»   » తెలుగు డైరెక్టర్‌తో పూనమ్ బజ్వా రహస్య వివాహం?

తెలుగు డైరెక్టర్‌తో పూనమ్ బజ్వా రహస్య వివాహం?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ పూనమ్ భజ్వా గుర్తుందా? నాగార్జున హీరోగా తెరకెక్కిన 'బాస్' చిత్రంలో గ్లామరస్ లుక్ తో ఆకట్టుకుంది. ఆ తర్వాత అల్లు అర్జున్ 'పరుగు' చిత్రంలో హీరోయిన్ సోదరిగా నటించింది. ఈ మధ్య ఆమె తెలుగు సినిమాల్లో కనిపించడం లేదు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పూనమ్ బజ్వా వివాహం మూడు రోజుల క్రితం రహస్యంగా జరిగినట్లు తెలుస్తోంది. తెలుగు దర్శకుడు సునీల్ రెడ్డిని ఆమె వివాహం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయమై ఇంకా అఫీషియల్ సమాచారం వెలువడాల్సి ఉంది.

Poonam Bajwa

తెలుగులో కళ్యాణ్ రామ్ తో 'ఓం 3డి' అనే సినిమాకు సునీల్ రెడ్డి దర్శకత్వం వహించారు. సాయి ధరమ్ తేజ తో 'తిక్క' అనే సినిమా చేస్తున్నారు. ఇద్దరూ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నట్లు సమాచారం. అయితే ఇంత సింపుల్ గా, రహస్యంగా రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసుకోవడం ఏమిటనేది చర్చనీయాంశం అయింది.

వీరి వివాహానికి ఎవరైనా అడ్డు పడ్డారా? లేక మరేమైనా కారణం ఉందా? వైభవంగా జరుపుకోవాల్సిన వివాహం ఇలా ఎందుకు చేసుకున్నారు? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. పూనమ్ బజ్వా సినిమాల విషయానికొస్తే...ప్రస్తుతం తమిళం, మళయాలంలో నాలుగు సినిమాల్లో నటిస్తోంది.

English summary
Film Nagar source said that, actress Poonam Bajwa has tied the knot, in a registration office, three days ago. The groom is Sunil Reddy of Om 3D and Tikka fame. The actress-director duo are known to maintain a low profile.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu