For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్రభాస్ దెబ్బకి ఆగిపోయిన రూ. 500 కోట్ల సినిమా.. బాలీవుడ్ ప్రముఖుల మైండ్ బ్లాక్

  |

  యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తాజాగా నటించిన చిత్రం 'సాహో'. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి తర్వాత వచ్చిన సినిమా కావడంతో దీనిపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇక, నాలుగు భాషల్లో విడుదల కావడానికి తోడు భారీ బడ్జెట్‌తో వస్తున్న చిత్రం అని ప్రచారం జరగడంతో ఈ సినిమాపై క్యూరియాసిటీ ఏర్పడింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ 'సాహో' ప్రభావం భారీగానే చూపించింది. దీంతో రూ. 500 కోట్ల సినిమా ఆగిపోయిందట

   టాక్ ఎలాగున్నా.. కలెక్షన్లు మాత్రం అదుర్స్

  టాక్ ఎలాగున్నా.. కలెక్షన్లు మాత్రం అదుర్స్

  సాహోకు ప్రీమియర్ షోల సమయంలో మంచి టాక్ వచ్చింది. ఆ తర్వాత విడుదలైన రోజు రెండో ఆట నుంచి టాక్ మారిపోయింది. ఈ సినిమాను కొందరు బాగుందని అంటుండగా, మరికొందరు మాత్రం బాలేదని అంటున్నారు. దీంతో మిశ్రమ స్పందనే ఈ చిత్రం పరిమితమైంది. అయినప్పటికీ సాహో కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. విడుదలైన నాలుగు భాషల్లోనూ అత్యధిక కలెక్షన్లతో సత్తా చాటుతోంది.

  నాలుగు రోజులకే రూ. 330 కోట్లు

  నాలుగు రోజులకే రూ. 330 కోట్లు

  మొదటి రోజు వరల్డ్ వైడ్ ప్రీమియర్స్ తో కలిసి రూ.130 కోట్ల గ్రాస్ వసూలు చేయగా రెండో రోజు కూడా అదే రేంజ్ లో కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రభాస్ క్రేజ్ తో ఈ సినిమా రెండ్రోజుల్లోనే రూ.200 కోట్ల మార్కును అధిగమించింది. ఇక, నాలుగు రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 330 కోట్లకు పైగా గ్రాస్‌ను సంపాదించింది. ఈ విషయాన్నీనిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ అధికారికంగా వెల్లడించింది.

  బాలీవుడ్ ప్రముఖుల మైండ్ బ్లాక్

  బాలీవుడ్ ప్రముఖుల మైండ్ బ్లాక్

  యంగ్ రెబెల్ స్టార్ సృష్టించిన ప్రభంజనంతో బాలీవుడ్‌ ప్రముఖులకు మైండ్ బ్లాక్ అయిందన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను ఆడనీయకుండా అక్కడి ఫిల్మ్ మేకర్లు ఎన్నో ప్రయత్నాలు చేశారని కొద్దిరోజులుగా వార్తలు కూడా వస్తున్నాయి. కానీ, ఎవరూ ఊహించని విధంగా సాహో హిందీ వర్షన్ భారీ వసూళ్లను రాబడుతోంది. అంతేకాదు, అక్కడి బడా హీరోల రికార్డులను కూడా బద్దలు కొట్టేసింది.

  ఆగిపోయిన రూ. 500 కోట్ల సినిమా

  ఆగిపోయిన రూ. 500 కోట్ల సినిమా

  బాలీవుడ్‌లో రూ. 500 కోట్ల బడ్జెట్ సినిమా ఆగిపోయిందని ఓ వార్త బయటకు వచ్చింది. దీనికి కారణం ప్రభాస్ నటించిన ‘సాహో'నే అని టాక్. ఇంతకీ అది ఏ సినిమా అనుకుంటున్నారా..? అదే.. సక్సెస్‌ఫుల్ ఫ్రాంచేజ్ నుంచి రాబోతున్న ‘ధూమ్ 4'. ఈ సినిమాను తెరకెక్కించడానికి ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా కథ పూర్తయిందట. అయితే, అందులో కొన్ని సన్నివేశాలు ‘సాహో'లో ఉన్న మాదిరిగానే ఉన్నాయట. దీంతో ఈ కథలో మార్పులు చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు బీ టౌన్‌లో ప్రచారం జరుగుతోంది.

  హీరోను తర్వాత ఎంపిక చేస్తారట

  హీరోను తర్వాత ఎంపిక చేస్తారట

  ధూమ్ సిరీస్‌లో వచ్చిన మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఈ భాగంలో మరో స్టార్ హీరోను నటింపజేయాలని యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ భావిస్తోందట. ఇందుకోసం సల్మాన్ ఖాన్, షారుఖ్, రణబీర్ కపూర్ లాంటి స్టార్లను అనుకున్నారు. కానీ, వాళ్లెవరూ చేయడానికి సిద్ధం కాలేదట. అంతేకాదు, ముందు కథ రెడీ చేయండి ఆ తర్వాత రండి అని సూచించారట. దీంతో విజయ్ కృష్ణ ఆచార్య స్క్రిప్ట్ వర్క్ చేశారని టాక్. ఇప్పుడు అది కూడా మార్చాల్సి వచ్చిదట.

  సాహో గురించి

  సాహో గురించి

  తెలుగు సినీ చరిత్రలోనే ప్రతిష్టాత్మకంగా రూపొందిన సినిమాల్లో ‘సాహో' ఒకటి. టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ సినిమాను దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్, హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో ‘రన్ రాజా రన్' ఫేం సుజిత్ తెరకెక్కించాడు. యూవీ క్రియేషన్స్ నిర్మించిన సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటించింది. ఈ సినిమా ఆగస్టు 30న నాలుగు భాషల్లో విడుదల అయింది.

  English summary
  Prabhas and Shraddha Kapoor joined hands for director Sujeeth’s Saaho, which is wreaking havoc at the box office in India. The film has grossed over Rs 200 crore in just two days and is still continuing its dream run at the box office.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X