Just In
Don't Miss!
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- News
రిపబ్లిక్ డే: ట్రాక్టర్ ర్యాలీకి రూట్ మ్యాప్.. పరేడ్ నేపథ్యంలో ఆంక్షలు.. పబ్లిక్కు కూడా..
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
100 కోట్లతో పవన్ పొలిటికల్ డ్రామా, త్రివిక్రమ్ ఆధ్వర్యంలో
హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న కాటమరాయుడు చిత్రం పూర్తయిన వెంటనే ఎలాంటి విశ్రాంతి తీసుకోకుండా త్రివిక్రమ్ సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్ళే ప్లానింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందే ఈ చిత్రం గురించిన ఓ ఆసక్తికరమైన విషయం ఇప్పుడు అందరినీ ఆలోచనలో పడేస్తోంది.
అందుతున్న సమచారం ప్రకారం.. పవన్-త్రివిక్రమ్ ల మూవీకి అక్షరాలా వంద కోట్ల బడ్జెట్ కేటాయించారని తెలుస్తోంది. టాలీవుడ్ లో బాహుబలి తర్వాత అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాగా ఈ మూవీ రికార్డుల్లో నిలపాలని నిర్మాత ప్రయత్నం అని చెప్తున్నారు.
ఇక .. ఇప్పటికే 'దేవుడే దిగివచ్చినా' అనే టైటిల్ ని త్రివిక్రమ్ , పవన్ చేత అయినట్లు తెలుస్తోంది. కామెడీ.. ఫ్యామిలీ ఎలిమెంట్స్ తోపాటు అటు పవన్ పొలిటికల్ కెరీర్ కి కూడా ప్లస్ అయ్యేలా ఈ సినిమా ఉండనుందనే టాక్ వినిపిస్తోంది.

ఈ మెగా ప్రాజెక్టు పవన్ కు రియల్ లైఫ్ లో పొలిటికల్ జర్నీకు ఉపయోగపడేలా ఉండాలని డిసైడ్ చేసారట. అప్పట్లో ఎన్టీఆర్ కు బొబ్బిలిపులి చిత్రంలా, ఈ చిత్రం పవన్ కు ఉపయోగపడాలని ప్లాన్ చేసినట్లు సమాచారం.
ఇక ఈ చిత్రం కథని ప్రస్తుతం జరుగుతున్న తెలుగు రెండు రాష్టాల రాజకీయాలు, నేషనల్ పాలికిట్స్ బేస్ చేసుకుని ఉండబోతోంది. త్రివిక్రమ్, ఆయన పార్టనర్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. డాలీ దర్శకత్వంలో చేస్తున్న కాటమరాయుడు పూర్తి కాగానే.. దేవుడే దిగివచ్చినా చిత్రానికి సంబంధించిన అనౌన్స్ మెంట్ వచ్చే అవకాసం ఉందంటున్నారు.
మరో ప్రక్క ఈ మూడు నెలల సమయంలో త్రివిక్రమ్ కు ఓ భారీ ఆఫర్ కూడా వచ్చినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఓ మీడియం బడ్జెట్ లో సినిమా చేయడానికి ఈ త్రివిక్రమ్ కు దాదాపు 10 కోట్ల రూపాయల పారితోషిక ఆఫర్ వచ్చిందని, అయినప్పటికీ త్రివిక్రమ్ దానిని అందిపుచ్చుకోలేదని, తన స్నేహితుడు పవన్ కళ్యాణ్ కోసం ఆ భారీ ఆఫర్ ను వదులుకున్నాడని చెప్తున్నారు.
త్వరలో పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రానున్న నేపధ్యంలో. దానికి ముందు ఒక భారీ హిట్ ను అదీ పొలిటికల్ ఎంట్రీకి ఉపయోగపడేలా తన స్నేహితుడికి కానుకగా ఇవ్వాలని త్రివిక్రమ్ నిర్ణయించుకుని ఆ పనిలో ఉన్నారట.
ఈ టైటిల్ ని నాగార్జున నటించిన సంతోషం చిత్రంలోని 'దేవుడే దిగి వచ్చినా' .. పాటలోని మొదటి పదాలను టైటిల్ గా తీసుకోబోతున్నారు. పవన్ ని ఆయన అభిమానులు దేముడుగా భావిస్తూంటారు. ఆ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఆయన స్క్రిప్ట్ ను సిద్ధం చేస్తున్నాడని తెలుస్తోంది. రాథా కృష్ణ ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్ బ్యానర్ పై నిర్మించనున్నట్టు సమాచారం.
ప్రస్తుతం త్రివిక్రమ్ ఈ సినిమా స్క్రిప్ట్ పనిలో బిజీగా వున్నారు. ఈ స్క్రిప్ట్ కి ఆయన ఇదే టైటిల్ పెట్టుకున్నారని సమాచారం. ఇది ఫైనల్ అవుతుందో లేదో గానీ వర్కింగ్ టైటిల్ మాత్రమే ఇదేనని విశ్వసనీయవర్గాల సమాచారం.