»   » పవన్ ‘కాటమరాయుడు’ లేటెస్ట్ లుక్ కాపీనా, విమర్శలు వెల్లువ?

పవన్ ‘కాటమరాయుడు’ లేటెస్ట్ లుక్ కాపీనా, విమర్శలు వెల్లువ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం డిజాస్టర్ తర్వాత...పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. కసిగా చేస్తున్న చిత్రం కాటమరాయుడు. తమిళ హీరో అజిత్ హిట్ చిత్రం 'వీరమ్‌'కు ఇది రీమేక్. ఈ సినిమాకు గోపాల గోపాల ఫేం డాలీ దర్శకత్వం వహిస్తున్నాడు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సినిమా పోస్టర్‌ను విడుదల చేసింది ఈ చిత్ర యూనిట్.

బాంబులు పేలడంతో లేచిన దుమ్ము బ్యాక్‌డ్రాప్‌తో తెల్లటి పంచె అంచును నుంచోని చేత్తో అందుకుంటున్న పవన్ ఉన్న ఆ పోస్టర్ అభిమానులను సంతోష సాగరంలో ముంచెత్తింది. ఇదే జోష్‌లో రెండో పోస్టర్‌ను విడుదల చేసిన చిత్ర యూనిట్ మూడో పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. అయితే, తొలి రెండు పోస్టర్లలో పవన్‌ను పూర్తిగా చూపించని దర్శకుడు.. ఈ పోస్టర్‌తో పంచెకట్టులో పవన్ సినిమాలో ఎలా ఉంటాడో చూపించాడు. ఈ పోస్టర్ పవన్ అభిమానులకు ఆనందం కలిగించింది. అయితే ఈ పోస్టర్ కాపీ అనే వివాదం మొదలైంది.

Pawan's Katamarayudu Inspired From Rowdy?

ఈ లుక్ చూసినవారంతా వర్మ దర్శకత్వంలో మోహన్ బాబు హీరోగా వచ్చిన రౌడి చిత్రం పోస్టర్ గుర్తు వస్తోందంటున్నారు. ఈ విషయమై సోషల్ మీడియాలో పెద్ద యుద్దం మొదలైంది. అది ఒరిజనల్ లుక్ అని పవన్ ఫ్యాన్స్ అంటూంటే..కాదు కాపీ అని మిగతా అభిమానుల అంటున్నారు.

ఈ పోస్టర్‌లో పవన్‌ లుక్‌ను ఉద్దేశించి ఆయన అల్లుడు, హీరో సాయిధరమ్‌తేజ్‌ ట్విట్టర్‌లో మాట్లాడారు. 'ఆ పంచకట్టు ఏదైతే ఉందో!! విజిల్స్‌ విజిల్స్‌' అని ట్వీట్‌ చేశారు. సాయిధరమ్‌తేజ్‌ ట్వీట్‌ను పవన్‌ అబ్బాయి, హీరో వరుణ్‌తేజ్‌ రీట్వీట్‌ చేస్తూ.. 'అడ్రినాలిన్‌ రష్‌' అని రాశారు.

Pawan's Katamarayudu Inspired From Rowdy?

సినీ ప్రముఖులు బండ్ల గణేశ్‌, హరీష్‌ శంకర్‌ 'ఆయన వస్తున్నారు..' అంటూ 'కాటమరాయుడు' కొత్త పోస్టర్‌ను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.
నూతన సంవత్సరం సందర్భంగా ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేస్తున్నారు. కిషోర్‌కుమార్‌ పార్దసాని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్‌ కథానాయికగా నటిస్తున్నారు. నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

Pawan's Katamarayudu Inspired From Rowdy?

శ్రుతిహాసన్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో శివబాలాజీ, అజయ్‌,కమల్‌ కామరాజు, అలీ, రావు రమేశ్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. తమిళంలో విజయం సాధించిన 'వీరమ్‌' చిత్రానికి రీమేక్‌గా 'కాటమరాయుడు'ని తెరకెక్కిస్తున్నారు.

English summary
people started trolling it by comparing Pawan Kalyan's Katamarayudu back look with Ram Gopal Varma's Rowdy featuring Mohan Babu in a deglam avatar and clad in lungi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu