ప్రభాస్‌ రావడం వెనక చిరంజీవిపై కోపం ఉందట!

By Bojja Kumar

హైదరాబాద్: వ‌రుణ్‌తేజ్, దిశాప‌టాని హీరో హీరోయిన్లుగా పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ‘లోఫ‌ర్' చిత్ర ఆడియో వేడుక డిసెంబ‌ర్ 7న జ‌ర‌గ‌నుంది. ఈ వేడుక‌కు ప్ర‌భాస్ చీఫ్ గెస్ట్ గా హాజ‌రుకానున్నారట‌. ఈ వేడుక‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా వ‌స్తాడ‌ని అనుకున్నప్ప‌టికీ ప్రభాస్‌ను ఆహ్వానించాడు పూరి.

150వ సినిమా అవకాశం ఇచ్చినట్లే ఇచ్చి తనను కాదన్నందుకు పూరి కోపంగా ఉన్నారని.... ఆ కారణంగానే చిరంజీవిని పిలవడం ఇష్టం లేక ప్రభాస్‌ను చీఫ్ గెస్టుగా పిలిచాడనే ప్రచారం జరుగుతోంది. చిరంజీవితో పాటు మెగా ఫ్యామిలీ నుండి ఎవరినీ పిలవడం లేదు పూరి. అయితే ఈ చిత్ర నిర్మాత సి.కళ్యాణ్ మాత్రం అలాంటిదేమీ లేదని కొట్టిపారేసారు. చిరంజీవిగారు ఈ సినిమా కోసం వీడియో బైట్ ఇచ్చారని, దాన్ని ఆడియో వేడుకలో ప్రదర్శిస్తామని తెలిపారు.

 Prabhas Chief Guest for Varun Tej's Loafer'

లోఫర్ చిత్రాన్ని 18 డిసెంబర్ న విడుదల చేసేందుకు దర్శక, నిర్మాతలు తేదీ ని లాక్ చేసినట్లు సమచారం. ఈ చిత్రంలో రేవతి, పోసాని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు ఇంటర్నెట్లో విశేష స్పందన లభిస్తోంది. వరుణ్‌ తేజ్‌ హీరోగా ఇటీవల విడుదలైన 'కంచె' చిత్రం బాక్సాఫీసు వద్ద డీసెంట్ హిట్టయింది. ఈ నేపథ్యంలో లోఫర్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఈ సినిమాకు లోఫర్ అని టైటిల్ పెట్టడంపై పూరి స్పందిస్తూ...కథలో భాగంగానే ఆ పేరు పెట్టాం. ఇందులో కథానాయకుడికి పనీ పాట ఏమీ ఉండదు. కానీ చివరికి మంచివాడిలా మారతాడు. ఈ పేరు ఎందుకు పెట్టామో సినిమా చూశాక బాగా అర్థమవుతుంది అని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X