For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పవన్-దిల్ రాజు మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ

  By Bojja Kumar
  |

  హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రముఖ నిర్మాత తిల్ రాజు కాంబినేషన్లో ఓ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ రాబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. పవనిజంతో ఇప్పటికే తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న పవన్ తన ఆలోచనలను సినిమా ద్వారా జనాల్లోకి తీసుకుపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.

  ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ నిన్ననే తన పాత్రకు డబ్బింగ్ మొదలు పెట్టారు. అక్టోబర్ 18న ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్, ఆడియో దుమ్ము రేపుతున్నాయి.

  చాలా కాలం తరువాత పూరీ జగన్నాథ్, పవన్‌కళ్యాణ్ కాంబినేషన్‌లో నిర్మితమైన 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం ప్రేక్షకులకు అదరహో అనిపిస్తుందనీ, తెరపై వీరిద్దరి స్టామినా తెలుస్తుందని నిర్మాత డి.దానయ్య తెలిపారు. ఇంటర్వెల్‌ ఎపిసోడ్‌, క్లైమాక్స్‌ అద్భుతంగా వచ్చాయని, మా బ్యానర్‌లో, పవర్‌స్టార్‌ కెరీర్‌లో ఇది ఓ బిగ్గెస్ట్‌ హిట్‌ సినిమా అవుతుందిపూరి జగన్నాథ్‌గారు పవర్‌స్టార్‌ కోసం రాసిన సూపర్‌ డైలాగ్స్‌కు థియేటర్‌ చప్పట్లతో దద్దరిల్లుతుంది. ఏకధాటిగా సింగిల్‌ షెడ్యూల్‌లో ఇంత భారీ చిత్రాన్ని పూర్తి చేయగలిగామంటే పూరిగారి ప్లానింగ్‌, పవన్‌కళ్యాణ్‌గారి హార్డ్‌వర్క్‌ ప్రధాన కారణాలు. వారి కాంబినేషన్‌లో ఇంత పెద్ద సెన్సేషనల్‌ ఫిలిం తీస్తున్నందుకు ఎంతో ఆనందంగా, గర్వంగా వుంది' అని అన్నారు. మణిశర్మ ఈచిత్రానికి ఎక్స్‌ట్రార్డినరీగా మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. సినిమా అన్ని వర్గాల వారిని ఎంటర్‌టైన్ చేస్తుంది. అక్టోబర్ 18న సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నాం, సినిమా మా అంచనాలను అందుకుంటుందనే ధీమా వ్యక్తం చేసారు.

  ప్రకాష్‌ రాజ్‌, గ్యాబ్రియల్‌, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, ఆలీ, ఎమ్మెస్‌ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మ ణ్యం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: శ్యామ్‌ కె.నాయుడు, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, సంగీతం: మణిశర్మ, నిర్మాణం: యూ నివర్సల్‌ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డి.వి.వి. దానయ్య, కథ-స్క్రీన్‌ప్లే- మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాధ్‌.

  English summary
  
 According to latest buzz, Power star Pawan Kalyan would be seen in his dream role which is a message oriented film to take his Pawanism into masses and become a idol in the hearts of common man.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X