»   » పక్కా: 'గబ్బర్‌ సింగ్‌ 2' ఉంది... ఇవిగో పూర్తి డిటేల్స్

పక్కా: 'గబ్బర్‌ సింగ్‌ 2' ఉంది... ఇవిగో పూర్తి డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'నాక్కొంచెం తిక్కుంది...' అంటూ గబ్బర్‌ సింగ్‌గా పవన్‌ కల్యాణ్‌ చేసిన హంగామా ప్రేక్షకుల్ని ఆకట్టుకొంది. ఇప్పుడు 'గబ్బర్‌ సింగ్‌'కి రెండో భాగం రూపుదిద్దుకోబోతోంది. దర్శకుడు మారటం, బాబి సీన్ లోకి రావటం, ఇప్పటికీ ప్రారంభం కాకపోవటంతో సినిమా ఆగిపోయిందంటూ వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. దర్శకుడు బాబి(పవర్ ఫేమ్) నే...ఏమీ మారలేదు. ఏప్రియల్ నెలాఖరుంచి లేదా మే 1 నుంచి షూటింగ్ మొదలవుతుంది. అలాగే... మే నాలుగవ వారం నుంచి పవన్ డేట్స్ ఎలాట్ చేస్తున్నారు. అలాగే ఈ చిత్రం బడ్జెట్ దాదాపు 70 కోట్లు అని తెలుస్తోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

'పవర్' చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయిన బాబీ దర్శకత్వం వహించే ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ అందిస్తాడని తెలుస్తోంది. గబ్బర్ సింగ్-2 చిత్రానికి పవన్ కళ్యాణే స్టోరీ రాయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. వాస్తవానికి స్టోరీ, స్క్రీప్టు తయారు చేయడం లాంటి టాలెంట్ పవన్ కళ్యాణ్‌లో ఎప్పటి నుండో ఉంది. గబ్బర్ చిత్రంలో హిట్టయిన అంత్యాక్షరి టీం సీన్ పవన్ కళ్యాణ్ ఆలోచనే. ఆయన ఐడియాలజీ సినిమా హిట్ కావడానికి దోహద పడ్డాయి.

Pawan's Gabbar Singh 2 to start rolling!

గబ్బర్ సింగ్-2 చిత్రం గతంలో వచ్చిన గబ్బర్ సింగ్, దబాంగ్ చిత్రాలకుతో సంబంధం లేకుండా సరికొత్త కథతో ఆవిష్కరించబోతున్నారు. ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ శరత్ మరార్ నిర్మించబోతున్నారు. బ్రహ్మానందం, అలీ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. అంత్యాక్షరి గ్యాంగ్ కూడా ‘గబ్బర్ సింగ్-2'లో కూడా నటించనుంది.

ఈరోస్ వారు ఈ చిత్రం సహ నిర్మాతగా వ్యవహరిస్తూ ఈ బడ్జెట్ ని పెట్టడానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ టాప్ హీరోయిన్ ని ఈ చిత్రంలోకి తీసుకురావటానికి ఈరోస్ వారు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

బాబీ మాట్లాడుతూ... ''గబ్బర్‌ సింగ్‌ సీక్వెల్‌ అంటే ప్రేక్షకులు ఎలాంటి అంశాలు ఆశిస్తారో తెలుసు. అవన్నీ మేళవించి ఈ కథను తయారు చేశాం. స్క్రిప్టు పక్కాగా పూర్తయింది. హీరోయిన్, మిగిలిన సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియజేస్తాం'' అని సంపత్‌నంది చెబుతున్నారు. ఇక ఈ చిత్రం అఫీషియల్ గా లాంచ్ అయ్యింది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది.

గబ్బర్ సింగ్-2 చిత్రాన్ని పవన్ స్నేహితుడు శరత్ మరార్ నిర్మిస్తున్నారు. తొలిసారి సినీ నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్న తన స్నేహితుడికి మేలు జరుగాలనే ఉద్దేశ్యంతోనే ఈ సీక్వెల్ నిర్ణయం పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారనే వాదన కూడా ఉంది. 

English summary
'Gabbar Singh 2' is very much on and the shooting commences either by April end or in the 1st week of May. Pawan Kalyan has allotted call sheets for the Cop Drama from the 4th Week of next month.
Please Wait while comments are loading...