»   » టెన్షన్ తగ్గించుకోవటానికే పవన్ ఆ నిర్ణయం?

టెన్షన్ తగ్గించుకోవటానికే పవన్ ఆ నిర్ణయం?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ మరో రీమేక్ కమిటయ్యాడని గత రెండు రోజులుగా మీడియాలో ఓ వార్త గుప్పు మంది. తమిళంలో అజిత్ హీరోగా వచ్చి హిట్టైన ‘వేదాళం' అది. అంతేనా ..ఈ రీమేక్ ని ఎన్టీఆర్ తో ‘రభస'చేసిన సంతోష్ శ్రీనివాస్ చేతిలో పెడుతున్నాడనీను. అయితే ఇది రూమర్ కాదు నిజమే అని పవన్ కు చెందిన కొందరు అంటున్నారు.

గతంలోనూ పవన్ రీమేక్ లు చేసి హిట్ కొట్టారు. దాంతో ఈ సారి మరో రీమేక్ అయితే కథ విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదని పవన్ ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెప్తున్నారు. తాజాగా చేస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ కోస ఆయన కలం పట్టి కథ,కథనం వండిన సంగతి తెలిసిందే.

Pawan to Star in Vedalam Remake

ఈ నేపధ్యంలో రీమేక్ అయితే మన నేటివిటీ కు తగినట్లు మార్చుకుంటే సరిపోతుంది. అదీ సక్సెస్ ఫుల్ రీమేక్ అయితే దాదాపు అన్ని ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెప్తున్నారు. అయితే పూర్తి నిర్ణయమైతే పవన్ తీసుకోలేదని అంటున్నారు.


అజిత్‌ నటించిన తమిళ చిత్రం ‘వేదాళం'...మాస్‌, యాక్షన్‌, కుటుంబ బంధాలు కలగలిపిన ఈ చిత్రం బాక్సాఫీసు దగ్గర మంచి విజయాన్ని అందుకొంది. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేస్తే ఎలా ఉంటుందా అని పవన్‌ ఆలోచిస్తున్నారు. ‘కందిరీగ'తో ఆకట్టుకొన్న సంతోష్‌పై నమ్మకంతో ఈ రీమేక్‌కి అతనికి అప్పగించినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం మరికొద్ది రోజులు ఆగాలి.

English summary
Pawan Kalyan has decided that the Telugu remake of Vedalam will be his next project and after a lot of deliberations, it has been decided that Santosh Srinivas will be helm the project
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu