»   »  సెంటిమెట్ తోనే పవన్ ఫిక్స్ చేసాడు?

సెంటిమెట్ తోనే పవన్ ఫిక్స్ చేసాడు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సినిమా వాళ్లకు సెంటిమెంట్స్ కామన్. అయితే పవన్ కళ్యాణ్ వంటివారు సెంటిమెంట్స్ ఫాలో అవుతారా అంటే...కొన్ని వార్తలు వింటూంటే నిజమే...ఫాలో అవుతన్నారు అనిపిస్తుంది. బద్రి, ఖుషి, జల్సా, గబ్బర్ సింగ్ సినిమాలు సమ్మర్ కు రిలీజే అయ్యి సుపర్ హిట్ సినిమాలుగా మారడంతో ఇప్పుడు పవన్ వాటి దారిలోనే నడవాలనుకుంటున్నాడు.

అందుకే ఇప్పుడు సర్థార్ ను ఈ సమ్మర్ తీసుకురావలని ప్రయత్నిస్తున్నారని ట్రేడ్ వర్గాల సమాచారం. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ బయిట పడినటైంది. బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సర్దార్‌ గబ్బర్ సింగ్' 11మే 2016 న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

వేసవిలో అయితే శెలవలు కలిసి వస్తాయని టీమ్ భావిస్తోంది. ఈ విషయమై అధికారికంగా నిర్మాతల నుంచి ప్రకటన రావాల్సి ఉంది. మరో ప్రక్క ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రారంభమయ్యింది.

Pawan's ‘Sardaar’ as on sentiment

రీసెంట్ గా గుజరాత్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సర్దార్ టీం మళ్లీ డిసెంబర్ 28 నుంచి సెట్స్‌పైకి వెళ్లేందుకు రెడీ అవుతోంది. డిసెంబర్ 28న మొదలు కాబోతోన్న సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ షెడ్యూల్ ఏకంగా 70 రోజులు పాటు విరామం లేకుండా జరగబోతోందని చెప్తున్నారు. ఈ మేరకు ప్లానింగ్ జరిగినట్లు చెప్తున్నారు. ముఖ్యంగా సండేస్ తప్ప శెలవు ఇవ్వకుండా...కాన్సర్టేషన్ గా వర్క్ చేయనున్నారు.

ఈ చిత్రంలో పవన్ సరసన కాజల్, రాయ్ లక్ష్మీ ఆడిపాడుతున్నారు. అలాగే కన్నడ భామ సంజన కూడా ఈ మధ్యనే ఈ లిస్ట్ లో చేరింది. పవన్ ఫ్యాన్స్ ఈ సినిమా పై భారీగా అంచనాలు పెట్టుకున్నారు.

కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీకి దేవీశ్రీ స్వరాలు సమకూరుస్తున్నాడు. నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, పవన్‌ కల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌, ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. కళ: బ్రహ్మ కడలి, కూర్పు: గౌతంరాజు, పోరాటాలు: రామ్‌ లక్ష్మణ్‌, కెమెరా: జయనన్‌ విన్సెంట్‌.

English summary
Few super hits such as Badri, Kushi, Jalsa and Gabbar Singh were released in summer. Pawan Kalyan is releasing Sardaar also in summer.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu