»   » పొలిటికల్ పవన్ కళ్యాణ్: 'గబ్బర్ సింగ్ 2' లో మార్పులు

పొలిటికల్ పవన్ కళ్యాణ్: 'గబ్బర్ సింగ్ 2' లో మార్పులు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : 'గబ్బర్ సింగ్ ' చేసేటప్పటికి పవన్ కల్యాణ్...రాజకీయంగా ఏక్టివ్ గా లేరు. ఇప్పుడు సీన్ మారింది. 'గబ్బర్ సింగ్ 2' చేస్తున్న ఈ సమయంలో ఆయన రాజకీయంగానూ పూర్తి ఏక్టివ్ గా ఉన్నారు. అవసరమైతే ఉద్యమాలు చేస్తానంటున్నారు. ఈ నేపధ్యంలో 'గబ్బర్ సింగ్ 2' స్క్రిప్టుని ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుని చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈ చిత్రం తన పొలిటికల్ ఇమేజ్ కు ఏ ఇబ్బంది పెట్టకుండా ఉండాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసమని ఆయన మ్యానరిజంలు దగ్గరనుంచి, డైలాగులు దాకా ప్రతీది ఆచి తూచి అడుగు వేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. అందుకనే లేటు అయినట్లు చెప్పుకుంటున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

'గబ్బర్‌సింగ్‌ 2' విశేషాల్లోకి వెళితే..

మరోసారి గబ్బర్‌సింగ్‌ అవతారంలో ప్రేక్షకుల్ని అలరించేందుకు రంగం సిద్ధం చేసుకొన్నారు పవన్‌ కల్యాణ్‌. ఆయన హీరోగా తెరకెక్కనున్న 'గబ్బర్‌సింగ్‌ 2' చిత్రీకరణ మే తొలి వారంలో మొదలుకానుంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'గబ్బర్‌సింగ్‌ 2'లో అనీషా ఆంబ్రోస్‌ హీరోయిన్ గా నటించబోతోంది. కథరీత్యా మరో హీరోయిన్ కూ చోటుందని సమాచారం. ఆ హీరోయిన్ మరెవరో కాదు...త్రిష అని తెలుస్తోంది.

Pawan Kalyan wants to Change his Mannerisms

ఈ మేరకు ఆమెను సంప్రదించారని చెప్పుకుంటున్నారు. అయితే కొత్త హీరోయిన్ అయితే బాగుంటుందని యూనిట్ అభిప్రాయపడుతోందని మతరో ప్రక్క వార్తలు వినపడుతున్నాయి. ఈ విషయమై ప్రొడక్షన్ టీమ్ కామెంట్ చేయటానికి ఇష్టపడటం లేదు. త్వరలోనే ఆ హీరోయిన్ ఎవరనేది తేల్చి అఫీషియల్ గా మీడియాకు స్టేట్ మెంట్ ఇవ్వనున్నారని తెలుస్తోంది.

'నాక్కొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంది...' అంటూ 'గబ్బర్‌సింగ్‌'లో పవన్‌ చేసిన సందడి ఇంటిల్లిపాదికీ నచ్చింది. ఆ చిత్రం విడుదలైన వెంటనే దానికి కొనసాగింపుగా మరో సినిమా చేయడంపై మొగ్గు చూపారు పవన్‌. తన సొంత సంస్థ పవన్‌ కల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌పై నిర్మించేందుకు సన్నద్ధమయ్యారు.

స్వయంగా స్క్రిప్టు పనుల్ని పర్యవేక్షిస్తూ సినిమాను ప్రారంభించారు. అయితే రకరకాల కారణాల వల్ల ఆ చిత్రీకరణ ఆలస్యమవుతూ వచ్చింది. ఇప్పుడు అన్నీ ఓ కొలిక్కి రావడంతో సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లాలని నిర్ణయించారు.

Pawan Kalyan wants to Change his Mannerisms

శరద్ మరార్ మాట్లాడుతూ... ''స్క్రిప్టు పని జరుగుతోంది. భారీ సినిమా కాబట్టి, కావలసిన అంశాలను పక్కాగా ఖరారు చేసుకుంటున్నాం. దర్శకుడు బాబీ స్క్రిప్టుకు తుది మెరుగులు దిద్దుతున్నారు. అంతా సిద్ధం కాగానే షూటింగ్ ప్రారంభ తేదీ అధికారికంగా ప్రకటిస్తాం'' అని శరత్‌మరార్ వివరించారు.

అలాగే 'గబ్బర్‌సింగ్ 2' స్క్రిప్టు విషయంలో పవన్ కల్యాణ్ పూర్తిగా లీనమైపోయారట. దర్శకుడికి సలహాలు, సూచనలిస్తూ స్క్రిప్టు పకడ్బందీగా రావడానికి సాయపడుతున్నారని చెప్పుతున్నారు. వాస్తవానికి, మీడియాలోని వార్తల నేపథ్యంలో ముందుగా షూటింగ్ మొదలుపెట్టి, కొద్ది రోజులు జరిపి, ఊహాగానాలకు తెర దించాలనే ప్రతిపాదన కూడా వచ్చిందని, కానీ, పవన్ మాత్రం అలా వద్దనీ, పూర్తి స్క్రిప్టుతో, లొకేషన్లను కూడా పక్కాగా నిర్ణయించుకొని ఏకధాటిగా షూటింగ్ జరుపుదామనీ దర్శక, నిర్మాతలకు నచ్చజెప్పినట్లు చెప్తున్నారు.

అలాగే గోపాల గోపాల ఫేమ్ డాలీ దర్శకత్వంలో సినిమా చేస్తానంటూ పవన్ చెప్పిన మాట నిజమే కానీ, దానికీ ఈ 'గబ్బర్ సింగ్2'కూ సంబంధం లేదని చెప్పుకొచ్చారు. మొత్తానికి, 'గబ్బర్ సింగ్2' ఆగినట్లేననీ, 'గోపాల గోపాల...' దర్శకుడు డాలీని స్క్రిప్టుతో రమ్మనమని కోరింది ఈ సినిమాకేననీ వస్తున్న వార్తలు తప్పని తేలింది. అంటే... 'గబ్బర్ సింగ్2' బాబీతో ఉన్నట్లే అని తేలింది. అయితే చిత్ర రెగ్యులర్ షూటింగ్ కోసం మాత్రం మరికొద్ది కాలం వేచి చూడక తప్పదు.

Pawan Kalyan wants to Change his Mannerisms

'పవర్' చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయిన బాబీ దర్శకత్వం వహించే ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ అందిస్తాడని తెలుస్తోంది. గబ్బర్ సింగ్-2 చిత్రానికి పవన్ కళ్యాణే స్టోరీ రాయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. వాస్తవానికి స్టోరీ, స్క్రీప్టు తయారు చేయడం లాంటి టాలెంట్ పవన్ కళ్యాణ్‌లో ఎప్పటి నుండో ఉంది. గబ్బర్ చిత్రంలో హిట్టయిన అంత్యాక్షరి టీం సీన్ పవన్ కళ్యాణ్ ఆలోచనే. ఆయన ఐడియాలజీ సినిమా హిట్ కావడానికి దోహద పడ్డాయి.

గబ్బర్ సింగ్-2 చిత్రం గతంలో వచ్చిన గబ్బర్ సింగ్, దబాంగ్ చిత్రాలకుతో సంబంధం లేకుండా సరికొత్త కథతో ఆవిష్కరించబోతున్నారు. ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ శరత్ మరార్ నిర్మించబోతున్నారు. బ్రహ్మానందం, అలీ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. అంత్యాక్షరి గ్యాంగ్ కూడా ‘గబ్బర్ సింగ్-2'లో కూడా నటించనుంది. ఈరోస్ వారు ఈ చిత్రం సహ నిర్మాతగా వ్యవహరిస్తూ ఈ బడ్జెట్ ని పెట్టడానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.

బాబీ మాట్లాడుతూ... ''గబ్బర్‌ సింగ్‌ సీక్వెల్‌ అంటే ప్రేక్షకులు ఎలాంటి అంశాలు ఆశిస్తారో తెలుసు. అవన్నీ మేళవించి ఈ కథను తయారు చేశాం. స్క్రిప్టు పక్కాగా పూర్తయింది. హీరోయిన్, మిగిలిన సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియజేస్తాం'' అని చెబుతున్నారు.

గబ్బర్ సింగ్-2 చిత్రాన్ని పవన్ స్నేహితుడు శరత్ మరార్ నిర్మిస్తున్నారు. తన స్నేహితుడికి మేలు జరుగాలనే ఉద్దేశ్యంతోనే ఈ సీక్వెల్ నిర్ణయం పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారనే వాదన కూడా ఉంది. 

English summary
Pawan Kalyan is working on changing his mannerisms a bit to match his current Political image...could be noticed in his upcoming flick 'Gabbar Singh 2' .
Please Wait while comments are loading...