Just In
- 1 hr ago
హాలీవుడ్ చిత్రం గాడ్జిల్లా vs కాంగ్ ట్రైలర్ విడుదల: తెలుగుతో పాటు ఆ భాషల్లో కూడా వదిలారు
- 1 hr ago
మహేశ్ బాబు పేరిట ప్రపంచ రికార్డు: సినిమాకు ముందే సంచలనం.. చలనచిత్ర చరిత్రలోనే తొలిసారి ఇలా!
- 3 hrs ago
ఘనంగా హీరో వరుణ్ వివాహం: సీసీ కెమెరాలు తీసేసి మరీ రహస్యంగా.. ఆయన మాత్రమే వచ్చాడు!
- 3 hrs ago
శ్రీరాముడిపై మోనాల్ గజ్జర్ అనుచిత వ్యాఖ్యలు: అందుకే అలాంటోడిని చేసుకోనంటూ షాకింగ్‌గా!
Don't Miss!
- Sports
IPL 2021: రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి కుమార సంగక్కర!
- News
దేశంలో నిరాటంకంగా ఎన్నికలు- త్వరలో రాజస్ధాన్, గుజరాత్లో- ఏపీలోనే విచిత్ర పరిస్ధితి
- Lifestyle
జుట్టు పెరగడానికి నూనె మాత్రమే సరిపోదు, ఇక్కడ మోకాలి పొడవు జుట్టు యొక్క రహస్యం ఉంది
- Finance
Budget 2021: హెల్త్ బడ్జెట్ డబుల్! నిర్మలమ్మ 'ప్రధానమంత్రి హెల్త్‌ఫండ్?'
- Automobiles
ఘన విజయం సాధించిన ఇండియన్ క్రికెట్ టీమ్‌కి ఆనంద్ మహీంద్రా స్పెషల్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ప్రభాస్ రెడీ.. ప్లాన్ ఇదే.. 2020లో యంగ్ రెబల్ స్టార్ స్కెచ్!
ఇటీవలే భారీ సినిమా 'సాహో'తో ప్రేక్షకుల ముందుకొచ్చిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఆయన అభిమానులకు నిరాశే మిగిల్చారు. ప్రభాస్ కెరీర్‌లో 'బాహుబలి' లాంటి భారీ సినిమా తర్వాత ఊహించని డిజాస్టర్ ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఆ లోటు పూడ్చుకోవాలని తన తర్వాతి సినిమా (జాన్)తో అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నారు ప్రభాస్. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఆసక్తికర అప్‌డేట్ తెలిసింది. వివరాల్లోకి పోతే..

ప్రభాస్ కెరీర్‌లో 20వ సినిమా
ప్రభాస్ కెరీర్‌లో 20వ సినిమాగా 'జాన్' ప్రేక్షకుల ముందుకు రానుంది. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే కొంతమేర షూటింగ్ కంప్లీట్ చేసుకుందని, కానీ మధ్యలో కొన్ని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చారని వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం మేరకు తిరిగి ఈ సినిమా రెగ్యులర్ షూట్ మోడ్ లోకి వచ్చి శరవేగంగా షూటింగ్ జరుపుకోనుందని తెలుస్తోంది.

సరికొత్తగా ప్రభాస్ మేకోవర్.. రెడీ
ఈ సినిమా కొత్త షెడ్యూల్ కోసం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్‌ని వేదిక చేసుకుందట ప్రభాస్ టీమ్. అక్కడ వేసిన భారీ సెట్‌లో మరో రెండు మూడు రోజుల్లో చిత్రంలోని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరగనుందట. ఇందుకోసం ప్రభాస్ సరికొత్తగా మేకోవర్ అయి రెడీగా ఉన్నారని టాక్.

స్క్రిప్ట్ మొదలుకొని లొకేషన్స్ వరకు అన్నీ.. ప్లాన్ ఇదే
ఇక ఈ సినిమాను తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. సాహో డిజాస్టర్ మరిపించేలా ఈ సినిమా ఉండాలని చూస్తున్నారట. ఈ మేరకు స్క్రిప్ట్ మొదలుకొని లొకేషన్స్, నటీనటులు అన్నిన్నిటిలోనూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా సమాచారం.

భారీ బడ్జెట్.. యూరప్ బ్యాక్‌డ్రాప్
ఇక ఈ చిత్రానికి దాదాపుగా 180 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. 1960 కాలం నాటి కథతో యూరప్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం. అందుకే భారీ ఎత్తున దాదాపు 25 రకాల సెట్స్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సెట్స్‌పై ప్రభాస్ యాక్షన్ ఎపిసోడ్స్ కనీవినీ ఎరుగని రీతిలో ఉంటాయట.

ప్రభాస్ రోల్.. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్
యూవీ క్రియేషన్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు గిభ్రాన్ సంగీతం సమకూర్చుతున్నారు. చిత్రంలో ప్రభాస్ సరసన యంగ్ హీరోయిన్ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో హస్త సాముద్రికం తెలిసిన వ్యక్తిగా ప్రభాస్ కనిపించనున్నాడని ఫిలిం నగర్ టాక్. ఈ సినిమా కోసం ప్రభాస్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. చూడాలి మరి ఈ 2020లో ప్రభాస్ 20తో ఎలా మ్యాజిక్ చేస్తాడో!.