Just In
- 2 min ago
బాలయ్య సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో: ఆ రికార్డులపై కన్నేసిన నటసింహం.. భారీ ప్లానే వేశాడుగా!
- 1 hr ago
అదిరింది షో గుట్టురట్టు చేసిన యాంకర్: అందుకే ఆపేశారంటూ అసలు విషయం లీక్ చేసింది
- 2 hrs ago
విజయ్ దేవరకొండ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్: అందరూ అనుకున్న టైటిల్‌నే ఫిక్స్ చేశారు
- 3 hrs ago
టాలీవుడ్లో విషాదం: ప్రముఖ నిర్మాత కన్నుమూత.. సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ వరకు!
Don't Miss!
- News
రజనీకాంత్ సేన వలసల బాట .. డీఎంకేలో చేరిన మక్కల్ మండ్రం నేతలపై తలైవా టీమ్ చెప్పిందిదే !!
- Lifestyle
ఆరోగ్య సమస్యలకు మన పూర్వీకులు ఉపయోగించే కొన్ని విచిత్రమైన నివారణలు!
- Finance
పెట్రోల్, డీజిల్ ధరలు జంప్: హైదరాబాద్‌లో ఎంత ఉందంటే
- Sports
Brisbane Test: తొలిసారి ఐదేసిన సిరాజ్.. ఆసీస్ ఆలౌట్! టీమిండియా టార్గెట్ 328!
- Automobiles
టాటా ఆల్ట్రోజ్ ఐటర్బో పెర్ఫార్మెన్స్ను చూపించే కొత్త టీజర్ విడుదల
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
‘గోపాల గోపాల’ లో ఎగస్ట్రా డోస్
హైదరాబాద్ : పవన్ కల్యాణ్ వెంకటేష్‌తో కలిసి నటించిన చిత్రం 'గోపాల గోపాల'. శ్రియ హీరోయిన్. కిషోర్ పార్థసాని దర్శకత్వం వహించారు. డి.సురేష్‌బాబు, శరత్ మరార్ నిర్మాతలు. అనూప్ రూబెన్స్ స్వరాలు సమకూర్చారు. ఈ చిత్రంలోని గీతాలు ఇప్పటికే విడుదలయ్యి మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి. ఈ చిత్రంలో పోసాని పాత్ర హైలెట్ అవుతుందని ఇన్ సైడ్ టాక్.
పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.
హిందీ ఓ మై గాడ్ చిత్రం లో గోవింద నమోడె చేసిన ఈ పాత్రలో పోసాని కనిపించనున్నారు. ఈ పాత్రకు నేటివ్ టచ్ ఇచ్చి మరీ హైలెట్ చేసి కామెడీ చేయించినట్లు తెలుస్తోంది. ఆ సీన్స్ కు థియోటర్ దద్దరిల్లుతుందని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. దొంగ స్వామీగా చేసిన పోసాని తనదైన స్పెషల్ డైలాగు డెలవరితో అదరకొట్టాడని, త్వరలో ఆయన డైలాగుతో టీజర్ వదిలే అవకాసం ఉందని అంటున్నారు.
శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. విశ్వంలో సంభవించే ప్రతి విలయానికీ, ప్రతి అద్భుతానికీ దేవుడే కారణభూతుడు. సృష్టించేది దైవమే, నశింపజేసేదీ దైవమే. భగవద్గీత, ఖురాన్, బైబిల్... ఇలా ఏ పవిత్ర గ్రంథమైనా చెప్పేది ఇదే. మరి అలాంటప్పుడు మనిషి బాధలకు బాధ్యుడు దైవం కాక ఇంకెవరు? అని ప్రశ్నిస్తాడో సామాన్యుడు. ప్రకృతి విలయాన్ని సృష్టించి తన జీవనోపాధిపై దెబ్బకొట్టిన దైవంపై కోర్టుకెక్కాడు.

దైవమో, లేక ఆయన అనుచరులుగా చెప్పుకుంటున్న మతగురువులో ఎవరో ఒకరు తనకు నష్టపరిహారం చెల్లించాలని న్యాయదేవత ముందు గగ్గోలు పెడతాడు. మరి అభియోగం మోపబడ్డ దైవం ఏం చేసింది? ఆ వ్యక్తికి న్యాయస్థానంలో న్యాయం జరిగిందా? ఆసక్తికరమైన ఈ కథాంశంతో బాలీవుడ్‌లో తెరకెక్కిన చిత్రం 'ఓ మైగాడ్'. దేవునిపై కోర్టుకెక్కిన సామాన్యుడి పాత్రలో పరేశ్‌రావల్ జీవిస్తే, దైవంగా అక్షయ్‌కుమార్ అదరహో అనిపించేశారు. ఈ మధ్యకాలంలో బాలీవుడ్ తెరపై వచ్చిన అమోఘమైన ప్రయోగం 'ఓ మైగాడ్'.
ఈ కథను తెలుగీకరించాలనే ఆలోచన రావడమే పెద్ద సాహసం. ఈ విషయంలో నిర్మాతలు డి.సురేశ్‌బాబు, శరత్‌మరార్‌ను అభినందించాల్సిందే. ఇందులో పరేశ్‌రావెల్ పాత్రను వెంకటేశ్, అక్షయ్‌కుమార్ పోషించిన శ్రీకృష్ణుడి పాత్రను పవన్‌కల్యాణ్ పోషిస్తున్న విషయం తెలిసిందే. సవాల్‌గా తీసుకొని వీరిద్దరూ ఈ పాత్రల్ని పోషించారనితెలిసింది. కొంచెం ఇష్టం-కొంచెం కష్టం, తడాఖా చిత్రాల దర్శకుడు డాలీ ఈ చిత్రానికి దర్శకుడు. కథలోని ఆత్మ దెబ్బ తినకుండా ఇప్పటికే కొన్ని మార్పులు చేర్పులు కూడా చేసినట్లు తెలిసింది. మాతృకలో చేసిన పాత్రనే ఇందులో మిథున్ చక్రవర్తి పోషించనున్నారు.
మిథున్ చక్రవర్తి, పోసాని కృష్ణమురళి, కృష్ణుడు, రఘుబాబు, రంగనాధ్, రాళ్ళపల్లి, వెనె్నల కిశోర్, పృధ్వీ, దీక్షాపంత్, నర్రా శ్రీను, రమేష్ గోపి, అంజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: భవేష్ మందాలియా, ఉమేష్ శుక్ల, స్క్రీన్‌ప్లే: కిశోర్‌కుమార్ పార్థసాని, భూపతిరాజా, దీపక్‌రాజ్, కెమెరా: జయనన్ విన్సెంట్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, సంగీతం: అనూప్ రూబెన్స్, పాటలు:చంద్రబోస్, ఎడిటింగ్: గౌతమ్‌రాజు, ఆర్ట్: బ్రహ్మ కడలి, నిర్మాతలు: డి.సురేష్‌బాబు, శరత్ మరార్, దర్శకత్వం: కిశోర్ పార్థసాని.