»   » పవన్ గెడ్డం పెంచటం వెనక...అసలు నిజం ఇదా?

పవన్ గెడ్డం పెంచటం వెనక...అసలు నిజం ఇదా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : గత కొద్ది రోజులుగా మీడియాలో హాట్ టాపిక్..పవన్ కళ్యాణ్ గడ్డమే అని నిస్సందేహంగా చెప్పచ్చు. అయితే ఆయన గెడ్డం ఆయన ఇష్టం అనుకోకుండా ఆ గడ్డం గురించి రకకరాల కథలు ప్రచారమవటం మొదలయ్యాయి. అవి ఎంతదాకా వెళ్లాయంటే ఆయన గెడ్డం పెంచేది భీమవరం కు చెందిన ఓ స్వామీజి సూచనతో అని...అలాగే..మరికొందరు అదేమీ కాదు..పొలిటికల్ దీక్ష కోసం ఈ గెడ్డం పెంచారు అంటూ ప్రచారం మొదలెట్టారు. అయితే అసలు నిజం ఇదీ అని తెలుస్తోంది. ఆ నిజం ఏమిటీ అంటే....

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

పవన్ తన తాజా చిత్రం గబ్బర్ సింగ్ 2 లో ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందిట. ఆ ఫ్లాష్ బ్యాక్ లో పవన్ గెడ్డం పెంచుకుని కనపడతారని తెలుస్తోంది. ఆర్టిఫిషియల్ గెడ్డాలతో షూటింగ్ ఎందుకని, పవన్ తనే స్వయంగా గెడ్డం పెంచుకున్నారని సమాచారం. ఈ గెడ్డంతో వచ్చే ఎపిసోడ్ సినిమాలో హైలెట్ గా నిలువనుందని చెప్పుకుంటున్నారు. ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తోనే ...సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని అంటున్నారు. పూనే దగ్గర పల్లెలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుంది. అయితే ఇది ఎంత వరకూ నిజం అనేది తెలియాలంటే షూటింగ్ ప్రారంభం కావాల్సిందే.

చిత్రం విషయానికి వస్తే...

Pawan's Beard - only for Gabbar Singh 2.

గబ్బర్ సింగ్ 2 ప్రాజెక్టు ఎట్టకేలకు పట్టాలు ఎక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ 29 నుంచి ప్రారంభం కానుంది. అందుతున్న సమాచారం ప్రకారం ... ఈ చిత్రం షూటింగ్ ... పూనే దగ్గరలో ఉన్న రిమోట్ విలేజ్ లో ఫస్ట్ షెడ్యూల్ మొదలు అవుతోంది. గత కొద్ది రోజులుగా ఈ చిత్ర దర్శకుడు బాబీ, సినిమాటోగ్రాఫర్ జయనన్ విన్సెంట్ కలిసి ఈ సినిమా కోసం మహారాష్ట్రలో లొకేషన్స్ ని వెతుకుతున్నారు.

అలాగే మే 29న పూనేలో మొదలు కానున్న ఈ ఫస్ట్ షెడ్యూల్ జూన్ 5తో ముగియనుంది. ఈ షెడ్యూల్ తర్వాత... మిగిలిన లాంగ్ షెడ్యూల్స్ ని ఈ చిత్ర టీం ప్లాన్ చేసుకోనుంది. ఇద్దరు హీరోయిన్స్ ఉండనున్న ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా అనీష అంబ్రోసేని ఎంపిక చేసారు.

ఇక గత కొద్ది రోజులుగా...‘గబ్బర్ సింగ్2' చిత్రానికి చెన్నైలో దేవీశ్రీ మ్యూజిక్ సిట్టింగ్ వేశారని తెలుస్తోంది. ఈ మేరకు బాబీ, దేవిశ్రీప్రసాద్ ఇద్దరూ మ్యూజిక్ సిట్టింగ్ లలో పాల్గొంటున్నారని తెలుస్తోంది. ఇప్పటికే దేవి ఇచ్చిన రెండు ట్యూన్స్ ఓకే చేసారని అంటున్నారు. వాటిని పవన్ కి వినిపించి ...గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకోవటమే తరువాయి.

గబ్బర్ సింగ్ చిత్రం సైతం మ్యూజికల్‌గా పెద్ద హిట్‌ సాధించింది. ముఖ్యంగా ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ అందించిన పాటలు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చిత్రానికే హైలెట్‌గా నిలిచాయి. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘గబ్బర్ సింగ్-2' సినిమా కు సైతం దేవిశ్రీ మ్యాజిక్ నే నమ్ముకున్నారు. గబ్బర్ సింగ్ ని మించి హిట్టయ్యేలా పాటలు ఇవ్వాలని ఫిక్సై రాత్రింబవళ్లూ దేవి కష్టపడుతున్నట్లు వార్త.

Pawan's Beard - only for Gabbar Singh 2.

గతంలో పవన్, దేవీశ్రీ కాంబినేషన్‌లో వచ్చిన ‘జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది' చిత్రాలు మ్యూజికల్‌గా పెద్ద సక్సెస్ సాధించాయి.
బాబీ దర్శకత్వంలో రూపొందనున్న ‘గబ్బర్ సింగ్2' చిత్రాన్ని ప్రముఖ నిర్మాత శరత్ మరార్ నిర్మించనున్నారు.

కథరీత్యా మరో హీరోయిన్ కూ చోటుందని సమాచారం. ఆ హీరోయిన్ మరెవరో కాదు...త్రిష అని తెలుస్తోంది. ఈ మేరకు ఆమెను సంప్రదించారని చెప్పుకుంటున్నారు. అయితే కొత్త హీరోయిన్ అయితే బాగుంటుందని యూనిట్ అభిప్రాయపడుతోందని మరో ప్రక్క వార్తలు వినపడుతున్నాయి. ఈ విషయమై ప్రొడక్షన్ టీమ్ కామెంట్ చేయటానికి ఇష్టపడటం లేదు. త్వరలోనే ఆ హీరోయిన్ ఎవరనేది తేల్చి అఫీషియల్ గా మీడియాకు స్టేట్ మెంట్ ఇవ్వనున్నారని తెలుస్తోంది.

ఈ చిత్రం గబ్బర్‌సింగ్‌కు సీక్వెల్ కాదని, ప్రేమ, వినోదం, యాక్షన్ అంశాలు సమపాళ్లలో మేళవించిన కమర్షియల్ ఎంటర్‌టైనర్ అని దర్శక,నిర్మాతలు చెప్తున్నారు. ప్రస్తుతం బ్రహ్మానందం, ఆలీ, నర్రా శ్రీనులను తారాగణంగా ఎంచుకున్నారు. హిందీ చిత్ర పరిశ్రమ నుంచి మరికొంత మందిని తీసుకుంటారని సమాచారం. ఈ చిత్రానికి సంగీతం: దేవీశ్రీప్రసాద్, కెమెరా: జైనన్ విన్సెంట్, ఆర్ట్: ఆనంద్‌సాయి, కాస్ట్యూమ్స్ భానూమోరే, క్రియేటివ్ హెడ్: హరీశ్‌పాయ్.

English summary
Pawan's beard is linked only with, the one and only Gabbar Singh 2.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu