశ్ బాబు గతంలో వెంకటేష్‌తో కలిసి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. అలాగే, మరో స్టార్ హీరో పవన్ కల్యాణ్ కూడా వెంకటేష్‌తో కలిసి ‘గోపాల గోపాల' అనే సినిమాలో నటించాడు. ఇప్పుడీ ఇద్దరి కాంబోలో సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. మహేశ్ కొత్త చిత్రం ‘సర్కారు వారి పాట'లో పవన్ నటిస్తున్నాడనేదే దాని సారాంశం.

  సినిమాను మలుపు తిప్పే పాత్రకు గ్రీన్ సిగ్నల్

  సినిమాను మలుపు తిప్పే పాత్రకు గ్రీన్ సిగ్నల్

  బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని మోసం చేసి పారిపోతోన్న వారిని టార్గెట్ చేస్తూ రూపొందుతోన్న చిత్రమే ‘సర్కారు వారి పాట'. ఇందులో మహేశ్ బాబు క్యారెక్టర్ ఎంతో స్పెషల్‌గా క్రియేట్ చేశాడట పరశురాం. ఇక, ఈ సినిమాలో అత్యంత ముఖ్యమైన పాత్రను పవన్ కల్యాణ్‌ చేయబోతున్నట్లు సమాచారం. 5 నిమిషాలే ఉండే ఈ రోల్ కథను మలుపు తిప్పుతుందని అంటున్నారు.

  English summary
  Mahesh Babu is an Indian film actor, producer, media personality, and philanthropist known for his works in Telugu cinema. He owns the production house G. Mahesh Babu Entertainment Pvt. Ltd. The younger son of veteran Telugu actor Krishna, Mahesh made his cameo as a child artist in Needa.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X