For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హృతిక్, ఆమిర్ తర్వాత ప్రభాసే: బాలీవుడ్‌లోకి యంగ్ రెబెల్ స్టార్.. రూ. 1000 కోట్లతో సినిమా

  By Manoj
  |

  యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ మాంచి ఊపు మీద ఉన్నాడు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' తర్వాత వచ్చిన క్రేజ్‌ను సద్వినియోగం చేసుకునే పనిలో అతడు బిజీగా ఉన్నాడు. ఇందులో భాగంగానే ఇటీవల విడుదలైన తన సినిమా 'సాహో'ను హిందీలో కూడా విడుదల చేశాడు. అక్కడ ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. దీంతో బాలీవుడ్‌పై బాగా దృష్టి సారించాడని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడంటూ ఓ వార్త బయటకు వచ్చింది. అది కూడా సూపర్ హిట్ సిరీస్ ద్వారా అని అంటున్నారు. ఇంతకీ ఏంటా సినిమా?

  Prabhas Got Prestigious Bollywood Offer
   ఈ రెండింటి వల్ల పెరిగిన ప్రభాస్ స్టామినా

  ఈ రెండింటి వల్ల పెరిగిన ప్రభాస్ స్టామినా

  ‘బాహుబలి' ‘సాహో' సినిమాల వల్ల యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ స్టామినా అమాంతం పెరిగిపోయింది. అప్పటి వరకు తెలుగులో మాత్రమే అభిమానులను సంపాదించుకున్న ఈ స్టార్ హీరో.. రెండు సినిమాలతో దేశ వ్యాప్తంగా ఫ్యాన్ బేస్‌ను ఏర్పరచుకున్నాడు. అందుకే ‘సాహో'కు నెగెటివ్ టాక్ వచ్చినా.. భారీ వసూళ్లను రాబట్టిందన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.

   వాళ్లందరికీ మైండ్ బ్లాక్ అయిపోయింది

  వాళ్లందరికీ మైండ్ బ్లాక్ అయిపోయింది

  బాలీవుడ్‌లో స్ట్రయిట్‌గా రిలీజ్ అయిన స్టార్ హీరోల సినిమాలను మించి ‘సాహో' కలెక్షన్ల సాధించుకుంది. దీంతో బీ టౌన్‌లోని చాలా మంది ప్రముఖులకు మైండ్ బ్లాక్ అయిపోయిందని ఆ మధ్య టాక్ వినిపించింది. ఆ సినిమాను ఆడనీయకుండా ప్రయత్నాలు కూడా చేసిన వాళ్లు నోరెళ్లబెట్టేశారని గుసగుసలు వినిపించాయి.

  బడా నిర్మాణ సంస్థ దృష్టికి ప్రభాస్

  బడా నిర్మాణ సంస్థ దృష్టికి ప్రభాస్

  బాలీవుడ్‌లోనే కాకుండా ఇండియాలోనే బడా నిర్మాణ సంస్థగా పేరొందింది యష్ రాజ్ ఫిలిమ్స్. ఈ సంస్థ ఎన్నో భారీ సినిమాలను తెరకెక్కించింది. భవిష్యత్‌లో కూడా పలు చిత్రాలను నిర్మించేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ సంస్థ ప్రభాస్‌తో సినిమా చేయడానికి చర్చలు జరిపినట్లు తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. ఇది టాలీవడ్, బాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది.

   1000 కోట్ల బడ్జెట్ సినిమా సంతకం

  1000 కోట్ల బడ్జెట్ సినిమా సంతకం

  ప్రభాస్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా బయటకు వచ్చిన వార్తతో దీనికి బలం చేకూరుతోంది. యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మించే ఈ సినిమాను రూ. 1000 కోట్లతో తెరకెక్కిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఈ సినిమా ఏంటా అని అనుకుంటున్నారా..? ఇదే మోస్ట్ అవెయిటెడ్ ఫిల్మ్ ‘ధూమ్ 4'.

  ఈ ఫ్రాంచైజీ సూపర్ హిట్

  ఈ ఫ్రాంచైజీ సూపర్ హిట్

  ‘ధూమ్' సిరీస్‌లో వచ్చిన మూడు సినిమాలు ఎంతటి విజయాన్ని సాధించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో ఈ నాలుగో భాగంలో మరో స్టార్ హీరోను నటింపజేయాలని యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ భావిస్తోందని ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం సల్మాన్ ఖాన్, షారుఖ్, రణబీర్ కపూర్, అక్షయ్ లాంటి స్టార్లను అనుకున్నారు. కానీ, వాళ్లెవరూ దీనిని చేయనని చెప్పేశారని టాక్.

  హృతిక్, ఆమిర్ తర్వాత ప్రభాసే

  హృతిక్, ఆమిర్ తర్వాత ప్రభాసే

  ‘ధూమ్' మొదటి భాగంలో అభిషేక్ బచ్చన్‌తో పాటు జాన్ అబ్రహం నటించాడు. అలాగే, రెండో భాగంలో హృతిక్, మూడో పార్టులో ఆమిర్ ఖాన్ నటించి మెప్పించారు. ఇప్పుడు ప్రభాస్ ఈ సినిమా చేస్తే బడా హీరోల తర్వాత ఛాన్స్ పట్టేసిన వాడు అవుతాడు. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి యంగ్ రెబెల్ స్టార్ ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు.

  English summary
  News about Dhoom 4 being in the making spread like fire recently after Yash Raj Films posted an image featuring the title of the next Dhoom franchise, titled Dhoom Reloaded, on Twitter. Abhishek Bachchan and Uday Chopra’s characters are the only integral part of the franchise.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more