పవన్ ఎంట్రీ రాంగ్ టైమా?.. దిల్ రాజుకు చుక్కలు కనిపిస్తున్నాయా?

Recommended Video

Can Pawan Kalyan Manage His Work ? | PSPK 26 | Janasena | Amaravati

మొత్తానికి పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. మేకప్ వేసుకుని రంగంలోకి దిగేశాడు కూడా. వీటికి సంబంధించిన ఫీలర్స్, రూమర్స్ గత కొన్ని రోజులుగా వస్తున్న ఎవ్వరూ, ఎక్కడా అధికారికంగా స్పందించలేదు. అయితే గుట్టుచప్పుడు కాకుండా, అనవరసరపు ఆర్భాటాలేవీ లేకుండా పింక్ రీమేక్ షూటింగ్‌లో పవన్ కళ్యాణ్ జాయిన్ అయిపోయాడు.

మారిన పరిస్థితులు..

మారిన పరిస్థితులు..


అయితే మొదటి రోజే లీకులు మొదలయ్యాయి. షూటింగ్ స్పాట్‌లోనుంచి పవన్ కళ్యాణ్ స్టిల్స్ సోషల్ మీడియాలో లీకయ్యాయి. ఈ మేరకు పవన్ కళ్యాణ్ షూటింగ్ స్టార్ట్ చేసేశాడని అందరికీ అర్థమైపోయింది. అయితే ఇది ముందుగానే అనుకున్న షెడ్యూలే అయినప్పటికీ.. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు వేడేక్కాయి.

అన్నీ ఒకేసారి..

అన్నీ ఒకేసారి..

రాజధాని రైతుల ఆందోళనలు, అసెంబ్లీ సమావేశాలు మొదలవడం, రాజకీయాలు వేడెక్కడం, ఇటు షూటింగ్ కూడా మొదలవ్వడం ఇలా అన్నీ ఒకేసారి మీద పడ్డాయి. అందుకే మొదటి రోజు షూటింగ్‌కు సంబంధించిన షెడ్యూల్‌లో భారీ మార్పులే కనిపించాయని తెలుస్తోంది.

ఉదయం ఏడు గంటలకే..

ఉదయం ఏడు గంటలకే..

మధ్యాహ్నానికే షూటింగ్ ప్యాకప్ చెప్పాలని, తనకు సాయంత్రం పార్టీ కార్యాలయంలో పని ఉందని ఉదయం ఏడు గంటలకే షూటింగ్ మొదలు పెట్టమని దిల్ రాజుకు చివరి నిమిషంలో చెప్పాడని టాక్. అయినా సరే దిల్ రాజు వెంటనే.. అంత ఏర్పాటు చేశాడని, అనుకున్నట్లే షూటింగ్ కూడా పూర్తి చేసి మధ్యాహ్నానికే పూర్తి చేసేలా చూశాడని సమాచారం.

ఇక ప్రతీ రోజూ ఇలానే..

ఇక ప్రతీ రోజూ ఇలానే..

రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కడం, అదే సమయంలో పవన్ రీ ఎంట్రీ ఇవ్వడం కొందరికీ నచ్చడం లేదనే టాక్ కూడా వినిపిస్తోంది. ఏది ఏమైనా అటు సినిమాలు, ఇటు రాజకీయాలు.. రెండు పడవలపై ఒకేసారి ప్రయాణం చేయబోతోన్నట్లు కనిపిస్తోంది. ఈ లెక్కన షూటింగ్ ఎప్పుడు, ఏ సమయానికి ఉంటుందో తెలియక.. నిర్మాతలకు, దర్శకుడికి ఇక చుక్కలే అని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X